16 January 2018

అప్పలాయగుంటలో స‌మ‌స్య‌ల వెల్లువ‌

చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్ది సేప‌టి క్రిత‌మే చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని అప్ప‌లాయ‌గుంట‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు ప‌లు స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తెచ్చారు. త‌మ‌కు పింఛ‌న్లు రావ‌డం లేద‌ని, ఇల్లు మంజూరు కావ‌డం లేద‌ని, మంచినీటి స‌మ‌స్య‌ను తీర్చాల‌ని వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. వారి స‌మ‌స్య‌లు విన్న జ‌న‌నేత మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పించారు. 

సంక్షేమ పథకాల్లో జన్మభూమి కమిటీల పెత్తనం

చిత్తూరు: సంక్షేమ పథకాల అమలులో జన్మభూమి కమిటీల పెత్తనం పెరిగిందని నగరి నియోజకవర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో ఆయా వర్గాల ప్రజలు మంగళవారం వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు సొంత జిల్లాలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గాలేరు–నగరి ప్రాజెక్టు పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలకే సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయని వాపోయారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వితంతు పింఛన్లు ఇవ్వడం లేదని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వచ్చినా తరువాత ఉన్న జాబులు పోయాయని యువత ఆందోళన వ్యక్తం చేశారు.  ఇక్కడ ఉద్యోగాలు లేకపోవడంతో బెంగుళూరులో ఉపాధి పొందుతున్నామని యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు తన ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో పండుగలు చేసుకుంటున్నారని, వైయస్‌ జగన్‌ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు.
 

అపాయింట్‌మెంట్లు ఎందుకు దొరకడం లేదు

– దుగ్గిరాజుపట్నం పోర్ట్‌ ఏమైంది?
– విశాఖ రైల్వే జోన్‌ ఏమైంది?
– రాజధాని కట్టలేక పోయారు..పోలవరం ఏమైంది?
– అమరావతికి రూ.2500 కోట్లు, విజయవాడ డ్రైనేజీకి వెయ్యి కోట్లు కేంద్రం ఇచ్చిందట.
– నాలుగేళ్లలో నాలుగు టెంపరరీ బిల్డింగ్‌లు కట్టారు
– సీఎం చంద్రబాబు పనితీరుపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు

హైదరాబాద్‌: తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో సాధించింది ఏమీ లేదని, సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు కూడా సీఎం చంద్రబాబుకు దొరకడం లేదని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. అసలు మీకేందుకు కేంద్రం అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏడాది తరువాత ప్రధాని అపాయింట్‌మెంట్‌ ముఖ్యమంత్రికి దొరకకపోవడం, కేంద్ర మంత్రి గడ్కారి కోసం ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడకు ప్రత్యేక విమానాల్లో వెళ్లడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నాలుగేళ్లుగా మభ్యపెడుతూ.. నాలుగేళ్లలో నాలుగు టెంపరరీ బిల్డింగ్‌లు కట్టడం తప్ప సాధించింది ఏమీ లేదని విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్‌ దొరికిందని ఊదరగొడుతున్నారని, ఒక ముఖ్యమంత్రికి ఏడాది పాటు ఎందుకు అపాయింట్‌మెంట్‌ దొరకలేదని బుగ్గన ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా తాను రాష్ట్రం కోసం 30 సార్లు ఢిల్లీ వెళ్లానని చెబుతుంటారన్నారు. నాలుగేళ్లలో ఈ సంకీర్ణ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఏ మేలు జరిగిందని నిలదీశారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాలుగు టెంపరరీ బిల్డింగులు కట్టించారని, అది కూడా నాలుగు చినుకులు పడితే కారిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని  ఒక్క హామీని కూడా చంద్రబాబు ప్రభుత్వం సాధించలేదన్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, వైజాగ్‌ – చెన్నై కారిడార్‌ అన్నారు.  ప్రత్యేక హోదా, దుగ్గిరాజు పట్నం పోర్టు, అమరావతి నిర్మాణం, పోలవరం ఇలా ఏది కూడా సాధించలేకపోయారన్నారు. దుగ్గిరాజుపట్నం పోర్టు అన్నది 13వ షెడ్యూల్‌లో పేర్కొన్నారన్నారు. 2018లోపే మొదటి ఫేజ్‌ కంప్లింట్‌ కావాల్సి ఉందన్నారు. అయితే ఇప్పుడేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి అయోగ్‌పై కొత్త కథ చెబుతున్నారని విమర్శించారు. నాలుగేళ్ల తరువాత సీఎం ఢిల్లీకి వెళ్లి  ప్రధానికి వినతిపత్రం ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. సామాన్య ప్రజలు కలెక్టర్‌ వద్దకు వెళ్లి అర్జీ ఇచ్చినట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. 

రాజధాని ఏమైంది? 
అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తు చేశారు. జపాన్, మలేసియా, టర్కీ, లండన్, సింగపూర్‌ అంటూ ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలా రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇంతవరకు ఏం మేరకు కట్టించారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ టెంపరరీ భవనాల్లో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజధాని కోసం లక్ష ఎకరాల భూమి తీసుకొని ఏం చేస్తారని నిలదీశారు. త్వరలోనే చంద్రబాబు మోసాలన్నీ కూడా బయటపడుతాయన్నారు. ఐదు వేల ఎకరాలు రాజధానికి సరిపోతాయని మేమంటే..వీరికి రాజధాని నిర్మించడం ఇష్టం లేదని చంద్రబాబు నిందలు వేశారన్నారు. ఇప్పటికే నాలుగు సార్లు రాజధానికి శంకుస్థాపన చేశారన్నారు. ప్రతి మూడు నెలలకు ఓసారి బిల్డింగ్‌ ప్లాన్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. 

పోలవరంపై కట్టుకథలు
చంద్రబాబు ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై కట్టు కథలు అల్లుతుందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. కనీసం పోలవరం నిర్మిస్తే అర్ధరాష్ట్రమైనా బాగుపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అంచనాలు, విధి విధానాలు అంటూ కాలయాపన చేస్తుందని  విమర్శించారు. పోలవరం అన్నది రెండు, మూడు రాష్ట్రాలకు సంబంధించిందన్నారు. ఇలాంటి ప్రాజెక్టు కేంద్రం కడితే ఉపయోగకరంగా ఉండేదన్నారు. అలాంటి ప్రాజెక్టును మేం కడుతామని చంద్రబాబు తీసుకొని మళ్లీ ఈ రోజు పోలవరాన్ని కేంద్రానికి ఇస్తామని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును తీసుకొని ఇంతవరకు ఏం చేశారన్నారు. తెలుగు జాతికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కారి కోసం ఆయన సొంతూరుకు వెళ్లడం, తీరా ఆయన్ను కలిసేందుకు వీలు పడక విమానంలో తిరిగి రావడం ఏంటన్నారు. ఆయన్ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లాలి కానీ, ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి  వెళ్లడం, తీరా కలువకుండా వెనక్కి రావడం ఏంటని ప్రశ్నించారు. అసలు మీకు కేంద్రం నుంచి అపాయింట్‌మెంట్లు దొరకడం లేదని ప్రశ్నించారు.

కేంద్రం నిధులకే లెక్కలు లేవు
కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి రూ.2500 కోట్లు, విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ. వెయ్యి కోట్లు ఇచ్చిందని చెబుతుంటే ఈ నిధులకు లెక్కలు లేవని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. దుగ్గిరాజు పట్నం పోర్టును ఎందుకు విస్మరించారని ఆయన ప్రశ్నించారు. కాగ్‌ రిపోర్టు ప్రకారం 24 వేల కోట్లు లోటు బడ్జెట్‌ ఉండేదని, రూ.14 వేల కోట్లతో రూ.7 వేల కోట్లు మాత్రమే లోటు బడ్జెట్‌ ఉందని కేంద్రం చెబుతుందన్నారు. అయితే మళ్లీ చంద్రబాబు రూ.16 వేల కోట్లు లోటు ఉందని లేఖలు రాస్తున్నారన్నారు. ఇన్ని సార్లు మీరు ఢిల్లీకి వెళ్లి సాధించింది ఏంటని, కేంద్రంలో ఉన్న మీ మంత్రులు ఏం చేస్తున్నారని బుగ్గన ప్రశ్నించారు. ఇప్పటికైనా తీరు మార్చుకుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. లేదంటే ప్రజల ఆగ్రహానికి కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు.

ప్రత్యేక హోదాతో మెడికల్‌ విద్యార్థులకు ప్రయోజనం

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తేనే మెడికల్‌ విద్యార్థులకు మేలు జరుగుతుందని చైనాలో ఎంబీబీఎస్‌ చదువుతున్న కుషాల్‌ అన్నారు.  వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో విద్యార్థులు మేము సైతం అంటున్నారు. చైనాలో మెడికల్‌ చదువుతున్న కుషాల్‌ అనే విద్యార్థి  మంగళవారం వైయస్‌ జగన్‌ను కలిశారు. జింజో మెడికల్‌ యూనివర్సిటీలో తాను ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నానని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని చైనాలో పలుమార్లు ఆందోళన చేపట్టామన్నారు. ఈ పోరాటానికి ఆ దేశంలోని విద్యార్థులు కూడా మద్దతు తెలిపారన్నారు. వైయస్‌ జగన్‌ లాంటి నాయకుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం సంతోషంగా ఉందన్నారు. తామంతా వైయస్‌ జగన్‌కు మద్దతుగా నిలుస్తామని చెప్పారు.

