27 February 2018

అదిగో జ‌గ‌న‌న్న‌

- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు పోటెత్తిన మ‌హిళ‌లు
- అప్యాయంగా ప‌ల‌క‌రిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ 
ప్ర‌కాశం: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకొని, క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచేందుకు  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌త్యేకంగా మ‌హిళ‌లు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌చ్చి రాజ‌న్న బిడ్డ‌ను చూసి మురిసిపోతున్నారు. త‌మ బాధ‌లు చెప్ప‌కుంటూ స్వాంత‌న పొందుతున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ప్ర‌కాశం జిల్లా మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని పోతవరంలో రాజన్న తనయుడిని చూసేందుకు మహిళలు పెద్ద ఎత్తున పోటెత్తారు. వైయ‌స్ జ‌గ‌న్‌తో క‌లిసి వేలాది మంది న‌డుస్తూ త‌మ క‌ష్టాలు చెప్పుకుంటున్నారు. మీ బిడ్డను ఆశీర్వదించండి... తోడుగా ఉండి చల్లని దీవెనలు అందించండి.. మీ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చి అన్ని సమస్యలు పరిష్కరించి అందరి కన్నీళ్లు తుడుస్తా’నంటూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్ర‌జ‌ల‌కు భరోసా ఇస్తున్నారు.   ప్రజాసంకల్ప యాత్రకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అడుగడుగునా పూలు చల్లి వైయ‌స్ జగన్‌కు స్వాగతం పలుకుతున్నారు. జ‌న‌నేత‌ వద్ద సమస్యలు ఏకరువు పెడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు తుంగలో తొక్కి అందరినీ మోసగించిందని ఆయ‌న‌ దృష్టికి తెస్తున్నారు.  రైతులను, మహిళలను, యువకులతో పాటు అన్ని వర్గాల ప్రజలకిచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. జనం కష్టాలు విని స్పందించిన వైయ‌స్ జగన్‌ మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తూనే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. మహిళలకు అన్ని విధాలా ప్రభుత్వం సాయమందిస్తుందని ఆడబిడ్డల చదువులకు తానే ఆర్థికసాయం అందిస్తానని వృద్ధులు బాగోగుల కోసం రూ.2 వేలు పింఛన్‌ ఇస్తానని వైయ‌స్ జగన్‌ అందరికీ భరోసానిచ్చారు.  సాయంత్రం పొదిలి ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు వేలాదిగా త‌ర‌లిరావ‌డంతో ప‌ట్ట‌ణం కిక్కిరిపోతోంది. వైయ‌స్ జ‌గ‌న్‌ను చూడాల‌ని ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త‌మ బాధ‌లు చెప్పుకునేందుకు పాద‌యాత్ర దారిలో ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. 
  

No comments:

Post a Comment