2 December 2017

పిల్ల‌లను చదివించుకుంటే జీవితాలు బాగుంటాయి

కర్నూలు: పిల్లలను చదివించుకుంటేనే జీవితాలు బాగుంటాయని మహిళలకు వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శ‌నివారం రాతన గ్రామంలో మహిళలు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను వైయస్‌జగన్‌ అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు తమ రుణాలు మాఫీ చేశాడని మహిళలు ముక్తకంఠంతో చెప్పారు. ఇందుకు స్పందించిన వైయస్‌ జగన్‌ వారికి భరోసా కల్పించారు. మన ప్రభుత్వం వచ్చాక మీ పిల్లలను తాను చదివిస్తానని, బ్యాంకు రుణాలన్నీ కూడా నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని, వడ్డీ డబ్బులు కూడా బ్యాంకులకు కడుతామని చెప్పారు. 
వైయస్‌ జగన్‌ను కలిసిన టమాట రైతులు
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌జగన్‌ను టమాట రైతులు కలిశారు. ఈ సందర్భంగా టమాట ధరలను అడిగి తెలుసుకున్న వైయస్‌ జగన్‌ ఈ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రైతులకు బాక్స్‌కు రూ.200 ఇస్తున్నారని, ఇదే చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్‌ షాపులో కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితి మారుస్తానని, టమాట జ్యూస్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయిస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 

దివ్యాంగుల‌కు రూ.3 వేల పింఛ‌న్‌

- ఈ ప్ర‌భుత్వం ఎవ‌రికి పింఛ‌న్ ఇస్తుంది ఆగ్ర‌హం
- పిం- ఛన్‌ అందేలా కలెక్టర్‌కు లేఖ రాస్తా
కర్నూలు: మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల‌కు నెల‌కు రూ.3 వేల పింఛ‌న్ ఇస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు.  మానసిక వికలాంగులకు పెన్షన్‌ ఇవ్వకపోతే ప్రభుత్వం ఎవరికి ఇస్తుందని ఆయ‌న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రకు ఓ మానసిక వికలాంగ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి తరలివచ్చాడు. వైయస్‌ జగన్‌ ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు. తన కొడుకు నడవలేడు.. మాట్లాడలేడు.. అయినా ప్రభుత్వం పెన్షన్‌ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్పందించిన వైయస్‌ జగన్‌ పెన్షన్‌ అందే విధంగా కలెక్టర్‌కు లేఖ రాస్తానని, అయినా రాకపోతే దిగులుచెందవద్దని, త్వరలో మన ప్రభుత్వం వస్తుందని, వికలాంగులకు పెన్షన్‌ రూ.3 వేలు చేస్తామని, న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. 

అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేదు
ఇంకో సంవత్సరంలో మన ప్రభుత్వం వస్తుంది. వికలాంగులకు పెన్షన్‌ రూ. 3వేలు చేస్తాం.. రెండు కాళ్లు కోల్పోయి పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటికీ అందలేదని వికలాంగుడు వైయస్‌ జగన్‌కు తన బాధను చెప్పుకున్నాడు. పత్తికొండలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్రకు చేరుకొని వైయస్‌ జగన్‌ను కలిశారు. దరఖాస్తు చేసుకుని ఎన్ని సార్లు అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు. న్యాయం జరిగే విధంగా చూస్తానని ఆయనకు హామీ ఇచ్చారు. 

గాలేరు-న‌గ‌రి ప్రాజెక్టుపై ప్ర‌భుత్వం స్పందించాలి

తిరుమల:  గాలేరు-న‌గ‌రి ప్రాజెక్టుపై ప్ర‌భుత్వం స్పందించాల‌ని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. న‌వంబ‌ర్ 28 నుంచి గాలేరు-న‌గ‌రి ప్రాజెక్టు సాధ‌న‌కు రోజా చేప‌ట్టిన పాద‌యాత్ర తిరుమ‌ల చేరుకుంది. శనివారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ... గాలేరు నగరి ప్రాజెక్ట్ సాధనకు 88 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు. రాయలసీమకు అన్యాయం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని రోజా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న పట్టిసీమ ద్వారా రాయలసీమకు చుక్కనీరు రాలేదని రోజా అన్నారు.

క‌ల‌సి న‌డ‌వాల‌ని..కష్టాన్ని చెప్పుకోవాలని.