చెక్కర ఫ్యాక్టరీలను తెరిపిస్తా

చిత్తూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సహకార రంగంలోని రెండు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం నగరి నియోజకవర్గంలో చెరకు రైతులు వైయస్‌ జగన్‌ను కలిశారు. చెరకు  ఫ్యాక్టరీ మూత వేయడంతో ఉపాధి కోల్పొయామని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. 11 వేల మందికి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. గతంలో ఈ మూతపడిన ఫ్యాక్టరీలను వైయస్‌ రాజశేఖరరెడ్డి తెరిపించారని తెలిపారు.  రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

నవరత్నాలతో ప్రజల్లో హర్షాతిరేకాలు

చిత్తూరు: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్యే రోజా అన్నారు. జననేత వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు విశేషస్పందన లభిస్తుందన్నారు. చిత్తూరులో సాగుతున్న వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ..చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ జిల్లాలో పుట్టినందుకు అందరం సిగ్గుపడుతున్నామని విమర్శించారు. బాబు పుణ్యమా అని ఇక్కడి చక్కెర ఫ్యాక్టరీలు మూత వేయించారు. జన్మభూమి కమిటీల పేరుతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన 600 హామీలు తుంగలో తొక్కారన్నారు. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుపై పీకల దాకా కోపంతో ఉన్నారన్నారు. ఇక్కడికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని, ఎన్నికలు వస్తున్నాయని అరకొరగా ఇల్లు మంజూరు చేస్తున్నారన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా వైయస్‌ జగన్‌ కూడా నవ రత్నాల ద్వారా అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కుటుంబం ఒక్క మాట ఇస్తే మడమ తప్పరనిప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. పిల్లలను చదవించే బాధ్యత వైయస్‌ జగన్‌ తీసుకుంటున్నారన్నారు. మద్యం వల్ల చాలా కుటుంబాలు నాశనమవుతున్నాయన్నారు. ఎక్కడపడితే అక్కడ చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం

– హైకోర్టు వద్దన్నా..కోళ్లకు కత్తులు కట్టి పందేలు
– వందల ఎకరాల్లో కోడి పందేల కోసం బరులు తయారు చేశారు
– బరులు కట్టి, ఫ్లెక్సీలు పెట్టి మరీ కోడి పందెలు నిర్వహిస్తున్నారు.
– పందేలను నిర్వహిస్తోంది సాక్షాత్తు టీడీపీ నేతలే
– కోళ్లకు కత్తులు కట్టకుండా ఆడండని సీఎం చెప్పారు
– ప్రతిపక్ష నేతలను అడ్డుకునే పోలీసులు ఇప్పుడేం చేస్తున్నారు 

విజయవాడ: రాష్ట్రంలో జూదం, కోడి పందేలు యధేచ్ఛగా జరుగుతున్నా వాటిని అడ్డుకోవడంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రంలో కోళ్లకు కత్తులు కట్టి కోడి పందేలు నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించినా లెక్కచేయకుండా టీడీపీ నేతలే దగ్గరుండి వందల ఎకరాల్లో కోడి పందేల కోసం బరులు తయారు చేశారని ఆయన మండిపడ్డారు. మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, ఎద్దుల పందాలతో ప్రజలు రిలాక్స్‌ అవుతారన్నారు. గంగిరెద్దులు, హరిదాసులతో చాలా కోలాహలంగా జరిగే పండుగ అన్నారు. మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొని సంతోషంగా గడిపారన్నారు. అయితే ఒక బాధకరమైన పోటీ కూడా జరుగుతుందన్నారు. న్యాయస్థానం కోడి పందేలు కత్తులు కట్టి జరుపకూడదని సూచించింది. ^è క్కగా, సాంప్రదాయబద్ధంగా కోడి పందెలే నిర్వహించమని చెప్పందన్నారు. హైకోర్టు గత ఏడాది ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదని, ఈ సారైనా పాటించాలని ఆదేశించిందన్నారు. ముఖ్యమంత్రి కూడా మీ సాంప్రదాయాన్ని నేరవేర్చుకోండి, కత్తులు కట్టుకోవద్దని సూచించారు. కానీ కోళ్లకు కత్తులు కట్టి వందల ఎకరాల్లో పిచ్చులు తయారు చేసి, ఫ్లడ్‌లైట్స్‌ ఏర్పాటు చేసి పందెలు నిర్వహిస్తున్నారన్నారు. వీటన్నింటిని టీడీపీ నేతలే నిర్వహించడం దారుణమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఒక చోట కోడి పందెలు నిర్వహిస్తే..అక్కడ మందు అమ్ముకునేందుకు, తిండి పదార్థాలు అమ్ముకునేందుకు టీడీపీ నేతలకు కోటి రుపాయాలు ఇచ్చారన్నారు. పోలీసు వ్యవస్థ ఈ మూడు రోజుల పాటు ఎందుకు నిర్వీర్యమైందన్నారు. పేకాటాలు, జూదం ఆడుతున్నారన్నారని విమర్శించారు. టీవీల ముందు కత్తులు లేనట్లు నటన చేస్తూ, వారు వెళ్లిపోగానే కత్తులతో పోటీలు నిర్వహించారన్నారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. న్యాయస్థానాల ఆదేశాలను కూడా ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందన్నారు. వైయస్‌ జగన్‌ విశాఖలోని క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తే పోలీసులు వందలాది మంది వచ్చి అడ్డుకుంటారు, అలాగే ముద్రగడ పాదయాత్ర చేస్తామంటా పోలీసులు మొహరిస్తున్నారు. మేం జన్మభూమిలో పాల్గొంటామంటే అడ్డుకున్నారు. అదే టీడీపీ నేతలు కోడిపందెలు నిర్వహిస్తుంటే పోలీసులు ఎందుకు చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు. సంప్రదాయం ముగుగులో వేల కోట్లు చేతులు మారుతున్నాయని, టీడీపీ నేతలే నిర్వాహకులు కావడం దుర్మార్గమన్నారు. ప్రజా ప్రతినిధులే ఇలాంటి అసాంఘిక శక్తులగా మారడం బాధాకరమన్నారు. క్రికెట్‌ పోటీల మాదిరిగా ఫ్లడ్‌ లైట్స్‌ వెలుగులో బరులు ఏర్పాటు చేసి కోడి పందెలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమన్నారు. క్రికెట్‌బెట్టింగ్‌లు కట్టే వారిని పట్టుకుంటున్న పోలీసులు కోడి పందెలు ఆడే వారిని ఎందుకు పట్టుకోవడం లేదన్నారు. సంప్రదాయంగా వస్తున్న ఆటను జూదంగా మార్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు డబ్బులు సంపాదించడం దురదృష్టకరమన్నారు.  సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ జూద గృహాలు నిర్వహిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. బెల్టు షాపులు రద్దు అని చంద్రబాబు అన్నారు. కానీ బడిలు వద్ద బహిరంగంగా మద్యం అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని, న్యాయస్థానం అంటే వీరికి లెక్కలేదన్నారు. కోడి పందేలు వేసి రక్తసిక్తం చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చంద్రబాబు సమాధానం చెప్పాలని  అంబటి రాంబాబు డిమాండు చేశారు. హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకపోవడం దుర్మార్గమని, ప్రజల బలహీనలపై సొమ్ము చేసుకోవడాన్ని వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుందని అంబటి రాంబాబు అన్నారు. కోడి పందేలు నిర్వహించిన వారిపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. 

8 January 2018

బాబు ముఖ్యమంత్రి పదవికి అర్హుడా?


– చంద్రబాబు పాలన అంతా అవినీతి మయం
– జన్మభూమి కమిటీ పేరుతో మాఫియా
–మరుగుదొడ్లకు కూడా లంచాలు అడుగుతున్నారు.
– పింఛన్లలో అసమానతలు కనిపిస్తున్నాయి.
–చంద్రబాబు హయాంలో కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి.
– తిరుపతి, కాణిపాకం దేవస్థానాలకు పాలక మండలి కరువు
– ఏమీ చేయకుండా ఓట్లు అడుగుతున్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలి
– ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మారాలి.
– మీ పిల్లలను నేను చదివిస్తాను.
 – పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తా
– ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టిస్తా

చిత్తూరు: నాలుగేళ్ల పాలనలో ఏమీ చేయకుండా మళ్లీ ఓట్లు అడుగుతున్న చంద్రబాబు సిగ్గుపడాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి అర్హుడా అనిఆయన ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 56వ రోజు పూతలపట్టు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.  

బాబు ముఖ్యమంత్రి కావడం మన ఖర్మ..
చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సహకార రంగ చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని వైయస్‌ జగన్‌ అన్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చే ముందుకు ఈ నియోజకవర్గానికి పక్కనే చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీ కనిపిస్తోంది. ఇక్కడికి రాకముందు ఒక టెంట్‌ వేసి ఆందోళన చేపట్టి..నన్ను పిలిచారు. ఆ చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీని చూçస్తే బాధనిపించింది. మన జిల్లాలో 6 ఫ్యాక్టరీలు ఉంటే రెండు మాత్రమే ప్రభుత్వానికి, మిగతావి ప్రవేట్‌ సంస్థలు. అదేంటో కాని చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా సహకార రంగంలోని రెండు చక్కెర పరిశ్రమలు మూత పడుతున్నాయి. ఆశ్చర్యమనిపిస్తోంది. ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి సహకార రంగంలోని పరిశ్రమలు నడిచేలా చూడాలి. రైతులకు తోడుగా ఉండాలి. రైతులకు కొనుగోలు చేసే సమయంలో గిట్టుబాటు ధర కల్పించాలి. ఇదే జి ల్లాలో పుట్టిన చంద్రబాబు జిల్లాకు చేస్తున్న అన్యాయాన్ని చూస్తే బాధనిపిస్తుంది. చంద్రబాబు ఉన్నప్పుడు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. అదే వైయస్‌ఆర్‌ వచ్చాక ఆ ఫ్యాక్టరీలను మళ్లీ తెరిపించారు. మహానేత చలువ వల్ల ఆ ఫ్యాక్టరీలు మళ్లీ పదేళ్లు నడిచాయి. మళ్లీ మన ఖర్మకొద్ది చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ వెంటనే రెండు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇవాళ పంట పండించడానికి ఖర్చులు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు సహకార రంగంలోని రెండు ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. ప్రైవేట్‌ రంగానికి చెందిన ఫ్యాక్టరీలు వాళ్లకు గిట్టుబాటు అయ్యే రేటుకు చెరుకును కొనుగోలు చేస్తున్నారు. ఇదే రైతన్నలు ఇష్టం లేకపోయినా చెరుకును అమ్ముకోవాలంట. రైతులు బెల్లం చేసుకొని బయట అమ్ముకోవటం చంద్రబాబుకు ఇష్టమట. చెక్‌ పోస్టులు పొట్టి నల్లబెల్లాన్ని అమ్ముకోకుండా అడ్డుపడుతున్నారు. భూమిని బట్టి నల్ల బెల్లం దొరుకుతుంది. రైతులను నష్టపరిచేందుకు, ప్రైవేట్‌ ఫ్యాక్టరీలకు మేలు చేసేలా జీవోలు జారీ చేస్తున్నారు.

పథకం ప్రకారం డైరీలు మూత వేయించాడు
చంద్రబాబు ఒక పథకం ప్రకారం జిల్లాలోని డైరీలను మూత వేయించాడని వైయస్‌ జగన్‌ అన్నారు. ఇదే చంద్రబాబు రైతులకు తోడుగా ఉండాల్సింది పోయి..మన ఖర్మకొద్ది ఇదే చంద్రబాబు హెరిటేజ్‌ ఫ్యాక్టరీని పెట్టారు. ఆయన డైరీ కోసం చిత్తూరు డైరీని నాశనం చేశారు. చిత్తూరు డైరీలో తనకు నచ్చిన వారితో పాలన మండలి ఏర్పాటు చేసి ఒక పద్ధతి ప్రకారం మూత వేయించాడు. రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా నష్టాల బాట అంటూ మూసి వేయించారు. సహకార రంగ పాల వ్యాపారంలో రైతులకు గిట్టుబాటు ధర ఉంటుంది. ఈ మనిషిని చూసినప్పుడు ముఖ్యమంత్రిగా అర్హుడా అని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు.

