27 February 2018

లక్షల కోట్ల పెట్టుబడులు..లక్షల ఉద్యోగాలు ఎక్కడొచ్చాయి?

– ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారు
– గవర్నర్‌తో కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు
– జీడీపీ విషయంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే
– బాబు పాలన చూస్తే బాధనిపిస్తోంది
– అడుగడుగునా నీళ్లు లేవని చెబుతున్నారు
– వెలుగొండ ప్రాజెక్టు చూస్తే వైయస్‌ఆర్‌ పాలన గుర్తుకు వస్తోంది
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో వెలుగొండకు మోక్షం లేదు
– చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోంది
–పెట్రోల్, డీజిల్‌ ధరల్లో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌
 
ప్రకాశం: ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు కట్టు కథలతో కాలయాపన చేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు చెబుతున్నారని, అవి ఎక్కడ ఉన్నాయో చూపాలని వైయస్‌ జగన్‌ నిలదీశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూస్తే బాధనిపిస్తుందని పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టును చూస్తే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన గుర్తుకు వస్తుందని చెప్పారు. రాజకీయ నాయకుడికి విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత, సిన్సియారిటి ఉండాలని వివరించారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పొదిలి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారో..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

ఎండకాలం ఎండలు తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా పొద్దునుంచి వేలాది మంది నాతో పాటు అడుగులో అడుగులు వేశారు. ఒకవైపున బాధలు చెప్పుకుంటూ, మరోవైపు నా భుజాన్ని తడుతూ అన్నా..నీకు తోడుగా మేమంతా ఉన్నామని నాతో పాటు అడుగులో అడుగులు వేశారు. ఈ నడిరోడ్డుపై నిలవాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. అయినా కూడా ఎండను ఖాతరు చేయకుండా నడిరోడ్డు అన్న సంగతిని లెక్క చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపుతున్నారు. ఆత్మీయతలు పంచుతున్నారు. ప్రేమానురాగాలు చూపుతున్నారు. మీ అందరి ఆత్మీయతలకు ముందుకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరు పేరున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

అన్నా..నీళ్లు లేవన్నా అంటున్నారు..
మార్కాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టగానే అడుగడుగునా నాకు కనిపించింది ఏంటో తెలుసా..అన్నా..నీళ్లు లేవన్నా అంటున్నారు. బాధనిపించింది. పక్కనే వెలుగొండ ప్రాజెక్టు కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన గుర్తుకు వస్తోంది. నాలుగేళ్లుగా వరుస కరువుతో రైతులు అల్లాడుతున్నారు. చంద్రబాబు జాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో చెప్పారు. కానీ బాబు వచ్చిన తరువాత నాలుగేళ్లు కరువు వచ్చింది. రబీ, ఖరీఫ్‌లో మైనస్‌ 34 శాతం వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌లో మైనస్‌ 70 శాతం వర్షపాతం. ఇంత జరుగుతున్నా కూడా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడి ఇ వ్వాలని కానీ, కరువు మండలంగా ప్రకటించాలని ఈ పాలనకు రావడం లేదు. ఏదైనా కరువు వస్తే ఖరీఫ్‌ నుంచి రైతులను ఆదుకునేందుకు వెంటనే కరువు మండలాలుగా ప్రకటించి ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ సొమ్ము ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తారు. ఈ ముఖ్యమంత్రి రైతు శ్రేయోభిలాషి కాదు. ఖరీఫ్, రబీలో కరువు వచ్చి దారుణంగా రైతుల పరిస్థితి ఉన్నా కూడా ఇన్సూరెన్స్‌డబ్బులు కట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వాట ఇంతవరకు చంద్రబాబు చెల్లించడం లేదు. ప్రజా సంకల్ప యాత్రలో నేను నిలదీయడంతో నామ్‌కే వాస్తిగా రెండు, మూడు కరువు మండలాలను ప్రకటించారు. కేబినెట్లో మంత్రులు రైతుల గురించి మాట్లడటం లేదు. కేబినెట్‌లో ఎవరి భూములు దోచుకోవాలి,  ఏ కాంట్రాక్టర్‌కు అంచనాలు పెంచి డబ్బులు దోచిపెట్టాలని ఆలోచిస్తున్నారు. 

