2 January 2018

మానవత్వం లేని పాలన ఇది


  • విశ్వసనీయతకు పాతర  వేశారు
  • చేనేత రంగాన్ని ఆదుకుంటాం
  • ఆత్మీయ సమ్మేళనంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి
మదనపల్లి : రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం మానవీయతను మరచిపోయిందని, విశ్వసనీయతకు పాతర వేస్తూ పాలన కొనసాగిస్తోందని ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా చినతిప్ప సముద్రం లో చేనేతలతో సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ప్రతి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని, నష్టపోయిన వారికి భరోసా ఇచ్చేందుకే తాను పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.
 నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనను మనమంతా చూశాం. మరో సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు ఊదరగొడుతున్నారు. ఆయన పాలన చూసిన తరువాత మనమంతా మన మనసాక్షిని  అడగాలి,  ఆయన పాలనను చూసిన తరువాత  మనం ఎవరైనా సంతోషంగా ఉన్నామని గుండెలపై చేయి వేసుకుని అడగాలి.  రైతులు, చేనేత కార్మికులు సంతోషంగాలేరు, అక్క చెల్లెమ్మలు, చదువుకునే పిల్లలు, ముసలి వయసుల్లోని అవ్వాతాతలు ఏమాత్రం సంతోషంగా లేరు. నాలుగేళ్ల ఈ పాలన చూసిన తరువాత చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు చేనేత రంగాలకు ఏం చెప్పారో రెండు కాగితాల కోసం చూస్తే మ్యానిఫెస్టో కనిపించదు. 
అది కనపడిదంటే, ప్రతి పేజీలోనూ ఏదో ఒక కులాన్ని, ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసేట్లుగా ఉంది. ఇప్పుడు అది కనిపించి ఎవరైనా చదివితే,  తరువాత కొడతారోమేన్న భయంతోనే వెబ్ సైట్లో నుంచి తీసేశారు.  ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు  ఏం చెప్పారో ఈ సందర్బంగా వైయస్ జగన్  చదివి వినిపించారు. ఎన్నికలు వచ్చేసరికి మగ్గం ముందు కూర్చుని నేతన్నలను,  చంకలో ట్యూబులో వేసుకుని గౌడన్నలపై తనకెంతో ఆప్యాయత సానుభూతి ఉందంటూ ప్రేమ ఒలకపోస్తారు. బుట్టలు అల్లుకునే వారితోపాటు రోడ్డు పక్కనే కూర్చుని బుట్టలు అల్లడం మొదలెడతారు. ఇలా అందరినీ మోసం చేయడమే చంద్రబాబు పని అని అన్నారు.

చంద్రబాబు ఎన్నికల ప్రణాళిక ఇచ్చి 4 ఏళ్లు అయ్యింది. ఏమైనా మంచి జరిగిందా  చెప్పాలంటూ ప్రశ్నించారు.  చేనేత కార్మికుల బ్యాంకు రుణాల మాఫీ, పవర్ రలూం పై రుణాల రద్దు చేస్తామని ఇచ్చిన హామీ అమలై మీ రుణాలు మాఫీ అయ్యాయా? చెప్పాలని ప్రశ్నిస్తే లేదంటూ సభికుల నుంచి సమాధానం వచ్చింది. ఇంతే కాకుండా తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని ఇచ్చిన హామీ ని నిలబెట్టుకోలేదనీ,  చేనేత కార్మికులకు ప్రత్యేక నిధి, బడ్జెట్ లో వెయ్యి కోట్ల నిధి ఎక్కడైనా కనిపించాయా? జిల్లాకో చేనేత పార్కు అన్నారు, ఏమయ్యాయి?. ఎక్కడైనా ఏర్పాటు చేశారా? లక్షన్నర తో ఉచితంగా ఇళ్లు, షెడ్ కట్టిస్తామన్నారు మీలో ఒక్కరికైనా కట్టించారా? చెప్పాలని అడిగారు.ఇవన్నీ మచ్చుకకు చంద్రబాబు మ్యానిఫెస్టో నుంచి  కొన్ని మాత్రమే తాను ప్రస్తావిస్తున్నానన్నారు. 