మహానేత పాలనను గుర్తుకు తెచ్చుకోండి
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని వైయస్‌ జగన్‌ అన్నారు. మహానేత బతికి ఉన్నప్పుడు హంద్రీనీవాకు దాదాపు 80 శాతం పనులు పూర్తి చేయించారు. మిగిలింది ఆ కాల్వను తీసుకొచ్చి చిత్తూరులో కలపడమే. చంద్రబాబు నోట్లో నుంచి పచ్చి అబద్ధాలు తప్ప వేరేవి రావడం లేదు. చంద్రబాబు సీఎం కాకముందే రూ.6 వేల కోట్లు ఖర్చు చేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క కాల్వ కూడా తవ్వలేకపోతున్నారు. వ్యవసాయం దండగా అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే. ఇదే ముఖ్యమంత్రి నెలకొసారి ప్రైవేట్‌ విమానం ఎక్కి సింగపూర్, జపాన్, రష్యా, స్విజ్జర్‌ల్యాండ్‌ అంటూ విశ్రాంతి తీసుకునేందుకు విదేశాలకు వెళ్తారు. సింగపూర్‌కు వెళ్తే ఈ రాష్ట్రాన్ని సింగపూర్‌ అంటారు. ఇలా ఏదేశం వెళ్తే ఆ దేశంలాగా మన రాష్ట్రాన్ని చేస్తామని మోసం చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 400 గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక్కొదాంట్లో 30 మంది ఉపాధి పొందుతున్నారు. ట్రాన్స్‌పోర్టు రంగంలో వేలకొద్ది ఉద్యోగాలు లభిస్తాయి. చంద్రబాబు సీఎం కాగానే గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు విఫరితంగా కరెంటు బిల్లులు, రాయితీలు పెంచారు. ఇలా దగ్గరుండి రేట్లు పెంచితే ఎలా నడుస్తాయి. 

పాలక మండలి ఏదీ?
ఇదే చంద్రబాబుకు పరిపాలనపై ఏమాత్రం శ్రద్ధ ఉందో అనడానికి ఒక్క ఉదాహరణ. జిల్లాలో తిరుపతికి పాలక మండలి లేదు. ఇప్పటికి 8 నెలలుగా పాలక మండలికి బోర్డు లేదు. కాణిపాకం గుడిలో అయితే పాలక మండలి అన్నది గత మూడేళ్లుగా లేదు.

డాక్టర్లేరి?
పూతలపట్టు వెళ్లే రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. ప్రతి ఏటా వంద మంది ఈ రహదారుల్లో చనిపోతున్నారు. మన వద్ద రెండు కమ్యూనిటి హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. కానీ డాక్టర్లు ఉండటం లేదు. ప్రమాదం జరిగితే తిరుపతి, చిత్తూరుకు పరుగులు తీయాల్సి వస్తుంది. ఇదే నియోజకవర్గంలో పింఛన్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. జన్మభూమి కమిటీ పేరుతో ఒక మాఫియాను తయారు చేశారు. పింఛన్లు, మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇవ్వాలి. పింఛన్లకు 60 ఏళ్ల వయస్సు సరిపోదట..కాళ్లు, చేతులు లేకపోతే సరిపోదట..జన్మభూమి కమిటీలు సిపార్సులు చేయాలట. పై నుంచి కింద దాక అవినీతే. చంద్రబాబు పైన మేస్తున్నారు. మద్యం, ఇసుక, బొగ్గు, కరెంటు కొనుగోళ్లు, కాంట్రాక్టులు, రాజధాని భూములు, చివరికి గుడి భూములు వదలకుండా చంద్రబాబు మేస్తున్నారు. కిందమాత్రం జన్మభూమి కమిటీలకు వదిలిపెట్టారు. 

 ఒక్కసారి ఆలోచించండి..
నాలుగేళ్ల పాలన మనమంతా చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని ఈ పెద్ద మనిషి ఊదరగొడుతున్నారు. ఇదే చంద్రబాబు తనకు ఓటు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలట. ఒక్క ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు అంటున్నారంటే ఆయన కళ్లు ఎక్కడున్నాయో ఆలోచించండి. అయ్యా చంద్రబాబు ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని నీవు అంటున్నావు. ఈ నాలుగేళ్లలో నీవు మోసం, అవినీతి, అబద్ధాలు చెబుతున్నారు. ఇంతకు చంద్రబాబుకు సిగ్గు ఉందా?. ఇదే పెద్ద మనిషి నాలుగేళ్ల కిందట కరెంటు బిల్లులు షాక్‌ కొడతాయని అన్నారు. వస్తూనే కరెంటు బిల్లులు తగ్గిస్తా అని చంద్రబాబు అన్నారు. గతంలో కరెంటు బిల్లులు రూ.50, 70, 100 లోపు వచ్చేవి. ఇవాళ అదే బిల్లు రూ.500, 700, 1000 చొప్పున వస్తున్నాయి. కర్నాటక బార్డర్‌లో పెట్రోల్‌ పోయించుకుంటే లీటర్‌కు రూ.5 తక్కువగా ఉంది. రేషన్‌ షాపుల్లో ఇప్పుడు బియ్యం తప్ప మరేది ఇవ్వడం లేదు. మరోవైపు చంద్రన్న మాల్స్‌ పేరుతో దోపిడీకి తెర లేపారు. చంద్రన్న మాల్స్‌లో చక్కెర కేజీ 48, చింతపండు కేజీ రూ.290, పామాయిల్‌ రూ.70, గోదుమలు రూ.35 ఉంది. హోల్‌షెల్‌ ధర కన్న 40 శాతం తక్కువకు అమ్ముతున్నామని చంద్రబాబు మంత్రులు అంటున్నారు.
– జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఈయన ముఖ్యమంత్రి కాగానే ఉన్న జాబులు ఊడగొడుతున్నారు.
– చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తా అన్నాడు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను..ఒక్క ఇల్లైనా కట్టించాడా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. వ్యవసాయ రుణాలు అన్ని బేషరత్తుగా మాఫీ చేస్తామన్నారు. నాలుగేళ్ల తరువాత బంగారం ఇంటికి వచ్చిందా?. నోటీసులు మాత్రమే ఇంటికి వస్తున్నాయి. రుణమాఫీ రైతుల వడ్డీలకు సరిపోవడం లేదు. పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. 

ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటాడు..
ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలు రావాలి. ఇదే చంద్రబాబును మనం క్షమిస్తే..రేపు చంద్రబాబు మీ వద్దకు వచ్చి పెద్ద పెద్ద అబద్దాలు చెబుతారు. ప్రతి ఇంటికి కేజీ అంటారు. అంతేకాదు ప్రతి ఇంటికి బెంజీ కారు కొనిస్తానంటారు. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఏదైనా నాయకుడు ఫలానిది చేస్తానని చెప్పి, హామీ నెరవేర్చకపోతే ఇంటికి పోవాలి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. ఇందుకోసం వైయస్‌ జగన్‌కు మీ అందరి చల్లని ఆశీస్సులు, దీవెనలు కావాలి. ఈ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు, రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేయబోతున్నామని నవరత్నాల ద్వారా మనం చెప్పాం. ఇందు కోసం సూచనలు, సలహాలు ఇవ్వమని మిమ్మల్నే కోరుతున్నాను.

నేను రెండు అడుగులు ముందుకు వేస్తా..
ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని మన పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లుగా చదివించే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను. ఒక్కసారి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకోండి. చంద్రబాబు దృష్టిలో నాలుగు కత్తెర్లు ఇస్తే అదే బీసీల మీద ప్రేమ. పేదవాడి మీద ప్రేమంటే ఎలా ఉంటుందంటే నాన్నగారి పాలన గుర్తుకు తెచ్చుకోండి. పేదరికం పోవాలంటే ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా ఇంజినీర్, డాక్టర్‌ కావాలి. సువర్ణయుగంతో నాన్నగారు పేదలను పెద్ద పెద్ద చదువులు చదివించి తోడుగా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లలు ఇంజినీరింగ్‌ చదవాలంటే లక్షల్లో ఫీజులు ఉన్నాయి. చంద్రబాబు మాత్రం ముష్టి వేసినట్లు రూ.30 నుంచి రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇవి కూడా ఏడాది నుంచి రావడం లేదని పిల్లలు చెబుతున్నారు. మిగిలిన డబ్బు ఆ పేదవాడు కట్టాలంటే సాధ్యమా? నాన్నగారు పేదవాడికి కోసం ఒక్క అడుగు ముందుకు వేశాడు. ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తున్నానున. మీ పిల్లలను నేను చదిస్తాను. అంతేకాదు విద్యార్థులకు అయ్యే హాస్టల్‌ ఖర్చులు, మెస్‌ ఖర్చులు నేనే ఇస్తాను. ప్రతి ఏటా విద్యార్థికి రూ.20 వేలు ఇస్తాను. అంతేకాదు చిట్టి పిల్లలను బడికి పంపిస్తే ఆ తల్లుల ఖాతాల్లో ప్రతి ఏటా రూ.15 వేలు వేస్తాను. మీ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు అయితే తల రాతలు మారుతాయి.

పింఛన్‌ రూ.2 వేలు ఇస్తాం
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు రూ. 2 వేలకు పెంచుతున్నాను. పెన్షన్‌ వయస్సు 60 సంవత్సరాల నుంచి 45 ఏళ్లకు తగ్గిస్తాం. వయస్సు పెరిగేకొద్దీ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. ఇటువంటి వాటి కోసం వేరే వ్యక్తులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు కాంట్రాక్టులకు మాత్రమే అంచనాల పేరుతో నిధులు కేటాయిస్తున్నారు. అవ్వతాతలకు మాత్రం పింఛన్లు పెంచడం లేదు. ఇవాళ పనులకు వెళ్తే గాని కడుపు నిండని పరిస్థితి నెలకొంది. అందుకే చెబుతున్నాను. పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తున్నాను. 

