31 October 2017

చేనేత రంగానికి చేయూత

ఉరవకొండ: చేనేత కార్మికులకు భరోసా కల్పించడానికి సంక్షోభంలో ఉన్న చేనేత రంగానికి చేయూత ఇవ్వడానికి ప్రతి పక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రగా వస్తున్నాడని పార్టీ చేనేత విభాగం జిల్లా కమీటి సభ్యులు గట్టుర్రిస్వామి, రామదొడ్డిగోపాల్‌లు తెలిపారు. స్థానిక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో చేనేతల సంక్షేమం కోసం అన్నవస్తున్నాడు అన్న నినాదంతో తయారు అయిన కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. ఈసందర్భంగా చేనేత విభాగం నాయకులు మాట్లాడుతూ.... జవసత్వాలు కోల్పోతున్న చేనేతకు జీవం పోయడానికి అధినేత జగన్‌ ఎంతో పోరాడుతున్నారని తెలిపారు. అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు 45 యేళ్లకే రూ2వేల ఫింఛన్, రూ1.50 లక్షతో చేనేతలకు ఇళ్లు, మగ్గం నిర్మించి ఇస్తామని హమీ ఇచ్చారు. దీంతో పాటు శిల్క్‌ కోనగోలు పై రూ2వేల రాయితీ, ప్రతి కార్మికుడికి రూలక్ష వరుకు వడ్డీలేని రుణం లాంటివి ఎన్నో వున్నాయన్నారు. ఈహమీల పై ప్రతి ఇంటికి కరపత్రాలు ఇచ్చి విస్త్రుతంగా ప్రచారం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుశీలమ్మ, చేనేత మండల నాయకులు నిమ్మల వెంకటరమణ, గన్నెమల్లేసి, కాసుల ఆంజినేయప్రసాద్, జడ్‌పీటీసీ తిప్పయ్య, వార్డు సభ్యులు ఈడిగప్రసాద్, లత్తవరం గోవిందు, సులోచన, రామకృష్ణ, మూలగిరిపల్లి ఓబన్న,రాజ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment