1 February 2018

వైయస్‌ జగన్‌ ఏపీ ప్రజలకు వరం

నెల్లూరు: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాబోయే రోజుల్లో ఏపీకి నాయకత్వం వహించడం మనందరికి వరమని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరు బహిరంగ సభలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ..ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను దేశంలో ఎక్కడ..ఎవరూ చూసి ఉండరన్నారు. ఒకప్పుడు వెలుగు వెలిగిన రాష్ట్రం నేడు చంద్రబాబు పాలనలో మగ్గిపోతుందన్నారు. చేతి వృత్తులు, కుల వృత్తులు, ఇలా అన్ని వర్గాల సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్రగా బయలుదేరారన్నారు. వైయస్‌ఆర్‌ పాదయాత్ర చేసి ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యలు అన్నీ కూడా నెరవేర్చారన్నారు. చంద్రబాబు పాదయాత్రలో తప్పుడు హామీలు ఇచ్చి తీరా..అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు మొండిచెయ్యి చూపించిన నయవంచకుడు చంద్రబాబు అన్నారు. రాబోయే రోజుల్లో తన కొడుకును ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. వైయస్‌ఆర్, చంద్రబాబు మధ్య చాలా తేడా ఉందన్నారు. పేదవాడి కోసం వైయస్‌ఆర్‌ తపన పడ్డారన్నారు. అదే చంద్రబాబు, ఆయన చెంచాలు జన్మభూమి కమిటీలు మనిషి చనిపోతే పరిహారం ఇస్తామని చెబుతున్నారని, ఇదే వారిద్దరి మధ్య ఉన్న ఉదాహరణగా గమనించాలన్నారు. ఏపీలో ఎంతో మంది ఉద్దండులు ఉన్నా సరే పార్టీని నడపలేకపోయారని, వైయస్‌ జగన్‌ ప్రజల పక్షాన నిలబడి రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి అన్నారు. అలాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి రావడం మనందరి అదృష్టమన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన కోరుకునే మనందరం వైయస్‌ జగన్‌కు తోడుగా నిలబడాలన్నారు. జగనన్న ప్రతినిధిగా మీరు నన్ను గెలిపిస్తే..ఓడిపోయిన వ్యక్తి చంద్రమోహన్‌రెడ్డి దొడ్డిదారిన మంత్రి పదవి పొంది మనపై విమర్శలు చేస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని నిండు నూరేళ్లు ఆశీర్వదించాలని కాకాణి కోరారు. 

No comments:

Post a Comment