ఆడపడుచుల పేరుతో  ఇల్లు రిజిస్ట్రర్‌ చేస్తాం..
నాన్నగారి పాలనలో దేశం మొత్తం 47 లక్షలు ఇల్లు కడితే, ఒక్క ఏపీలోనే 48 లక్షల ఇల్లు కట్టారు. ఇవాళ ప్రతి పేదవాడికి చెబుతున్నాను. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇస్తున్నాను. ఇల్లు కట్టించడమే కాదు ఆ ఇంటికి ఆడపడుచు పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాను. ఒక్కసారి రిజిస్ట్రేషన్‌ చేయించి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడితే ..వారికి డబ్బు అవసరమైతే బ్యాంకుల్లో రుణం పొందేలా చూస్తాను. పావలా వడ్డీకే రుణం ఇప్పిస్తామని మాట ఇస్తున్నాను. ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాల్లో ఎంత అప్పులు ఉన్నాయో ఆ మొత్తం కూడా నాలుగు దఫాలుగా ఆ డబ్బులు ఆ అక్కాచెల్లెమ్మల చేతుల్లో పెడతానని హామీ ఇస్తున్నాను. వీటిలో ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలంటే నాకు చెప్పవచ్చు. ఎవరైనా నన్ను కలువవచ్చు. ఈ రాజకీయ వ్యవస్థను బాగుచేసేందుకు బయలుదేరిన మీ బిడ్డను దీవించమని మీ అందరికి కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశమిద్దాం

చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఒక్కసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇద్దామని ఎమ్మెల్యే సునిల్‌ పిలుపునిచ్చారు. పూతలపట్టులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు హంద్రీనీవా నీరు తీసుకురాకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్‌గా ఉన్న తనను ఎమ్మెల్యేగా చేశారని చెప్పారు. ప్రజల కోసం అనునిత్యం వైయస్‌ జగన్‌ శ్రమిస్తున్నారని, సంక్షేమమే తన ఊపిరిగా పని చేస్తున్నారని, ఆయనకు ఉన్న నిబద్ధత మరెవరికి లేదని, దళితుల ఆత్మబంధువు అని కొనియాడారు. వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారన్నారు. మనమంతా కలిసి వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధిస్తారని చెప్పారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను వైయస్‌ జగన్‌కు వివరించారు.

బాబూ అది నోరా.. తాటిమట్టా


 • ఇంకా ఎంతకాలం అబద్ధాలతో మభ్యపెడతారు
 • ఇరిగేషన్‌పై రూ. 50 వేల కోట్ల ఖర్చు పచ్చి అబద్ధం
 • ఖర్చు చేసింది మొత్తం రూ. 27,898 మాత్రమే
 • చంద్రబాబు నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుంది
 • ప్రపంచస్థాయి రాజధాని ఎక్కడ నిర్మించారో చెప్పాలి
 • వాస్తవం మాట్లాడినందుకు అంబటిని హౌస్‌ అరెస్ట్‌ చేస్తారా?
 • గ్రామాలకు వెళ్లి మీరే అడగండి ఎవరి పెన్షన్‌ వస్తున్నాయో చెబుతారు
 • పాలనపై నమ్మకం లేక క్షుద్రపూజలకు దిగన చంద్రబాబు
 • ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
హైదరాబాద్‌: చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని, ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై రూ. 50 వేల కోట్లు ఖర్చు చేశానని చెప్పడానికి అది నాలుకా.. తాటిమట్టా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై నాలుగేళ్లలో వాస్తవంగా ఖర్చు చేసింది జీఓ 22ను ప్రకారం రూ. 27,898 మాత్రమేనని, దాంట్లో రూ. 16,186 కోట్లు మాత్రమే ప్రాజెక్టుపైన ఖర్చు చేశారన్నారు. మిగిలినవి అంచెనాలు పెంచుకొని కాజేశారని ఆరోపించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై చంద్రబాబు అని అబద్ధాలు మాట్లాడుతున్నారని, కర్నూలు సభలో రూ. 50 వేల కోట్లు ఖర్చు చేశానని ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టులకు నాలుగు సంవత్సరాల్లో రూ. 16 వేల కోట్లు ఖర్చు చేశారంటే చంద్రబాబు వ్యవసాయం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్నిబట్టే అర్థం అవుతుందన్నారు.
 
చంద్రబాబుకు ముని శాపం ఉందని, ఆయన నిజం చెబితే తల వెయ్యిముక్కలు అవుతుందని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పడూ అనేవారని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. నాలుగు సంవత్సరాల్లో రూ. 1.20 లక్షల కోట్ల అప్పు చేశారని, అందులో లక్ష పక్కనబెట్టినా.. రూ. 20 వేలు కూడా ప్రాజెక్టులకు ఖర్చు చేయలేకపోయారన్నారు. కొత్త సంవత్సరం కదా మనిషి మారి వాస్తవాలకు కొంత దగ్గరకు వస్తాడనుకున్నా.. కానీ ఆయన తీరు మార్చుకోలేదన్నారు. రైతు రుణమాఫీ రూ. 24 వేల కోట్లు చేశానని చెబుతున్నారు కానీ వాస్తవంగా రూ. 12 వేలు కూడా చేయలేదన్నారు. అదే విధంగా డ్వాక్రా రుణమాఫీ చేశానని గొప్పగా చెప్పుకుంటున్నాడని వాస్తవానికి రూ. 6 వేల కోట్లు కూడా చేయలేదన్నారు. ఈ రకంగా ప్రజలను మభ్యపెడుతూ ఇంకా ఎంతకాలం పరిపాలన సాగిస్తారని బొత్స ప్రశ్నించారు. 

ప్రపంచస్థాయి రాజధాని కడతానని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పటి వరకు అమరావతి శాశ్వత రాజధానికి ఒక ఇటుక కూడా వేయలేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సభలో రాజధాని నిర్మాణానికి ఎన్ని నిధులు ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని ప్రశ్నించారన్నారు. దానికి కేంద్రం రాజ్‌భవన్, అసెంబ్లీకి కలిపి 2014–15లో రూ. 500 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ. 500 కోట్లు 2015–16లో 350 కోట్లు, అర్బన్‌ డౌలప్‌మెంట్‌కు 2014–15లో రూ.250 కోట్లు, 2015–16లో రూ. 450 కోట్లు, మొత్తం రూ. 1500 కోట్లు ఇచ్చామని చెప్పారన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.1583 కోట్లు ఖర్చు చేశామని నివేదిక ఇచ్చిందన్నారు. 

హైదరాబాద్‌ స్థాయి కాకుండా ప్రపంచస్థాయి రాజధాని అన్నారు. ఏ దేశం వెళ్తే ఆ దేశ రాజధానిలా అమరావతి రూపుదిద్దుతానన్నారు. రూ. 1583 కోట్లు అదనంగా ఖర్చు చేశామని చెప్పారు కానీ అసలు రాజధాని ఎక్కడ నిర్మించారో తెలియడం లేదన్నారు. నిర్మించిన భవనాలన్నీ తాత్కాలికమే.. అయినప్పుడు ఇన్నీ వందల కోట్లు ఎందుకు ఖర్చు చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. ఎందుకిలా ప్రజలను మభ్యపెడుతున్నారు చంద్రబాబూ అని బొత్స నిలదీశారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాలు, అవినీతి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు రంగు మొత్తం బయటపడిందని, ఇక ఆయన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలెవరూ సిద్ధంగా లేరన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అంబటి రాంబాబును అక్రమంగా హౌస్‌ అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసం అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల పేరుతో నిజమైన లబ్ధిదారులకు పెన్షన్‌ అందడం లేదని అంబటి రాంబాబు వాస్తవం చెబితే.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అందరికీ అందుతున్నాయని, బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారన్నారు. దీంతో ప్రజలకు పెన్షన్‌లు అందుతున్నాయో లేదో.. తెలుసుకునేందుకు వెళ్తున్న అంబటిని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోలీసు బందోబస్తుతో గ్రామాలకు వెళ్లి ఎంక్వైరీ చేయాలన్నారు. అది వాస్తవం కాదు కాబట్టే అంబటిని అరెస్టు చేశారన్నారు. ఎందుకు ఇలా అబద్ధాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తారని టీడీపీ సర్కార్‌ను ప్రశ్నించారు. 

పిల్లి మీద ఎలుక, ఎలుక మీద పిల్లి చెప్పుకున్నట్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్రంమీద కేంద్రం, కేంద్రం మీద రాష్ట్రం చెప్పుకుంటున్నాయని బొత్స ఆరోపించారు. ప్రాజెక్టును ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చంద్రబాబు చెబుతున్నారని, ఏ ప్రతిపక్షంగా పోలవరం నిర్మాణాన్ని అడ్డుకుందో నిరూపించాలని డిమాండ్‌ చేశారు. తోటపల్లి ప్రాజెక్టును వైయస్‌ఆర్‌ హయాంలో రూ. 600ల కోట్లు ఖర్చు చేసి 85 శాతం పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులకు రూ. 200ల కోట్లు ఖర్చు చేయడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. అట్టహాసంగా రాయలసీమకు నీరు ఇచ్చానని చెప్పుకుంటున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును రూ. 6 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇంకో వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. కానీ జీవో 22ను తీసుకొచ్చి దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు తన పరిపాలనపై నమ్మకం లేక క్షుద్రపూజలు, కోటల్లో తవ్వకాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మైండ్‌ సెట్‌ ఎలాంటిదంటే ఆయన చిన్నప్పుడు చదువుకున్న స్కూల్‌కు నేటికీ సున్నం కూడా వేయించలేని దౌర్భాగ్యమన్నారు. ఇప్పటికైనా అబద్ధాలు కట్టిపెట్టి, వాస్తవాలకు దగ్గరగా వచ్చి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 
 

వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని సమర్ధించేందుకే పార్టీలో చేరా

చిత్తూరు: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని సమర్థించేందుకే తాను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరానని మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ఇవాళ రవిబాబు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో తీవ్రమైన వైఫల్యాలను ఎదుర్కొంటుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో చెప్పిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం కావాలన్నారు. ఏ స్ఫూర్తితో పేదరికాన్ని తొలగించాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి భావించారో అదే స్ఫూర్తితో వైయస్‌ జగన్‌ ప్రజల కోసం తిరుగుతున్నారన్నారు. సమర్థవంతమైన పాలన అందించేందుకు ఇవాళ వైయస్‌ జగన్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. ఆ బలమైన నాయకత్వంలో పనిచేయాలన్న ఆలోచనతోనే తాను వైయస్‌ఆర్‌సీపీలో చేరానన్నారు.  

నేరగాళ్లకు కొమ్మకాస్తున్న చంద్రబాబు

అనంతపురం: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన చంద్రబాబు సర్కార్‌ నేరగాళ్లకు కొమ్ముకాస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగి రెండు వారాలు గడుస్తున్నా.. నేరస్తులను గుర్తించకపోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. దుర్గగుడిలో తాంత్రిక పూజలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. నేరం జరిగిన ప్రతీసారి చంద్రబాబు ఒక కమిటీని వేసి వాస్తవాలను సమాధి చేస్తూ చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు బాబు పాలనలో అనేక కమిటీలు వేశారని, అయినా దాంట్లో ఒక్క వాస్తవం కూడా బయటపలేదన్నారు. ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన అని ప్రశ్నించారు. తాంత్రిక పూజలపై వాస్తవాలను బయటపెట్టాలని లేనిపక్షంలో అమ్మవారి ఆగ్రహానికి టీడీపీ సర్కార్‌ బలికాక తప్పదన్నారు.