సాగర్‌ జలాలు తెస్తారని ఎవరైనా ఊహించారా?
 సాగర్‌ జలాలను ప్రకాశం జిల్లాకు తీసుకొని వ చ్చి ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తారని ఎవరు ఊహించలేదు. చంద్రబాబు గతంలో 9 సంవత్సరాలు సీఎంగా పనిచేసి ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చే శారు. మొదటి సొరంగంలో 12 కిలోమీటర్లు, రెండో సోరంగంలో 9 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్లిపోయారు. ఇవాళ చంద్రబాబు ముఖ్యమంత్రి అయి నాలుగేళ్లు అవుతున్నా ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో కనీసం 4 కిలోమీటర్ల సొరంగం కూడా తవ్వలేదు. ఈ పెద్ద మనిషికి ప్రకాశం జిల్లాకు వస్తే వ వెలుగొండ గుర్తుకు వస్తుంది. జూన్‌ మాసంలో పూర్తి చేస్తామని కథలు చెబుతారు..ఆ తరువాత మరిచిపోతున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దాదాపు 4.30 లక్షల ఎకరాల్లో బూములు సస్యశ్యామలం అవుతాయి. ఎ్రరగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో నీరు అందించే ఈ ప్రాజెక్టును విస్మరించారు. తాగడానికి నీరు లేక ఒళ్లంతా వంకర్లు పొతున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితేనే ఈ సమస్యలు తీరుతాయి. ఆ ప్రాజెక్టు పరిస్థితి ౖచూస్తే బాధనిపిస్తుంది. పొదిలిలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నా..పాలకులు పట్టించుకోవడం లేదు. ఏ మాత్రం కూడా ప్రజలను పట్టించుకోవడం లేదు. ఇవాళ మీ అందరితో ఒక్కటే చెబుతున్నాను. ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని ఈ పెద్ద మనిషి ఊదరగొడుతున్న నేపథ్యంలో ఒక్కసారి చంద్రబాబు పాలన ఎలా సాగుతుందో ఆలోచించమని కోరుతున్నాను.

మోసం..అబద్ధాలు, అవినీతి, విచ్చలవిడి అధికార దుర్వినియోగం..
నాలుగేళ్ల చంద్రబాబు పాలనను ఆలోచన చేయండి. ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? ఏ ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు పాలనలో మోసం, అబద్ధాలు, అవినీతి, విచ్చలవిడి అధికార దుర్వినియోగం, రాజ్యాంగాన్ని తుట్లు పొడుస్తున్నారు. అడ్డగోలుగా ఆడియో, వీడియో టేపులతో దొరికినా కూడా వారు రాజీనామా చేయడం లేదు. 
– రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ ధరల బాదుడే..బాదుడు. పక్క రాష్ట్రంలతో పోలిస్తే..మన రాష్ట్రంలోని డీజిల్, పెట్రోల్‌పై రూ.7 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. దేశంలోనే పెట్రోల్‌ రేట్లలో ఏపీ నంబర్‌ వన్‌గా ఉంది. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఏమన్నారు..పిల్లలు తాగి చెడిపోతున్నారు. వస్తునే మద్యాన్ని రద్దు చేస్తామని, బెల్టు షాపులు తీసేస్తామని చెప్పారు. ఇవాళ గ్రామాల్లో తాగడానికి మంచినీరు ఉందో లేదో తెలియదు కానీ, మందు, బెల్టు షాపులు లేని గ్రామాలు లేవు. చంద్రబాబు ఐటేక్‌ పాలనలో ఫోన్‌ కొడితే మందు ఇంటికి వస్తోంది. 
– నాలుగేళ్ల క్రితం చంద్రబాబు కరెంటు చార్జీలు తగ్గిస్తామని అన్నారు. కానీ ఈయన సీఎం కాగానే మూడుసార్లు కరెంటు బిల్లులు పెంచారు. గతంలో రూ.50 నుంచి వంద వరకు వచ్చేది.  ఇప్పుడు రూ.500 నుంచి వెయ్యి వరకు కరెంటు బిల్లులు వేస్తున్నారు. ఈ రోజు పొద్దున నా వద్దకు ఓ అక్క వచ్చి మాకు మూడు ఫ్యాన్లు, టీవీ ఉంది. అయితే రూ.8 వేలు కరెంటు బిల్లు వచ్చిందని చెప్పారు.
– గతంలో రేషన్‌షాపుల్లో బియ్యం, కందిపప్పు, చక్కెర, గోదుమలు, కిరోసిన్‌ వంటి 9 రకాల సరుకులు ఇచ్చేవారు.  ఇప్పుడు బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. వెలిముద్రలు పడటం లేదని బియ్యంలో కూడా కోతలు విధిస్తున్నారు. ఈయన పాలన చూస్తే ఇంత దారుణంగా ఉంది. 