- స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్న ప్ర‌జ‌లు 
 - అధినేత‌తో క‌లిసి అడుగులు వేస్తున్న పార్టీ నాయ‌కులు
కర్నూల్‌ : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. జ‌న‌నేత ఏ గ్రామానికి వెళ్లినా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. రాజ‌న్న బిడ్డ వ‌స్తున్నార‌ని ఎదురెళ్లి స్వాగ‌తాలు ప‌లుకుతున్నారు. దారి పొడువునా త‌మ క‌ష్టాలు చెప్పుకుంటున్నారు. అలాగే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు. అభిమాన నేతతో కలిసి నడవాలని..కష్టాన్ని చెప్పుకోవాలని.. సంక్షేమ పథకాలు అందని తీరును వివరించాలని.. సుదూర ప్రాంతాల నుంచి  సైతం ప్రజలు భారీఎత్తున తరలివస్తున్నారు. కర్నూలు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది. ఇవాళ ప‌త్తికొండ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభ‌మైంది. ఇక్క‌డి నుంచి రాతన, తుగ్గలి, గిరిగట్ల మీదుగా నేడు మదనంతపురం క్రాస్‌ వరకు యాత్ర కొనసాగనుంది.  

రాత‌న గ్రామంలో ఘ‌న స్వాగ‌తం
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా రాత‌న గ్రామానికి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించిన వైయ‌స్ జగన్‌ ప్రజలను ఆప్యాయంగా పలకరించి ముందుకు సాగారు. 

అధినేత వెంటే..
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు పార్టీ నేత‌లు తోడుగా నిలుస్తున్నారు. శ‌నివారం ఉద‌యం పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, పుష్పవాణి, ఎమ్మెల్సీ ఆళ్లనాని, అరకులోయ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిశారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ పాదాలకు బొబ్బ‌లు తీయ‌డంతో ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాళ్లు నొప్పులు బాధిస్తున్నా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప‌డుతున్న ఆరాటాన్ని చూసి స్ఫూర్తి పొందుతున్నారు.

బుడ‌గ జంగాలకు న్యాయం చేస్తాం
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక బుడ‌గ జంగాల‌కు న్యాయం చేస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. శ‌నివారం వైయ‌స్ జ‌గ‌న్‌ను బుడగ జంగాలు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. జీవో నంబర్ 144 రద్దు చేయించాలని వారు కోరారు.  ఈ విషయమై ఇది వరకే అసెంబ్లీలో చర్చ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామని వివ‌రించారు. 

1 December 2017

పోలవరంపై ముఖ్యనేతల భేటీ

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు అవలంబిస్తున్న వైఖరిపై సీనియర్‌ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు చర్చిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుకోవాలనే దానిపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలో పార్టీ వైఖరిని వెల్లడించనున్నట్లుగా సమాచారం.

4వ రోజు ఎమ్మెల్యే రోజా పాదయాత్ర

చిత్తూరు:  గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు సాధన కోసం నగరి ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా పాద‌యాత్ర శుక్ర‌వారం నాలుగో రోజుకు చేరుకుంది. న‌వంబ‌ర్ 28న ఆమె పాద‌యాత్ర ప్రారంభించ‌గా చిత్తూరు జిల్లాలో విశేష స్పంద‌న ల‌భిస్తోంది. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాలు తాగునీరు, సాగునీటి కోసం గాలేరు-నగరి ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రోజా న‌గరిలోని సత్రవాడ నుంచి ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రానికి రోజా తిరుమలకు చేరుకుంటారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. రోజా పాదయాత్రకు వైయ‌స్ఆర్ పార్టీ నేత‌లు సంఘీభావం తెలిపారు. 

ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆరోగ్యశ్రీ వర్తింపు


– బిల్లేకల్‌ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ
– ప్రజలకు అండగా ఉండేందుకు ప్రజా సంకల్ప యాత్ర
–  వైయస్‌ఆర్‌ గర్వపడేలా ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దుతా
–  రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందికి తీసుకుంటాం
– హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ వర్తించదట
– జన్మభూమి కమిటీలు గ్రామీణవ్యవస్థను ధ్వంసం చేస్తున్నాయి
– చంద్రబాబు లాంటి అవినీతిపరుడు దేశంలోనే ఉండడు
– ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలే తప్ప..ఎమ్మెల్యేలను కొనడం కాదుôæ 
– చట్టసభల్లో చట్టాలను ఖూనీ చేస్తున్నారు

కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి గర్వపడేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీర్చిదిద్దుతానని, ఏ రాష్ట్రానికి వెళ్లినా ఈ పథకం వర్తింపజేస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారని, మన ప్రభుత్వం వచ్చాక రూ.1000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకుంటామన్నారు. ఏ ఆపరేషన్‌ అయినా కూడా ఉచితంగా చేయించడమే కాకుండా, ఆ పేషేంట్‌ విశ్రాంతి తీసుకునే సమయంలో డబ్బులు కూడా ఇస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. చట్టసభల్లో చట్టాలను ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 22వ రోజు వైయస్‌ జగన్‌ ఆలూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. సాయంత్రం బిల్లేకల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నాంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..
– రాష్ట్రం 12 శాతం అభివృద్ధితో పరుగెత్తుతుందట. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మీ ఆదాయం ప్రతి సంవత్సరం 12 శాతం పెరిగిందా అని అడుగుతున్నాను. రాష్ట్రంలో ఏ ఒక్కరి ఆదాయం కూడా పెరగకపోతే రాష్ట్రం అభివృద్ధి ఎలా సాధ్యమన్నారు. చంద్రబాబు పాలన చూసిన తరువాత మీరందరు కూడా ప్రశ్నించమని అడుగుతున్నాను.
– రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. పాదయాత్రలో కంది, పత్తి, మినుము, మిర్చి పంటలను చూశాను. వీటిలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా అని అడుగుతున్నాను. పంట విస్తీర్ణం తగ్గిపోయింది. రైతులు బ్యాంకుల గడపలు తొక్కడం లేదు. శ్రీౖశైలంలో నీరున్నా..మనకు చుక్కా నీరు అందడం లేదు. తాగడానికి నీరు లేదు.
– నాలుగేళ్ల కింద మీ ఇంట్లో కరెంటు బిల్లు రూ.50, 60 వచ్చేవి. ఇప్పుడు ఇంటికి రూ.500, 1000 వస్తున్నాయి. నాడు కరెంటు బిల్లులు తగ్గిస్తానని చెప్పిన చంద్రబాబు విఫరీతంగా కరెంటు బిల్లులు పెంచారు. కరెంటోళ్లు వస్తారు ఇష్టమొచ్చినట్లు జరిమానాలు విధించి చేతిలో చీటిలు పెట్టి వెళ్తున్నారు. ఇది చంద్రబాబు పాలన
– గతంలో రేషన్‌షాపుల్లో బియ్యం, కందిపప్పు, చక్కెర, కిరోసిన్‌ వంటి 9 రకాల సరుకులు ఇచ్చే వారు. ఇప్పుడు బియ్యం తప్ప వేరేవి ఇ వ్వడం లేదు.
– కారుమంచిలో జెడ్పీ హైస్కూలు, కైరుప్పల గ్రామాల్లోని విద్యార్థులు నా వద్దకు వచ్చి కనీసం తాగడానికి నీరు లేదన్నా అంటున్నారు. ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులు వచ్చి మా ఉద్యోగాలు ఎప్పుడు తొలగిస్తారో అని ఆందోళన చెందుతున్నారు. మోడల్‌ స్కూల్‌లో ఆరు నెలలుగా జీతాలు రావడం లేదు. 
– చంద్రబాబు బినామీ నారాయణ. ఆయన స్కూళ్లను ప్రమోట్‌ చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోవడం లేదు. టీచర్లను ఇంటించి పంపించేందుకు అవుట్‌ సోర్సింగ్‌అంటున్నారు.
– నాలుగేళ్ల క్రితం ఇదే పెద్ద మనిషి మైక్‌పట్టుకొని జాబు రావాలంటు బాబు రావాలన్నారు. ఇంటింటికి రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రతి ఇంటికి రూ.90 వేలు చంద్రబాబు బాకీ పడ్డారు.
– ఎన్నికలప్పుడు చంద్రబాబు ఏమన్నారు..బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. రైతుల రుణాలన్ని మాఫీ చేస్తామన్నారు. ఇవాళ మీ బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతున్నాను. ఆయన చేసిన రుణమాఫీ పథకం రైతు వడ్డీలకు సరిపోవడం లేదు.
– పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా అని అడుగుతున్నాను. ఇలాంటి చంద్రబాబును నాలుగేళ్ల పాటు చూశాం. 
– ఇదే చంద్రబాబు ఏ సామాజిక వర్గాన్ని వదల్లేదు. ఆ రోజు బోయలను ఎస్టీలుగా చేసేస్తా అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు..ప్రయత్నం చేస్తా అంటున్నారు. కురువలను ఎస్టీలుగా చేస్తానని మోసం చేశాడు. ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని మోసం చేశాడు.
– మళ్లీ ఇలాంటి వ్యక్తిని ఎన్నికల్లో ఎన్నుకుందామా అని అడుగుతున్నాను. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. మోసం అనే పదం పోవాలి. రాజకీయ నాయకుడు ఇచ్చిన మాట నెరవేర్చకపోతే ఇంటికి వెళ్లాలి. రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి.
– వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను గొర్రెల‌ మాదిరిగా కొనుగోలు చేస్తున్నారు. జయరాం అయితే పందుల మాదిరిగా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలను కొంటే వైయస్‌ఆర్‌సీపీ పని అయిపోతుందని అనుకుంటున్నారు. చంద్రబాబు ఓ సారి గతాన్ని గుర్తు చేసుకోంది. 2011లో ఒక్క జగన్, వాళ్ల అమ్మ వైయస్‌ విజయమ్మతోనే పార్టీ మొదలైంది. ఆ తరువాత ప్రజల నుంచి ఓ కెరటం పుట్టింది. ఆ తరువాత 67 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రజలు ఆశీర్వదించాలి కానీ, నీలా కొనుగోలు చేస్తే కాదు అన్నారు.