టీడీపీ ఓటమి చిత్తూరు నుంచే మొదలు

చిత్తూరు: రైతు రుణమాఫీ అనే ఒక్క మోసపువాగ్ధానాన్ని నమ్మి ప్రజలంతా విశ్వాసంతో ఓటేస్తే రైతులను చంద్రబాబు నట్టేట ముంచాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి పద్మజ విమర్శించారు. గతంలో 9 ఏళ్ల పాటు వెన్నుపోటు పరిపాలనలో వ్యవసాయాన్ని చంద్రబాబు చిన్నచూపు చూశారన్నారు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, రైతుకు గిట్టుబాటు ధర లేదు, పంట బీమా లేదు, ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి వాటిని మర్చిపోయారన్నారు. చంద్రబాబు పాలనలో పదుల ఎకరాలు ఉన్న రైతులు కూడా కష్టాలు పడుతున్నారన్నారు. వేసిన పంటను కోసేందుకు కూలిడబ్బులు కూడా గిట్టుబాటు ధర దొరకడం లేదన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాడిపరిశ్రమను అభివృద్ధి చేస్తానని, చిత్తూరు డైరీని, షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించి రైతులను మేలు చేస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. అదే విధంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రత్యేక హోదా కూడా సాధించుకోవచ్చునని, హోదా వస్తే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయన్నారు. వైయస్‌ జగన్‌ వల్లే ఇవన్నీ సాధ్యపడతాయన్నారు. చంద్రబాబుకు ఓటేసి గెలిపించిన చిత్తూరు జిల్లా వాసులంతా సిగ్గుపడుతున్నారని, రాబోయే రోజుల్లో టీడీపీ ఓటమి చిత్తూరు నుంచే మొదలవుతుందన్నారు. నీతి, నిజాయితీ లేని ఫిరాయింపు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి లాంటి వ్యక్తులకు బుద్ధి చెబుతారన్నారు. 

చిత్తూరు జిల్లాలో జ‌గ‌న్ నినాదం


- జ‌న‌నేత‌కు అడుగడుగునా ఘనస్వాగతం 

చిత్తూరు:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర  దిగ్విజయంగా కొనసాగుతోంది. సీఎం సొంత జిల్లా చిత్తూరులో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేరు మార్మోగుతోంది. దారుల‌న్నీ కూడా జ‌గ‌న్‌న్నినాదంతో హోరెత్తుతున్నాయి. చంద్ర‌బాబు ఇలాఖాలో రాజ‌న్న బిడ్డ‌కు ఆత్మీయ స్వాగ‌తం ల‌భిస్తోంది.  ప్రజాసంకల్పయాత్ర నేడు 56వ రోజుకి చేరుకోగా..  మొరవపాటూరు నుంచి ఉద‌యం వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర ప్రారంభమైంది. కొండారెడ్డిపల్లి క్రాస్‌ నుంచి తలుపులపల్లి గ్రామం చేరుకొని అక్కడ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి తిమ్మిరెడ్డిపల్లి , తోటలోపు, టీ రంగం పేట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నాం భోజన విరామం అనంతరం తిరిగి యాత్ర మొదలుపెడతారు. రంగంపేట క్రాస్‌ చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. సీఎం సొంత గ‌డ్డ‌పై ప్ర‌తిప‌క్ష నేత‌కు విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. మూడు రోజుల క్రితం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కుప్పం నుంచి వేలాదిగా ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చి వైయ‌స్ జ‌గ‌న్‌కు సంఘీభావం తెలుప‌గా, నిన్న చంద్ర‌బాబు సొంతూరు చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌నేత‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇవాళ పూత‌ల‌ప‌ట్టు ని యోజ‌క‌వ‌ర్గంలో కూడా అదే ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

 పల్లెల్లో వెలుగు దివ్వె
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ పల్లెల్లో వెలుగు దివ్వెగా మారుతోంది.. అవ్వాతాతల్లో, అక్కాచెల్లెళ్ల మనసుల్లో భరోసాను పెంచుతోంది.. మీ కష్టాలను పంచుకునేందుకు నేనున్నానంటూ ధైర్యం చెబుతోంది.. ప్రజా సంకల్పయాత్ర పల్లెలన్నీ దాటుకుంటూ నిన్న చంద్రగిరి నియోజకవర్గానికి చేరుకుంది. ఆదివారం ఉదయం పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి,  ఎమ్మెల్యే రోజా తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుదిపట్లబైలు జనసంద్రంగా మారింది. పార్టీ నేతలు, అభిమానుల సందడితో హోరెత్తింది. ‘విజయీభవ’ అంటూ పల్లెజనం రాజన్న బిడ్డను ఆశీర్వదించారు. 250 మంది గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. నూటొక్క మంది మహిళలు ఒకేసారి సామూహికంగా హారతులు పట్టారు. మంగళవాయిద్యాల నడుమ వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. కిటకిటలాడుతున్న జనం మధ్య పార్టీ అధినేత కొంతసేపు బందీ అయ్యారు. డప్పుల మోత, సాంస్కృతిక నృత్యాలతో యాత్ర జాతరను తలపించింది. వేలాది మంది జనం రాజన్నబిడ్డను ఆహ్వానించేందుకు హాజరయ్యారు. 

5 January 2018

మొబైల్ ఫోన్ డేటా లీకేజిపై స‌మాధానం చెప్పాలి

న్యూఢిల్లీ : విదేశాలకు మొబైల్‌ ఫోన్‌ డేటా లీకేజీ ఆరోప‌ణ‌ల‌పై స‌మాధానం చెప్పాల‌ని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ‌ సభ్యులు విజయసాయి రెడ్డి ప్ర‌శ్నించారు. రాజ్య‌స‌భ‌లో ఆయ‌న అడిగిన ప్రశ్నకు  కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా సమాధానమిచ్చారు.మొబైల్ ఫోన్ డేటా లీకేజీ వాస్త‌వ‌మేన‌ని ఆయ‌న అంగీక‌రించారు. అయితే లీకవుతున్న సమాచారం ఎలాంటిదో కనిపెట్టడం కష్టమని మనోజ్ సిన్హా శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు.మొబైల్ ఫోన్ల ద్వారా విదేశాలకు సమాచారం లీక్ అవుతున్నట్లుగా కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.ఈ వార్తలపై వెంటనే స్పందించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగిందన్నారు. మొబైల్ ఫోన్ల భద్రత, రక్షణ కోసం ఫోన్ల తయారీ సంస్థలు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయి..ఆయా ఫోన్ల ఆర్కిటెక్చర్, ఫ్రేమ్‌ వర్కు తదితర వివరాలను సమర్పించాలని మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలను కోరినట్లు మంత్రి తెలిపారు. మొబైల్ డేటా విదేశాలకు లీకవుతున్నట్లు వార్తలు వెలువడిన తర్వాత తమ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండర్డైజేషన్ టెస్టింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్ విభాగం దీనిపై లోతుగా  పరిశీలన జరిపిందని మంత్రి స‌మాధానం చెప్పారు. 
- రాజ‌ధానికి నిర్మాణానికి నిధులు కేటాయించాల‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. అలాగే ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌కు నిధులు కేటాయించ‌డం లేద‌ని ఆయ‌న ఫిర్యాదు చేశారు. 

లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి ఫిర్యాదు

న్యూఢిల్లీ: పులివెందులలో ఇటీవల నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో జరిగిన ఘటనపై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి రౌడీషీటర్లను తీసుకొని తాను మాట్లాడుతుండగా మైక్‌ లాక్కున్నారని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే నా చేతిలోని మైక్‌ లాక్కునే యత్నం చేశారని అవినాష్‌రెడ్డి స్పీకర్‌కు తెలిపారు. ఎంపీ అన్న గౌరవం కూడా ఇవ్వకుండా తన ప్రతిష్టకు భంగం కలిగించారని చెప్పారు. రౌడీషీటర్లపై చర్యలు తీసుకోవాలని అవినాష్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు

అగ్ని ప్ర‌మాదంపై వైయ‌స్ జ‌గ‌న్ ఆరా

చిత్తూరు: వైయ‌స్ఆర్ జిల్లా బద్వేలులోని అంబేద్కర్-మార్క్స్ కాలనీలో నిన్నరాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై చిత్తూరు జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్రలో ఉన్నవైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఈ ప్రమాదంపై స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలను అడిగి  వివరాలు  తెలుసుకున్నారు. అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలబడాలని వారికి సూచించారు. 

స‌త్యం మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం
చిత్తూరు: గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని  అచ్చంపేట మండల వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు సందెపోగు సత్యం హఠాన్మరణంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యకం చేశారు. మృతుని కుటుంబ సభ్యులతో ఈరోజు నేరుగా ఫోన్లో మాట్లాడి, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి స‌త్యం చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం తెలిపారు.

వైయ‌స్ జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల‌కు పూర్తి విశ్వాసం

చిత్తూరు:వైయస్‌ జగన్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా నాయ‌కుడు ధర్మ‌శ్రీ ధీమా వ్యక్తం చేశారు.  ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం జననేతకు విశాఖ జిల్లాకు చెందిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ధర్మశ్రీ మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వంంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. కరెంటు బిల్లులు విఫరీతంగా పెరిగాయని ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. చంద్రబాబు తీరుతో జనం విసుగు చెందారని చెప్పారు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేయడం, టీడీపీ కార్యకర్తలకు లబ్ధిచేకూర్చే కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. 
2019లో వైయస్‌ జగన్‌ సీఎం: భాగ్యలక్ష్మీ 
2019లో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మహిళా విభాగం నాయకురాలు భాగ్యలక్ష్మీ అన్నారు. మహిళల నుంచి, యువత నుంచి ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన వస్తుందని ఆమె తెలిపారు. చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఓట్లు వేయించుకొని మాట తప్పారన్నారు.  

ప్రజా సంకల్ప యాత్రతో టీడీపీ నేతల్లో వణుకు

చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో టీడీపీ నేతల్లో వణుకు పుడుతోందని వైయస్‌ఆర్‌సీపీ రైల్వే కోడురు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఆయన వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై అధికారులను నిలదీస్తుంటే తట్టుకోలేకపోతున్నారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు తమ సమస్యలు వైయస్‌ జగన్‌కు చెప్పుకొని సంతోషçపడుతున్నారని, మీరు ముఖ్యమంత్రి అయితే మా బాధలు తీరుతాయని ప్రజలు నమ్ముతున్నారన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చెప్పినవి, చెప్పనివి కూడా చేశారని గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రైతులు సీఎం క్యాంపు ఆఫీస్, జన్మభూమి సభల్లో ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ చెప్పిన నవరత్నాలను ప్రజలు విశ్వసిస్తున్నారని కోరుముట్ల చెప్పారు. రాబోయేది రాజన్న రాజ్యమే అని విశ్వాసం వ్యక్తం చేశారు.