రాజకీయాలంటే విశ్వసనీయత అని కాని, చంద్రబాబు నాయుడు దానిని మరచిపోయారని మండిపడ్డారు. రాజకీయ నాయకుడు ఫలానా చేస్తానని చెప్పి, చేయకపోతే , అతని రాజీనామా తీసుకుని ఇంటికి పంపించాలి. చంద్రబాబు నాయుడు విశ్వసనీయతకు పాతర వేశారని ఆరోపించారు. 
చంద్రబాబు మాట విని రుణాలు కట్టక పోతే, బ్యాంకులు వాళ్లు వచ్చి నోటీసులు పంపి, వడ్డీల మీద మీద వడ్డీల వేస్తున్న దారుణ మైన పాలన ప్రస్తుతం కొనసాగుతోందని వైయస్ జగన్ అన్నారు. చేనేత కార్మికుల బ్యాంకు లోన్లు మాఫీ చేయలేదు.బడ్జెట్ లో ప్రతి ఏటా వెయ్యికోట్లు అన్నారు.ఇచ్చారా? చంద్రబాబు నాయిడి పుణ్యాన  పట్టుమీద వచ్చే రూ. 600 సబ్సిడీ పోయింది.

ఆత్మహత్యలు చేసుకుంటున్నా చలించని ప్రభుత్వం 

మదనపల్లిలోనే చేనేత కార్మికులు  28 మంది చనిపోయారు.  ధర్మవరం 35 మంది, మీరందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని చూసి మీకు మనసాక్షి  లేదా అని ప్రశ్నిస్తే , ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేందంటూ బాబు అసెంబ్లీలో చెపుతారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షలు ఇవ్వడానికి మనసు ఒప్పక, అసలు రైతుల, చేనేతల ఆత్మహత్యలనే రికార్డు చేయడం లేదని ప్రతిపక్ష నేత ఆరోపించారు. ఇచ్చే సహాయం కూడా మొదట అప్పుల వాళ్లకు, మిగిలిన దానిని బ్యాంకుల్లో డిపాజిటు చేసి, దాని మీద వచ్చే వడ్డీని మాత్రమే ఆ కుటుంబాలకు అందచేయడమనేది దారుణమన్నారు. మానవత్నాన్ని మరచి పోయారీ ప్రభుత్వంలో అన్న దానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి అని సూటిగా అడిగారు. 
పార్టీ తరపువ ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా చేనేత రంగానికి ఏమేమీ కావాలో అవన్నీ పొందపరుస్తామని హామీ ఇచ్చారు. బిసి వర్గాలకు ప్రయోజనం చేకూరింది మహానేత వై యస్ ఆర్ హయాంలోనే అని, ఆయన కొడుకుగా మరో రెండు అడుగులు ముందుకెళ్లి  సంక్షేమ రంగాన్ని కొంత పుంతలు తొక్కిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.

ఇంకా ఏమన్నారంటే...

 ఎన్నికల సమయంలో రైతులను, చదువుకుంటున్న పిల్లలను మోసం చేశాడని, అవ్వ, తాతలను, చేనేతలను వదిలిపెట్టలేదని చంద్రబాబు మోసాలను ఎండగట్టారు.  చేనేత కుటుంబాలకు అతి తక్కువ వడ్డికే రుణాలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇవాళ చేనేత కుటుంబాలకు రుణాలు అందడం లేదన్నారు. చేనేతలకు ప్రతి జిల్లాలో చేనేత పార్కు ఏర్పాటు చేస్తానని చెప్పినట్లు గుర్తు చేశారు. ఏ జిల్లాలో కూడా చేనేత పార్కు కనిపించలేదన్నారు.  చంద్రబాబు పుణ్యమా అని చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో చేనేతల ఆత్మహత్యలు పెరిగాయి.  ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయని, బట్టలకు మాత్రం ధర లేదని తెలిపారు. ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు.

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు

1. చేనేత కార్మికులను ఆదుకుంటాం.
2. తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తాం.
3. నూలుపై సబ్సిడీ చెల్లిస్తాం
4. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బిసి,మైనార్టీ (బడుగు బలహీన వర్గాల ) పేదలందరికీ 45 ఏళ్లకే  పింఛన్లు
5. ఫింఛన్‌ వెయ్యి నుంచి రూ.2 వేలు పెంచుతాం
6 అన్ని వర్గాలకు అండ‌గా ఉంటా. అందుకే 45 ఏళ్లకే పింఛను. 
7. ఆరోగ్యశ్రీని పునరుద్ధిస్తాం. హైదరాబాద్ లోనూ ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం. 
8 పేదవాళ్లకు ఇళ్లు కట్టి మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించటంతో పాటు వారికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందజేస్తాం.
9 .పిల్లలు చదువుకుంటేనే బతుకులు మారుతాయి. విద్యార్థులు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు ప్రతి ఏటా 20వేలు మెస్ ఛార్జీలు చెల్లిస్తాం.

No comments:

Post a Comment