బాబు చేసిన మోసాలు మరిచిపోవద్దు
బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. రూ.87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను..బ్యాంకులో బంగారం ఇంటికి వచ్చిందా? బ్యాంకుల నుంచి వేలం నోటీసులు ఇంటికి వస్తున్నాయి. చంద్రబాబు రుణమాఫీ రైతుల వడ్డీలకు సరిపోవడం లేదు. ఆడవాళ్లను మోసం చేయాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. ఆడవాళ్లు కన్నీరు పెడితే రాష్ట్రానికి అరిష్టం అంటారు. చంద్రబాబు పుణ్యమా అని ప్రతి అక్కచెల్లెమ్మ కన్నీరు పెడుతోంది. పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? ఎన్నికలప్పుడు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చారు. ప్రతి ఇంటికి రూ.94 వేలు చంద్రబాబు బాకీ పడ్డారు. ఎప్పుడైనా చంద్రబాబు కనిపిస్తే ఆ డబ్బులు ఏమయ్యాయే అడగండి. అప్పుడైనా బుద్ది వస్తుందేమో. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఏదైనా హామీ ఇస్తే దాన్ని నెరవేర్చలేని నాయకుడు ఇంటికి వెళ్లాలి.

చంద్రబాబును పొరపాటున క్షమిస్తే ..
చంద్రబాబును పొరపాటున క్షమిస్తే..రేపు పొద్దున పెద్ద పెద్ద అబద్ధాలు, మోసాలు చేస్తారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. అయినా నమ్మరని బంగారానికి బోనస్‌గా బెంజీ కారు ఇస్తామంటారు. అంతేకాదు ప్రతి ఇంటికి చంద్రబాబు మనిషి వచ్చి ఓటుకు రూ.3 వేలు చేతిలో పెడతారు. డబ్బు ఇస్తే మాత్రం వద్దు అనకండి. రూ.5 వేలు గుంజండి. ఆ డబ్బు మనదే. మన జô బుల్లో నుంచి దోచేశారు. కానీ ఓటు మాత్రం మీ మనసాక్షి ప్రకారం వేయండి.  ఇటువంటి మోసాలు చేసే వ్యక్తులను బంగాళఖాతంలో కలపండి. అప్పుడే ఈ చెడిపోయిన వ్యవస్థలోకి విశ్వసనీయత అనే అర్థం వస్తుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే..మూడు రోజులుగా విశాఖలో పారిశ్రామికవేత్తల సమ్మిట్‌ చంద్రబాబు జరుపుతున్నారు. రాజకీయ నాయకుడికి  4 గుణాలు ఉండాలి. 1. వ్యక్తిత్వం, 2. విశ్వసనీయత, 3. కమిట్‌మెంట్, 4. సిన్సియారిటీ ఉండాలి. ఈ నాలుగు గుణాలు లేకపోతే అచ్చు చంద్రబాబులా తయారవుతారు.