జన్మభూమి కాదు.. జాదూభూమి


 • వాగ్ధానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని బాబే ఒప్పుకున్నాడు
 • ప్రజలను డైవర్ట్‌ చేయడానికి జన్మభూమి కార్యక్రమం
 • అధికారులను నిలదీస్తే పోలీసులతో బెదిరింపులా?
 • ప్రజా సంకల్పయాత్రకు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజానికం
 • మోసంలో లోకేష్‌ తండ్రిని మంచిన తనయుడు
 • దత్తత తీసుకున్న నిమ్మకూరును సర్వనాశనం చేశాడు
హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమం జాదూభూమిగా పేరుగాంచిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఐదోసారి జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు 17 లక్షల ఇళ్లు, 2 లక్షల రేషన్‌ కార్డులు, 4 లక్షల పెన్షన్లు ఇస్తానని చెబుతున్నారని, అంటే ఇంతకు ముందు జరిగిన నాలుగు విడుతల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయనే ఒప్పుకున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న మద్దతు చూసి బెదిరిన టీడీపీ సర్కార్‌ ప్రజలను డైవర్ట్‌ చేయడానికి జన్మభూమి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడని ఆర్కే ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పుడు వాగ్ధానాలు నమ్మి మోసపోయామని ప్రజలంతా స్వచ్ఛందంగా ప్రజా సంకల్పయాత్రకు వచ్చి వైయస్‌ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకుంటున్నారన్నారు. ఈ పొరబాటు మళ్లీ చేయం అండగా ఉంటామని చెప్పడాన్ని గమనించిన చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ తన తప్పుడు వాగ్ధానాల చిట్టాను తెరిచారన్నారు. 
వైయస్‌ఆర్‌ పాలనను చూసి నేర్చుకో...
2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజలు అన్ని సంక్షేమాలు అందించి తరువాత 2009 ఎన్నికల్లో రేషన్, పెన్షన్‌ అందుతున్నాయా, నేను కట్టించిన ఇంట్లో ఉంటున్నారా.. ఆరోగ్యశ్రీ, 108 సౌకర్యాలు అందుతున్నాయా..? అందితేనే మీరు నాకు ఓటు వేసి ఆశీర్వదించండి అని ఎన్నికలకు వెళ్లారన్నారు. అలాంటి మహానేతను ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు పరిపాలన సాగించాలన్నారు. కానీ మళ్లీ అబద్ధపు హామీలు ఇస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆర్కే మండిపడ్డారు. జన్మభూమి సభల్లో ప్రజలు అధికారులను ఇల్లు, రేషన్, పెన్షన్‌ రాలేదని నిలదీస్తున్నారన్నారు. అవిపట్టించుకోకుండా నిలదీస్తున్న ప్రజలను పోలీసులతో బెదిరించి భయపెట్టి సభ నుంచి పంపిచేస్తున్నారన్నారు. 
విద్యాశాఖ దారుణంగా తయారైంది..
చంద్రబాబు పాలనలో విద్యాశాఖ దారుణంగా తయారైందని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 3500  ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తానని సిగ్గులేకుండా చంద్రబాబు సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చారన్నారు. జన్మభూమి సభలకు రావడానికి నిరాకరిస్తే ఉపాధ్యాయులను, పిల్లలను తీసుకెళ్లి కూర్చోబెట్టి చంద్రబాబు చప్పట్లు కొట్టించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ, చైతన్య వంటి విద్యా సంస్థలను విడిచి పెట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల భవిష్యత్తును చంద్రబాబును నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. 
నిమ్మకూరును ఏం ఉద్దరించావు లోకేష్‌..
ప్రజలను మోసం చేయడంలో మంత్రి లోకేష్‌ తండ్రిని మంచిన తనయుడిగా ఎదుగుతున్నాడని ఎమ్మెల్యే ఆర్కే విమర్శించారు. ఎమ్మెల్సీ కాకమునుపే కృష్ణ జిల్లా నిమ్మకూరు స్వర్గీయ ఎన్టీఆర్‌ జన్మించిన గ్రామాన్ని లోకేష్‌ దత్తత తీసుకున్నాడని గుర్తు చేశారు. తాతగారి ఊరిని ఉద్దరిస్తానని చెప్పిన లోకేష్‌ ఇప్పటికి నాలుగు జన్మభూమి కార్యక్రమాలు అయిపోయినా ఆ గ్రామానికి ఏం చేశాడో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ధనం నుంచి రూ. 18 కోట్లు కేటాయించానని చెబుతాడు కానీ ఇప్పటి వరకు ఆ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అయినా దత్తత తీసుకున్న గ్రామానికి ఎవరైనా ప్రజాధనాన్ని ఉపయోగిస్తారా లోకేష్‌ అని ప్రశ్నించారు. నాన్న నీను నీకు ఏమాత్రం తీసిపోను నిమ్మకూరును సర్వనాశనం చేయడానికి తీసుకున్నానన్నట్లుగా స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తన నియోజకవర్గంతో పాటు ఆ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తానని ఎస్‌డీఎఫ్‌ ఫండ్స్‌ ఇవ్వాలని కోరినా చంద్రబాబు పైసా ఇవ్వలేదన్నారు. 
ఎన్టీఆర్‌ విగ్రహం కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగు
పొట్టపొడిస్తే అక్షరం ముక్కరాని వ్యక్తి, ఏది ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో.. తెలియని వ్యక్తి లోకేష్‌ అని ఆర్కే అభిప్రాయపడ్డారు. అలాంటి వ్యక్తికి సీనియర్‌ మంత్రులను పక్కనబెట్టి మూడు ప్రధాన శాఖలు చంద్రబాబు కేటాయించారని మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న లోకేష్‌ దత్తత తీసుకున్న నిమ్మకూరునే బాగుచేయలేకపోయారన్నారు. నిమ్మకూరులో వాటర్‌ ట్యాంక్‌ కుప్పకూలే పరిస్థితికి వచ్చిందని, అదే విధంగా ప్రభుత్వ పాఠశాల దుస్థితి, చెరువులో చుక్క నీరు లేని ఫొటోలను ఆర్కే మీడియాకు చూపించారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ అసెంబ్లీలో చంద్రబాబు పుట్టిన గ్రామం నారావారిపల్లెలో అభివృద్ధి ఎలా ఉందో.. అసెంబ్లీలో ఫొటోలతో సహా చూపించారని గుర్తు చేశారు.  కన్నతల్లి మీద ఎలాగూ ప్రేమలేదు.. కనీసం జన్మనిచ్చిన ఊరిపై కూడా ప్రేమ లేకుంటే ఎలా చంద్రబాబూ అని ఆర్కే ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ తనయకుడు హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో వేసిన రోడ్లు మాత్రమే గ్రామంలో ఉన్నాయని ఆర్కే చెప్పారు. దత్తత తీసుకున్న, పుట్టిన ఊరిలో సంక్షేమాన్ని పట్టించుకోని వారు రాష్ట్ర ప్రజలను ఏ విధంగా పట్టించుకుంటారని ప్రశ్నించారు. మీరు నిజంగా ప్రజా సంక్షేమం బాగుండాలని కోరుకుంటే ఒకరు నారావారిపల్లె వెళ్లి పుట్టిన ఊరి రుణం తీర్చుకోండి.. మరొకరు దత్తత తీసుకున్న నిమ్మకూరు వెళ్లి ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి కాళ్లు పట్టుకొని అభివృద్ధి చేస్తానని వేడుకోవాలని సూచించారు.  
 

ఎన్నికల కోసం బాబు డ్రామాలు


– పింఛన్లు ఇవ్వడం లేదని చంద్రబాబుకు ఇప్పుడే తెలిసిందట
– కొత్త పింఛన్లతో పాటు నాలుగేళ్ల బకాయిలు కూడా ఇవ్వండి.
–కరెంటు బిల్లులు పెంచినందుకు ఓట్లు వేయాలా?
– ఏమీ చేయకుండా ఓట్లు అడుగుతున్న చంద్రబాబు సిగ్గుపడాలి.
– ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.
– చంద్రబాబు పాలనలో రోగమొస్తే చనిపోవాల్సిందే
– అందరికీ కార్పోరేట్‌ వైద్యం అందిస్తాం
– ఎంత పెద్ద ఆçపరేషన్‌ అయినా ఉచితంగా చేయిస్తాం. 
 – కిడ్నీ పేషెంట్లకు నెలకు రూ.10 వేలు పింఛన్‌
– ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.
– పుంగనూరుకు నీరు తెస్తా..ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా
 
చిత్తూరు: మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. నాలుగేళ్ల పాటు పింఛన్లు ఇవ్వకుండా అన్యాయం చేసిన ఈ వ్యక్తికి ఇప్పుడు జ్ఞానోదయం అయిందని, పింఛన్లు ఇవ్వడం లేదన్న విషయం ఇప్పుడే తెలిసిందని డ్రామాలాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. నాలుగేళ్లలో ఏ ఒక్క హామీని అమలు చేయని వ్యక్తి తనకు ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని చెప్పడం దుర్మార్గమన్నారు. చిత్తూరు జిల్లాకు చంద్రగ్రహణం పట్టుకుందని, అభివృద్ధి ఆగిపోయిందని జననేత ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా సదుం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అశేష జనవాహిణిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

– మేమంతా మీకు తోడుగా ఉన్నామని నాతో పాటే అడుగులో అడుగులేశారు. ఇన్ని వేల మంది ఈ నడిరోడ్డుపై ఇక్కడికి వచ్చి ఈ ఎండలో నిలబడాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. ఎండను ఖాతరు చేయడం లేదు. నడిరోడ్డు అని లెక్క చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుతో ప్రేమానురాగాలు చూపుతున్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ఓట్ల కోసం బాబు పాట్లు..
ఈ రోజు మీరు పేపర్‌ చదివి ఉంటారు. నిన్న చంద్రబాబు మాటలు చూస్తే నాకు ఆశ్చర్యమనిపించింది. నాలుగేళ్లు చంద్రబాబు పాలన చూశారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు చెబుతున్నారు. ఇదే చంద్రబాబు అంటారు..పింఛన్లు ఇవ్వడం లేదన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసిందట. చాలా మందికి పింఛన్లు ఇవ్వలేకపోయానని నాకు అర్థమైందని చంద్రబాబు అంటున్నారు. నాలుగేళ్ల పాటు సీఎంగా పనిచేశావు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పటికైనా మీరు ఒప్పుకున్నారు. ఇక ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త పింఛన్లు ఇవ్వండి, ఈ నాలుగేళ్ల పాటు బకాయిలు కూడా ఇవ్వమని నేను డిమాండు చేస్తున్నాను. గతంలో ఎన్‌టీ రామారావు కొత్త పార్టీ పెట్టినప్పుడు ప్రజలకు రూ.2 కిలో బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్‌టీఆర్‌కు ఓట్లు వేస్తారని అప్పటి ప్రభుత్వం రూపాయి 75 పైసలకే బియ్యం ఇచ్చారు. ఎన్నికలప్పుడే మేం గుర్తుకు వస్తామా అని ప్రజలు ఆప్పటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లు చంద్రబాబు కూడా ఇప్పుడు బుద్ధి చెప్పనున్నారు. 