–చంద్రబాబు రాజకీయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. చట్టసభలో చట్టాలు చేస్తారు, చట్టాలను కాపాడుతారని మనం అనుకుంటాం. ఇవాళ చట్టసభల్లో చట్టాలను ఖూనీ చేస్తున్నారు. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు ఎక్కడ ఉండవు. చట్టాలను అపహాస్యం చేస్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదు. మట్టి నుంచి ఇసుక దాకా, బోగ్గు, రాజధాని బూములు, గుడి భూములను వదలడం లేదు. అవినీతి సొమ్ముతో ఏమి చేయలో అర్థం కాక అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొరికిపోయినా చంద్రబాబుకు సిగ్గు లేదు. వ్యవస్థలను మ్యానేజ్‌ చేస్తున్నారు. 
–జన్మభూమి కమిటీలో చేస్తున్న అరాచకాలు ఇంతా అంతా కాదు. లంచం లేనిది ఏ పని జరుగడం లేదు. బియ్యంలో కూడా తినుడే, ఉపాధి పనుల్లో అవినీతి. గ్రామాల్లో పనులు దొరకడం లేదు. పందికొక్కుల్లా తింటున్నారు. ఇలాంటి దారుణమైన పాలనను సాగనంపేందుకు, రైతులకు, విద్యార్థులకు, అవ్వాతాతలకు తోడుగా ఉండేందుకు ఇవాళ 3 వేల కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగిస్తున్నాను. మీ ముద్దు బిడ్డను దీవించమని కోరుతున్నాను.
– ఇదే చంద్రబాబు ఉద్యోగాలు ఎలాగు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మనకు ఉద్యోగాలు రావాలంటే ఏకైక మార్గం ప్రత్యేక హోదానే. ఎన్నికల ముందు చంద్రబాబు 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా తెస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేక హోదాను ఆయన కేసుల కోసం తాకట్టు పెట్టారు. 
– ప్రధాని మోడీని గట్టిగా అడిగే పరిస్థితి చంద్రబాబుకు లేదు. గట్టిగా అడిగితే జైల్లో పెట్టిస్తారని భయం ఉంది. చంద్రబాబు తీరును చూసి బాధనిపిస్తుంది. ఇదే నిండు సభలో నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతున్నారు. రెండేళ్లలో రూ.15లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయట. ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా. ఇలాంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉండరేమో? ఇలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పేందుకు మీరందరు తోడుగా ఉండమని కోరుతున్నాను.
– ఇటీవల నవరత్నాలను ప్రకటించాం. ఇప్పటికే వీటి గురించి చెప్పుతున్నాను. ఇవాళ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను.
– ఇవాళ హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ పథకం చెల్లడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలను గుర్తుకు తెచ్చుకోండి. పేదవాడు అప్పులపాలు అయ్యేది రెండే విషయాల్లో ..చదువుల కోసం, ఆపరేషన్ల కోసం అప్పులపాలు అయ్యేవారు. ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతో గొప్ప పథకాలు తెచ్చారు. 
– ఆ రోజుల్లో 20 నిమిషాల్లో 108 వాహనం వచ్చేది. ఇవాళ 108కు పోన్‌ కొడితే అంబులెన్స్‌ రావడం లేదు. డీజిల్‌ లేదు, టైర్లు బాగలేవు. ఉద్యోగులు ధర్నా చేస్తున్నారన్న సమాధానం వస్తోంది. ఇవాళ ఎవరికైనా బాగలేకపోతే హైదరాబాద్‌ వెళ్లకూడదట. గుండె, మెదుడుకు సంబంధించిన ఆపరేషన్లు చేయించాలంటే హైదరాబాద్‌లో పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి. అలాంటి హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ పథకం వర్తించదట. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వడం లేదు. క్యాన్సర్‌ నయం కావాలంటే రూ.6 లక్షలు అవుతుంది. ఈ వ్యాధికి ప్రభుత్వం వైద్యం చేయించడం లేదు. కిడ్నీ పేషేంట్లు డయాలసిస్‌ చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. నెలకు రూ.24 వేలు అవుతుంది. అలాంటి పేషేంట్లకు వైద్యం అందడం లేదు. మూగ, చెవుడు వచ్చిన పిల్లలకు వైద్యం అందించడం లేదు. వారి రోదన  అరణ్య రోదనగా మారింది.
– ఆరోగ్యశ్రీని మార్పు చేస్తానని గర్వంగా చెబుతున్నాను. ఈ పథకం కింద ఏ పేదవాడికైనా కూడా వెయ్యి దాటితే ఆది ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువస్తామని, ఉచితంగా ఆపరేషన్‌ చేయిస్తానని హామీ ఇస్తున్నాను. ఆపరేషన్‌చేయించిన తరువాత విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెబితే ఆ సమయంలో కూడా పేదవాడికి డబ్బులు ఇస్తామని చెబుతున్నాను. 
– డయాలసిస్‌ చేయించుకోవాల్సిన పేషేంట్లకు నెలకు రూ.10 వేల పింఛన్‌ఇస్తాను.
– ఏడాది ఓపిక పట్టండి ఎక్కడికి వెళ్లినా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. మనరాష్ట్రంలో ఆసుపత్రులు అభివృద్ధి చెందాలంటే సమయం పడుతుంది. ఆవిధంగా చంద్రబాబు ఆలోచించడం లేదు. చంద్రబాబు కళ్లు నెత్తికి వచ్చాయి. పేదవాళ్ల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ వ్యక్తికి బుద్ధి రావాలంటే తనను ఆశీర్వదించండి.
–నవరత్నాలను ఇంకా మెరుగుగా అమలు చేసేందుకు మీరే సలహాలు, సూచనలు ఇవ్వండి. 
– మొలగవల్లి పీహెచ్‌సీ సెంటర్‌ దారుణంగా మారింది. నర్సులను తొలగిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలని, మీ అందరు తోడుగా నిలవాలని పేరు పేరున విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

