1 February 2018

జనంతో కలిసిపోతున్న జగన్

వాస్తవానికి జగన్ పాదయాత్ర మీద ప్రతి పదిహేను రోజులకు ఒక వ్యాసాన్ని పోస్ట్ చెయ్యాలని అనుకున్నాను.  అందుకు అనుగుణంగా ఇప్పటికి అయిదు వ్యాసాలు పోస్ట్ చేసాను.  తాజాగా నిన్ననే అనుకుంటాను... ఒక వ్యాసంలో పాదయాత్రను సమీక్షించాను.  

మరి ఇవాళ మరొకటి రాయడానికి కారణం ఏమిటి అని మీరు ప్రశ్నించవచ్చు.  ఇప్పుడే ntv  వారు ప్రసారం చేసిన జగన్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ చూసాక ఈ వ్యాసాన్ని రాయాలనిపించింది.  ఇదే ఇంటర్వ్యూ ను సాక్షి వారు చేస్తే రాసేవాడిని కాను.  

కారణం మీకు తెలుసు.  NTV  అంటే ఎల్లో మీడియాలో ప్రధానభాగం.  వారు ఇప్పటివరకూ జగన్ పాదయాత్ర గూర్చి పెద్దగా ప్రసారం చేసింది లేదు.  మరి ఈరోజు చెయ్యడానికి కారణం ఏమిటి?  

జగన్ చేస్తున్న పాదయాత్ర గూర్చి పెద్ద ఎత్తున ప్రకంపనలు వస్తుండటం, 

చంద్రబాబు-మోడీ మధ్యన సంబంధాలు తెగుతున్న సూచన కనిపించడం, 

గత మూడున్నర ఏళ్లలో ప్రతిరంగంలోనూ చంద్రబాబు మూటకట్టుకున్న వైఫల్యాలు
,  
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తుంది అన్న ఆశలు సన్నగిల్లడం,
 
జాతీయపత్రికలు సైతం జగన్ యాత్ర గూర్చి రాస్తుండటం

వైసిపి అసెంబ్లీని బహిష్కరిస్తే జగన్ తీవ్ర విమర్శలపాలు అవుతాడు అనే అభిప్రాయాలు చెదిరిపోవడం

రోజు రోజుకు జగన్ కు ప్రజాదరణ పెరుగుతున్నదనే స్పృహ పొటమరించడం

తెలుగుదేశం కు ఇంకా  వంత పాడితే వీక్షకులలో చులకన అవుతామన్న భయం 

జనసేనాని ప్రభావం శూన్యం అనే వాస్తవం కళ్ళకు కట్టినట్లు బోధపడటం

కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకోకపోవడం 

వివిధ ఏజెన్సీలు చేస్తున్న సర్వేల్లో వైసిపి విజయం సాధిస్తుంది అనే ఫలితాలు వస్తుండటం 

ఇంకా జగన్ ను నిర్లక్ష్యం చేస్తే అతని ఆగ్రహానికి గురికాక తప్పదని భావించడం.  

ఇక ఈ ఇంటర్వ్యూ లో జగన్ సంధించిన విమర్శలు, గణాంకాలు, మేధోబద్ధ అంశాలపై జగన్ కు ఉన్న పట్టు ఏమిటో అందరికి అర్ధం అయింది.  ఎదో మసిపూసి మారేడుకాయ చేసినట్లు కాక లెక్కలతో సహా జగన్ వేసిన ప్రశ్నలు తెలుగుదేశం నాయకుల గుండెల్లో డైనమైట్లు పేల్చేట్లు ఉన్నాయి.  ఊరికే "జగన్ లక్ష కిలోమీటర్లు నడిచినా సీఎం కాలేదు" లాంటి చచ్చు విమర్శలు కాక... ఇక జగన్ సంధించిన ప్రశ్నలకు అధికారపార్టీ గణాంకాలతో వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి ఆవరించింది.  

అయితే చంద్రబాబు కేబినెట్లో ఒక్కరికి కూడా డొక్కశుద్ధి లేదు అని నా బలమైన నమ్మకం.  జగన్ విమర్శలకు దీటైన జవాబిచ్చే ప్రజ్ఞావంతులు కన్నుపొడుచుకున్నా ఒక్కరు కూడా చంద్రబాబు గారి మంత్రివర్గం లో లేరు.  చదువుకున్న వాడికి చదువు"కొన్న" వాడికి ఈరోజు జగన్ ఇంటర్వ్యూలో తేడా స్పష్టంగా తెలిసింది...తెలుసుకునే జ్ఞానం ఉన్నవారికి..

వందమంది మూర్ఖులకంటే గుణవంతుడైన పుత్రుడు ఒకడు చాలు.  వేలకొలది నక్షత్రాలు పారద్రోలలేని చీకటిని నెలరాజు ఒక్కడు తరిమేయగలడు....అంటారు ఆచార్య చాణక్యుడు.
Written by Ilapavuluri

No comments:

Post a Comment