నీకు ఓటేందుకు వేయాలి బాబూ?
చంద్రబాబుకు ఓట్లు వేయకపోతే మనం సిగ్గుపడాలంట. ఆయన అంటున్న మాటలు చూస్తే చంద్రబాబుకు కన్నులు నెత్తికి వచ్చినట్లు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. మనిషి ఎదిగే కొద్ది ఒదగాలి.  నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశారు కాబట్టి నేను అడుగుతున్నాను. నీకు ఓటు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలా? అన్ని రకాలుగా అన్యాయాలు చేస్తూ దోచుకొని పరిపాలన చేస్తూ మళ్లీ ప్రజలను ఓట్లు అడుగుతున్నందుకు నీవు సిగ్గుపడాలా?. చంద్రబాబు నీకు ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలని అడుగుతున్నాను. ఆర్టీసీ చార్జీలు పెంచినందుకు ఓటు వేయాలా అని అడుగుతున్నాను. మూడు సార్లు కరెంటు బిల్లులు పెంచినందుకు ఓట్లు వేయాలా?. రేషన్‌ షాపుల్లో గతంలో 9 రకాల సరుకులు ఇచ్చేవారని, ఇప్పుడు బియ్యం తప్ప వేరేవి ఏమీ ఇవ్వడం లేదు.
 
ఎన్నికల్లో ఊదరగొట్టారు..
ఎన్నికల సమయంలో చంద్రబాబు అది చేస్తాం..ఇదిచేస్తామని ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి చేయడం లేదు. ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో కనీసం ఒక్క ఇల్లైనా కట్టించాడా?.  బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు.  వ్యవసాయ రుణాలన్నీ కూడా బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను..బ్యాంకుల్లో బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతున్నాను. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రాలేదు. బ్యాంకుల నుంచి నోటీసులు మాత్రమే వస్తున్నాయి. రుణమాఫీ పథకం రైతుల వడ్డీలకు సరిపోవడం లేదు.  పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్ని పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను..కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా అని అడుగుతున్నాను. పైగా వడ్డీ లేని రుణాలు కూడా రావడం లేదు. సీఎం కాగానే బ్యాంకులకు వడ్డీ లెక్కలు చెల్లించడం లేదు.  జాబు రావాలంటే బాబు రావాలని ఆ నాడు ఎన్నికల సమయంలో అన్నాడు. ఆ రోజు ప్రతి నిరుద్యోగికి  రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ప్రతి ఇంటికి లెటర్‌ పంపించాడు. ఇప్పటి వరకు రూ.90 వేలు ప్రతి ఇంటికి బాకీ పడ్డాడు. నిరుద్యోగ భృతి ఎగురగొట్టినందుకు నీకు ఓటు వేయాలా ? . ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. దాని వల్ల కాస్తోకూస్తో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. నాడు ప్రత్యేక హోదా సంజీవని అని, 15 ఏళ్ల ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన వ్యక్తి తన ఓటుకు కోట్లు కేసు కోసం తాకట్టు పెట్టారు.ప్రత్యేక హోదాను అమ్మినందుకు ఓట్లు వేయాలా?

రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి 
రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుంది. ఇసుక, మట్టి, బొగ్గు, రాజధాని భూములు, గుడి భూములు కూడా వదలకుండా అవినీతి చేస్తున్నారు. పైస్థాయిలో చంద్రబాబు అవినీతికి పాల్పడుతూ గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలతో మాఫియాను తయారు చేశారు. పింఛన్లు రావాలన్నా..మరుగుదొడ్డి మంజూరు కావాలన్నా లంచాలు అడుగుతున్నారు.

చంద్రగ్రహణం
పుంగనూరు నియోజకవర్గంలో తాగునీరు ఇచ్చేందుకు కొళ్లకుంట రిజర్వాయర్‌ను కట్టించారు. పుంగనూరులో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును దివంగత ముఖ్యమంత్రి కట్టించారు. మధ్యలో వేసే పైప్‌లైన్‌కు గ్రహణం పట్టుకుంది. ఇవాల్టికి పుంగనూరుకు తాగునీరు కరువైంది. ఇదే సదుంలో 30 పడకల ఆసుపత్రి కోసం రామచంద్రారెడ్డి తన సొంత భూమి 11 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ రోజు శంకుస్థాపన కూడా జరిగింది. టెండర్లు కూడా పిలిచారు. దానికి చంద్రగ్రహణం పట్టుకుంది. ఆ భూమి వెనక్కి ఇవ్వరు. ఆసుపత్రి కట్టడం లేదు. మనమన్న ఆ ఆసుపత్రి కడుదామని రామచంద్రారెడ్డిని అడుగుతున్నాను. ఆసుపత్రి కట్టించి ఓట్లు అడుగుదాం. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా
పుంగనూరులోని ఆర్టీసీ డిపో కట్టి 7 సంవత్సరాలు అవుతున్నా..ఇంతవరకు బస్సులు కేటాయించడం లేదు. ఇదీ చంద్రబాబు పాలన తీరు. ఇల్లు ఇవ్వరూ, ఏ నిధులు ఇవ్వరు. ఆయనంతకు ఆయనే డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయ పాలన ఇలా ఉంది. ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబే అంటున్నారు. రేపు మనందరి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏం చేస్తామన్నది చెబుతున్నాను. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని మాట ఇస్తున్నాను. ఆర్టీసీ డిపోను బ్రహ్మండంగా నడిపిస్తానని చెబుతున్నాను. హంద్రీనీవా పనులకు సంబంధించి కాల్వలు తవ్వినా..పిల్ల కాల్వలు తవ్వడం లేదు. నీరు ఇవ్వాలన్న ధ్యాస చంద్రబాబుకు లేదు. హంద్రీనీవా నీళ్లను తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను. మీ చెరువులకు నీరిచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని చెబుతున్నాను.

పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే ధ్యేయం
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేయబోతున్నామన్నది నవరత్నాల గురించి ప్రతి మీటింగ్‌లో చెప్పుకుంటూ వస్తున్నాను. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నవరత్నాల్లోని వైద్యం గురించి మీ అందరికి చెబుతున్నాను. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. పేదవాడు అప్పులపాలు అయ్యేది రెండే రెండు కారణాలు. వైద్యం, విద్య కోసం అప్పులు చేస్తున్నారు. ఆ పరిస్థితి మార్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి గొప్ప స్వప్నాన్ని చూశారు. నాడు 108కు ఫోను చేస్తే 20 నిమిషాల్లో మీ ముందుకు వచ్చేది. ఇవాళ మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయండి. ఇవాళ 108 నంబర్‌కు ఫోన్‌ కొడితే అంబులెన్స్‌ వస్తుందా? మా డ్రైవర్లకు జీతాలు ఇవ్వడం లేదు. మా అంబులెన్స్‌కు టైర్లు బాగలేవు అన్న సమాధానాలు వస్తున్నాయి. దారిపొడువునా ఈ పాదయాత్రలో రోజుకు ఎంతో మంది నా వద్దకు వచ్చి వైద్యం చేయించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. పెద్ద ఆపరేషన్లు చేయించుకోవాలంటే మనమంతా కూడా హైదరాబాద్‌కు వెళ్తాం. ఇక్కడ మనకు మంచి ఆసుపత్రులు లేవు కాబట్టి హైదరాబాద్‌కు వెళ్తాం. అయితే ఇవాళ హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదట. ఎవరికైనా క్యాన్సర్‌ వస్తే 7, 8 సార్లు కీమో థెరఫీ చేయాలట. ఇవాళ ప్రభుత్వం రెండు సార్లు మాత్రమే చేస్తున్నారు. ఆరు నెలల తరువాత పేషేంట్‌ అకాల మరణం పొందుతున్నారు. ఇవాళ మూగ చెవుడు ఉన్న పిల్లాడికి ఆపరేషన్‌ చేయించకపోతే జీవితాంతం అలాగే బతకాల్సి వస్తుంది. ఆ నాడు మూగచెవుడు పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేయించేవారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. కిడ్నీ బాగోలేకపోతే డయాలసిస్‌ చేయించుకోవాలి. ఒక్కసారి చేయించాలంటే రూ. 2 వేలు అవుతుంది. ఏడాది రూ.2 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేయడం లేదు. నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వడం లేదు. రేపు మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను. ఆరోగ్యశ్రీలో ఎంతటి ఆపరేషన్‌ అయినా సరే ఉచితంగా చేయిస్తానని హామీ ఇస్తున్నాను. వెయ్యి రూపాయల బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయిస్తాం. నాన్నగారి హయాంలో మీరంతా చూశారు. ఆయన కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. ఆపరేషన్‌ చేయించిన తరువాత విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా డబ్బులు ఇస్తామని మాట ఇస్తున్నాను. కిడ్నీ పేషేంట్లకు ప్రతి నెల  పింఛన్లు రూ.10 వేలు ఇస్తానని చెబుతున్నాను. పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే నా ధ్యేయమని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 

మరీ ఇంతనీచంగా పాలిస్తారా?

చిత్తూరు: చంద్రబాబు పెద్ద పెద్ద ప్రాజెక్టుల నుంచి నిరుపేదల మరుగుదొడ్ల డబ్బులు దాకా అన్ని టీడీపీ నేతలు తినేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో 600ల వాగ్ధానాలిచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పెద్దిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి పరులకు ఇండ్లు, రేషన్, పెన్షన్‌ అందకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. చంద్రబాబు పాలన మొత్తం ఒక వర్గానికి మేలు జరిగే విధంగా ఉందన్నారు. గతంలో దివంగత మహానే వైయస్‌ రాజశేఖరరెడ్డి కులం, మతం, వర్గ బేధాలు లేకుండా అడిగిన వారందరికీ సంక్షేమ ఫలాలు అందించారన్నారు. కానీ అధికారం దక్కించుకున్న చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌ తరహాలు సువర్ణ పరిపాలన అందించేందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజల ముందుకు వచ్చారన్నారు. ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలే కుండా పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు తెలుసుకొని అందరికీ ఉపయోగపడేలా.. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా జననేత మేనిఫెస్టో తీసుకురానున్నారన్నారు. చిత్తూరులో చంద్రబాబు మూసివేసిన షుగర్‌ ఫ్యాక్టరీలను, చిత్తూరు డెయిరీని తెరిపించింది అప్పుడు వైయస్‌ఆర్‌ అయితే.. ఇప్పుడు వైయస్‌ జగన్‌ తెరిపిస్తారన్నారు. అంతే కాకుండా పులిచర్ల, రొంపిచర్ల మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు నిర్మించేందుకు వైయస్‌ జగన్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. 

