18 January 2018

నేనున్నాను

- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు పోటెత్తున్న జ‌నం
- దారిపొడువునా క‌ష్టాలు చెప్పుకుంటున్న ప్ర‌జ‌లు
- న‌వ‌ర‌త్నాల‌పై హ‌ర్షాతిరేకాలు

చిత్తూరు:  కష్టాల్లో ఉన్న ప్రజలను ఓదార్చేందుకు, వారికి భరోసా కల్పించేందుకు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి  చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.  ప్రజలు ఆయనకు పల్లె పల్లెనా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఊరు ఊరంతా కదిలి రాజన్నబిడ్డను నిండు మనస్సుతో ఆశీర్వదిస్తోంది. జ‌న‌నేత‌ను ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. తమ కష్టాలు చెప్పుకొని సాంత్వన పొందుతున్నారు. ఇవాళ ఉద‌యం  శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతోంది.  పాదయాత్రలో ఉన్న వైయ‌స్ జగన్‌కు దారి పొడవునా ప్రజలు సమస్యలు చెప్పుకుంటున్నారు. అంద‌రికి అండ‌గా ఉంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పిస్తున్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బతికున్నప్పుడు బీసీలందరికీ ఒక భరోసా ఉండేది. ఇంటికి ఒక్కరైనా డాక్టరో, ఇంజనీరో అయితే కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని ఆయన నమ్మారు. అందుకే ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రూపొందించి పేదలకు ఉన్నతవిద్యను దగ్గరచేశారు. ఆయన చూపిన బాటలోనే నేను కూడా బీసీలకు తోడుంటా. బీసీల అభ్యున్నతి కోసం నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేశారు. నేను ఇంకో రెండు అడుగులు ముందుకు వేస్తాను’’ అని వైయ‌స్‌ జగన్‌ బీసీలకు మాటిచ్చారు. చట్టసభల్లో ప్రతి కులానికీ ప్రాతిని ధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తానని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అన్ని కులాలనూ గుర్తించడం, వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులతో పాటు టీటీడీ, శ్రీకాళహస్తి వంటి కీలక పదవులను కట్టబెట్టడం ద్వారా బీసీ సామాజికవర్గాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో బీసీల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌నంద‌రి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చాక అండగా ఉంటానని వైయ‌స్‌ జగన్ అంద‌రికి భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

No comments:

Post a Comment