బాబు మారాడని సంతోషపడ్డాం..కానీ..
ప్రత్యేక హోదా కావాలని మనమంతా అడుగుతున్నాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ధర్నాలు చేస్తూ నినదించాం. ప్యాకేజీతో మోసం చేయకండి..ప్రత్యేక హోదా మా హక్కు అని నినదించాం. ఆ రోజు ప్రత్యేక హోదా సంజీవినా అన్న చంద్రబాబు మళ్లీ ప్లెట్‌ మార్చారు. చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యిందని సంతోషపడ్డం. కానీ ఆయనలో చిత్తశుద్ధి లేదు. విశాఖలో నిర్వహించిన సీఐఐ సదస్సు ముగింపు సందర్భంగా గవర్నర్‌తో రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పించారు. గతంలో కూడా ఇ లాగే రూ.15 లక్షల కోట్లు వచ్చాయని గత రెండేళ్లుగా బుకాయించారు. ఆ పెట్టుబడులు, లక్షల కొద్ది ఉద్యోగాలు మీకు కనిపించాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్త ఢిల్లీలోని డిప్‌ అన్న ఇండస్ట్రీస్‌లో దరఖాస్తు చేయాలి. ఐఈఈఎంలో ఎంత మంది దరఖాస్తులు పెట్టారన్నది డిసెంబర్‌ 31న డేటా విడుదల చేస్తుంది. గతేడాది నాటికి మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంతో తెలుసా కేవలం ఏడాదికి రూ.5 వేల కోట్లు కూడా రాకపోతే..ఈ పెద్ద మనిషి రూ. 15 లక్షల కోట్లు అని ఊదరగొట్టడం రాష్ట్రానికి అన్యాయం చేయడం కాదా? రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నిజాయితీగా చెబుతారా? ఉన్నది లేనట్లు అబద్ధాలు చెబుతారా? ఈ నాలుగేళ్లలో వృద్ధిరేటు ఏపీలో పరుగులు తీస్తుందని, 12 శాతం ఉందని  చంద్రబాబు చెబుతున్నారు. దేశంలో 6 నుంచి 7 శాతం జీడీపీ పెరుగుతుంటే..మన రాష్ట్రంలో విడిపోయిన తరువాత 12 శాతం పెరుగుతుందని ప్రజలను మభ్యపెట్టడం సరైంది కాదన్నారు.  నాలుగేళ్లుగా కరువు కారణంగా గిట్టుబాటు ధరలు లేవు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరకడం లేదు. చంద్రబాబు మాత్రం వాస్తవిక పరిస్థితి పక్కన పెట్టి లేనిపోని కథలు చెబుతున్నారు. మన రాష్ట్ర తలసరి ఆదాయం పర్‌ క్యాపిట ఇన్‌కం రూ.1.22 లక్షలు సంపాదిస్తున్నారని చంద్రబాబు ఈనాడు ఇంటర్య్వూలో చెప్పారు. రాష్ట్రంలో లేని పరిశ్రమలు, ఉద్యోగాలు చూపిస్తే ..ప్రత్యేక హోదా ఎవరు ఇస్తారని చంద్రబాబును అడుగుతున్నాను. నాలుగేళ్లుగా ఇదే పెద్ద మనిషి ఇదే మాదిరిగా మోసం చేస్తున్నారు. నాలుగు రోజులు క్రితం ప్రత్యేక హోదా పల్లవి ఎత్తుకున్నారు. బాబులో మార్పు వచ్చిందని సంతోష పడితే ఈ రోజు సీఐఐ సదస్సు పెట్టి మళ్లీ రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ముసలి కన్నీరు కార్చుతున్నారు. సీఐఐ సమ్మిట్లలో దొంగ నంబర్లు చెబుతున్నారు. ప్రత్యేక హోదా కోసం మేం అవిశ్వాస తీర్మానం పెడతాం..మీరు మద్దతు ఇవ్వమంటే చంద్రబాబు ముందుకు రావడం లేదు. చిత్తశుద్ది ఏ అడుగులో కూడా కనిపించడం లేదు. ఇలాంటి అన్యాయమైన పాలనను, అబద్ధాలు చెప్పే, అవినీతి పాలనను పూర్తిగా బంగాళఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలని కోరుతున్నాను. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత తీసుకువచ్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, తోడుగా నిలువమని చేతులు జోడించి పేరు పేరునా ప్రార్థిస్తున్నాను.

No comments:

Post a Comment