ఏడాది ఆగండి..మన జగనన్న వస్తున్నాడు

చిత్తూరు: మరో ఏడాది ఆగితే మన జగనన్న ముఖ్యమంత్రి అవుతారని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. సదుం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ మన జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారని, చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆందోలన వ్యక్తం చేశారు. పుంగనూరు అంటే వివక్ష చూపుతున్నారని, నీరు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మన కష్టాలన్నీ కూడా ఒక్క సంవత్సరమే అని, మన రాజన్న కుమారుడు వైయస్‌ జగన్‌ వస్తారని ధైర్యం చెప్పారు. మన కష్టాలు తీరుస్తారని భరోసా కల్పించారు. ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తుందని మిథున్‌రెడ్డి తెలిపారు.

వైయ‌స్ఆర్‌ సీపీలో చేరిక

చిత్తూరు: తంబళ్లపల్లె, కుప్పం నియోజకవర్గాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు. సదుం మండలం మిట్టపల్లెక్రాస్‌ వద్ద పీటీఎం మండలం బూర్లపల్లెకు చెందిన టీడీపీ ఎంపీటీసీ రమణప్ప ఆ పార్టీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఆయనకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కుప్పం నియోజకవర్గంలోని పెద్ద బంగారునత్తానికి చెందిన 20 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

గత జన్మభూమి అర్జీలు ఏవీ నెరవేర్చలేదు

హైదరాబాద్‌: గత జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చినీ ఆర్జీలు ఏవీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బాబు సీఎం కాగానే 19 లక్షల ఇళ్లు కట్టిస్తానని, 2 లక్షల పింఛన్లు, 4 లక్షల రేషన్‌కార్డులు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. నీవు ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడంతో జన్మభూమిలో ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు.  ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ కు ప్రజలు తమ సమస్యలు వివరిస్తున్నారని చెప్పారు. 

4 January 2018

బాబును ప్రజలే ఇంటికి పంపిస్తారు

అధికారం కోసం 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాలుగేళ్లలో ఏ ఒక్కటీ కూడా సక్రమంగా నెరవేర్చలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబును ప్రజలే ఇంటికి పంపిస్తారని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్న సొంత జిల్లా చిత్తూరుపై చిన్నచూపే అని విమర్శించారు. గతంలో చక్కెర పరిశ్రమలు మూత వేయిస్తే..వాటిని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తెరిపించి రైతులకు అండగా నిలిచారన్నారు. చంద్రబాబు తన సొంత సంస్థ అయిన హెరిటేజ్‌ కోసం చిత్తూరు డైరీ, విజయ డైరీలను మూత వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు సాగు నీరు తీసుకురాలేని చంద్రబాబు వైయస్‌ఆర్‌ జిల్లాలో గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 85 శాతం పూరై్తన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తిన చంద్రబాబు ఆ క్రెడిట్‌ అంతా తనదే అని చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. జన్మభూమి సభలను టీడీపీ సొంత కార్యక్రమంలా నిర్వహించుకోవడం బాధాకరమన్నారు.  వైయస్‌ జగన్‌ సీఎం కాగానే చిత్తూరు డైరీ, విజయడైరీలకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు చిత్తూరు జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పెద్దిరెడ్డి చెప్పారు.

అధికారిక సభా వేదికపై రౌడీలెందుకు

ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ప్రసంగాన్ని ఎందుకు అడ్డుకున్నారు
జన్మభూమి సభలో సీఎం తీరును ఖండిస్తున్నాం
ఇది ప్రజాస్వామ్యమా.. లేక రాచరికమా?
చేతిలో మైక్‌ లాక్కోవడమేనా మీ అనుభవం
ఎంపీ ఎవరినైనా దుర్భాషలాడారా.. లేక నిందించారా?
మహానేత వైయస్‌ఆర్‌ కృషిని గుర్తుచేసుకోవడం తప్పా
హైదరాబాద్‌: జన్మభూమి సభ అధికారిక కార్యక్రమం అని చెప్పిన చంద్రబాబు ఆ సభా వేదికపైకి రౌడీలను, గుండాలను ఎందుకు ఎక్కించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కడప జిల్లా పులివెందులలో జరిగిన జన్మభూమి సమావేశంలో ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిపై టీడీపీ నేతలు, చంద్రబాబు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని బొత్స అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్మభూమి సమావేశం పేరుతో పోలీసులు ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిని గృహనిర్బంధం చేయాలని ప్రయత్నించారన్నారు. తరువాత సభకు వచ్చిన ఎంపీని మాట్లాడనివ్వకుండా చంద్రబాబు ప్రవర్తించిన తీరు, చేతిలో మైక్‌ ల్కావడం ఏంటని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా.. లేక నియంత పాలనా అని ప్రశ్నించారు. ముందుగా స్థానిక ఎంపీతో మాట్లాడించి తరువాత సీఎం మాట్లాడాలని అదే ప్రోటోకాల్‌ అని, కానీ చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. 

ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ఎవరినైనా నిందించారా.. లేక ఏమైనా దుర్భాషలాడారా.. దేనికి చేతిలో మైక్‌ లాక్కున్నారని బొత్స ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గండిపేట నుంచి నీరు ఇస్తానని, పైడిపాలెం ప్రాజెక్టు నుంచి నీరు ఇస్తానని చెప్పారు. పైడిపాలెం ప్రాజెక్టు విలువ రూ. 700 కోట్లు ఉంటే చంద్రబాబు కేవలం రూ. 23 కోట్లే ఖర్చు చేశారని, అదే విధంగా గండిపేట ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ. 72 కోట్లేనని, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రూ.11 వందల కోట్లు ఖర్చు చేశారని వైయస్‌ అవినాష్‌రెడ్డి వేదికపై గుర్తు చేశారన్నారు. అంతకంటే ఎక్కువ ఏమైనా మాట్లాడారా.. ఎంపీ చెప్పింది ఏమైనా అవాస్తవమా.. వాస్తవం మాట్లాడినందుకు చేతిలో మైక్‌ లాక్కుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి దాదాపు పూర్తి చేశారని చంద్రబాబే చెప్పుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది ప్రభుత్వ సభ అన్నారు.. ప్రభుత్వ సభలోకి గుండాలు, రౌడీలు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. 

చంద్రబాబూ ఎల్లకాలం అధికారం మీ చేతుల్లో ఉంటుందనుకుంటున్నావా.. ఏంటీ దౌర్జన్యం.. ఇది ప్రజాస్వామ్యమా.. రాచరికమా అని బొత్స మండిపడ్డారు. ప్రజా ప్రతినిధి చేతుల్లోంచి ఎవరైనా మైక్‌ లాక్కుంటారా.. అనువజ్ఞులమని చెప్పుకుంటారు.. ఇదేనా మీ అనుభవం అని ప్రశ్నించారు. సాక్షాత్తు స్థానిక ఎంపీకే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే ఇంకా ఎవరికి ఇస్తారని నిలదీశారు. అదే సభావేదికపై నుంచి 4 లక్షల పెన్షన్లు, రేషన్‌ కార్డులు ఇస్తున్నామని గొప్పులు చెబుతున్నారు.. 2014లో మీరు అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం ఎంత మందికి పెన్షన్‌ ఇచ్చిందో మీ 4 లక్షలతో కలుపుకొని చూసుకోవాలని సూచించారు. మీ పెన్షన్ల కంటే ఎక్కవగానే ఉంటాయన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి పెన్షన్‌లపై రివ్యూమీటింగ్‌లు పెట్టి ఖాళీలు పూరించి అర్హులకు పెన్షన్‌లు ఇచ్చారన్నారు. కానీ మీరు గత మూడున్నరేళ్లుగా ఇస్తున్న పెన్షన్‌ అప్లికేషన్స్‌ను రోడ్లపై పడేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రవర్తనను వైయస్‌ఆర్‌ సీపీ పూర్తిగా ఖండిస్తుందన్నారు. 
భక్తుల మనోభాలను దెబ్బతీస్తున్న చంద్రబాబు
దుర్గగుడిలో తాంత్రిక పూజలపై విచారణ జరిపించాలి
టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏదో ఒకటి చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. రాష్ట్రంలో అందరి ఇళవెల్పు వెంకటేశ్వరస్వామి, అదే స్థాయిలో బెజవాడ దుర్గమ్మ అంటే నమ్మకం అన్నారు. అలాంటి దుర్గ గుడి ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారని బొత్స ఆరోపించారు. 26వ తేదీన దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని, అదీ చంద్రబాబు కుటుంబ సభ్యులు చేయించారని అపవాదలు వచ్చాయన్నారు. ఇది ఒక రాజకీయ పార్టీదో.. ఒక వర్గానిదో కాదని, దీనిపై ముఖ్యమంత్రి, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికీ వారం రోజులు అవుతున్నా.. తాంత్రిక పూజల విషయంపై అతిగతి లేదన్నారు. దేవాదాయ శాఖామంత్రి ఒక మాట. పాలక మండలి ఒక మాట. ఈఓ ఒక మాట చెబుతున్నారన్నారు. ఈఓ దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేయించారని పాలక మండలి చెబుతున్నా.. సంబంధిత మంత్రి ఎందుకు అంత బేలతనంగా ఉన్నారో.. అర్థం కావడం లేదన్నారు. 

ప్రతీదాన్ని రాజకీయ దురుద్దేశ్యంతో చేయాలనుకోవడం తప్పని, అది రాష్ట్రానికే అరిష్టమని బొత్స అన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం దుర్గమ్మ గుడి ఔన్నత్యాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. తాంత్రిక పూజలు జరిగాయని సీసీ ఫుటేజీలలో నిక్షిప్తమయ్యాయని, దీనికి ఇంకా ఎన్ని రోజులు విచారణ చేయిస్తారన్నారు. ఇంకా ఎంత కాలం భక్తులు నిరీక్షించాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు పాటించేవారని, వారి నమ్మకంపై దెబ్బకొట్టకుండా త్వరితగతిన విచారణ జరిపించాలన్నారు. బయటివారు ఆలయంలోకి ఎందుకు వచ్చారు.. వారి వెనక ఉన్నది ఎవరో చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ప్రజాస్వామ్య రీతిలో అధికారిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాలని, పులివెందుల జన్మభూమి సభా వేదికపై ఉన్న రౌడీషీటర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.