కాసేప‌ట్లో చిన్న‌హుల్తిలో వైయ‌స్ జ‌గ‌న్ ముఖాముఖి

క‌ర్నూలు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలోని చిన్న‌హుల్తి గ్రామంలో ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి నిర్వ‌హించ‌నున్నారు. జ‌న‌నేత‌కు త‌మ ఇబ్బందులు చెప్పుకునేందుకు ప్ర‌జ‌లు ప‌నులు మానుకొని ఎదురుచూస్తున్నారు. 

జ‌న‌నేత‌ను క‌లిసిన నిరుద్యోగులు

క‌ర్నూలు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆస్ప‌రి మండ‌లం జూటూరు గ్రామంలో ఏఐఎస్ఎఫ్ నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో నిరుద్యోగులు క‌లిశారు. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని, ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని హామీ ఇచ్చి మాట త‌ప్పార‌న్నారు. నిరుద్యోగ భృతి అందేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి చేయాల‌న్నారు.పత్తికొండ లో బీసీ బాలికల వసతి గృహం,పాలిటేక్నిక్,ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేత. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ సానుకూలంగా స్పందించారు.

జూటూరులో జెండా ఆవిష్క‌ర‌ణ‌

క‌ర్నూలు:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జూటూరు గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. శుక్ర‌వారం ఉద‌యం  23వ రోజు ప్రారంభం కాగా అక్క‌డి నుంచి జుటూ గ్రామానికి చేరుక‌న్నారు. గ్రామంలో జ‌ననేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.

23 వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం

అశేష జనస్పందన మధ్య జరుగుతున్న ప్రజా సంకల్పయాత్ర 23 రోజు నాటి పాదయాత్ర కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది.

అలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లేకల్ నుంచి శుక్రవారం నాటి పాదయాత్రను వైయస్ జగన్ మోహన్ రెడ్డి మొదలు పెట్టారు.  జూటూర్ లో పార్టీ పతాకావిష్కరణ, చిన్నహుళ్తిలో ముఖాముఖీ, మధ్యాహ్నం పత్తికొండ ఊరు వాకిలి సెంటర్ లో బహిరంగ సభ నేటి పాదయాత్రలో ఉంటాయి.