31 October 2017

నక్కజిత్తుల నిఘా

చంద్రబాబును భయం ఇంకా వీడలేదు. కొన్ని నీడలు వెంట తరుముతుంటే భయం ఎలా వీడుతుంది. తెలంగాణాలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి, ఆడియో టేప్ లలో బ్రీఫ్డ్ మీ అంటూ బుక్కైపోయిన తర్వాత తనకు వ్యతిరేకంగా ఎక్కడ ఏం జరుగుతుందో అని జడిసిపోతున్నాడు. సచివాలయంలో అడుగుకో కెమెరా, అంగుళానికో నిఘా ఏర్పాటు చేసాడు. సాధారణంగా ప్రభుత్వ  కార్యాలయాల్లో ఎంట్రన్స్ లోనూ, గదుల్లోనూ సిసి కెమెరాలుండటం సాధారణమే. కాని కారిడార్ నుంచి లాబీ దాకా, కార్యలయ కాబిన్ నుంచి క్యాంటీన్ దాకా ఎటు తిరిగినా కెమెరాలే. చివరికి ఉద్యోగులు పని చేసే కంప్యూటర్ లపై కూడా మైక్రో కెమెరాలు పెట్టించారట బాబుగారు. ఉద్యోగుల పనితీరు గమనించడానికి అని అనుకుంటే పొరపాటే. వారి దగ్గరికి ఎవరొస్తున్నారు…ఎవరెవరితో ఉద్యోగులు మాట్లాడుతున్నారు…ఇలాంటివన్నీ తెలుసుకునేందుకే ఈ ఏర్పాటు. అసలు ప్రభుత్వోద్యోగులను ఎప్పుడూ హింసించడం చంద్రబాబుకు అలవాటే అని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. బాత్రూంలో తప్ప అన్ని చోట్లా కెమెరాలు బిగించేయడం దేనికి సంకేతం అంటూ మండిపోతున్నారు. ఈ- ఆఫీస్ విధానంలో టైమ్ లిమిట్ లేకుండా పని చేస్తున్న ఉద్యోగులను ఇలా అవమానించడం, అనుమానించడం దారుణం అని అంటున్నారు. ఇంతకు ముందు డి ఎ ఇవ్వకుండా, ఇప్పుడేమో డిఎ ఇచ్చానని చెప్పి పెండింగ్ లో పెట్టి ఏడిపిస్తున్నాడని వాపోతున్నారు. మారానని బాబు చెబితే మోసపోయామని, ఉద్యోగుల పట్ల బాబు వైఖరి మారలేదని ఆవేదన చెందుతున్నారు. 

అసలు బాబుకింత భయం ఎందుకు పెరిగింది. సొంత ఆఫీసు ఉద్యోగులనే అంతలా నమ్మకపోవడానికి కారణం ఏమిటి అంటే ఓటుకు నోటు ఇష్యూనే అంటున్నారు కొందరు నేతలు. ఆ కేసులో అడ్డంగా దొరికిపోయినప్పటి నుంచి ఎవరెక్కడ తన బండారం బైట పెడతారో అని, అవినీతి పట్టించేస్తారో అని ముందు జాగ్రత్తగా అందరిమీదా నిఘా పెడుతున్నారని అంటున్నారా నేతలు. ఓటుకు నోటు కేసులో కిందా మీదా పడి స్టే అయితే తెచ్చుకున్నాడు కాని, తెలంగాణాలో టిడిపి కాస్తా భూస్థాపితం అయిపోయింది. అక్కడున్న ఏకైక నేత రేవంత్ రెడ్డి కాస్తా ఎదురు తిరిగాడు. చంద్రబాబు వల్ల తన పొలిటకల్ కెరీర్ గంగపాలైందని చివరి మాట అనడమొక్కటే తక్కువ. పార్టీనీ, నేతలను నోటికొచ్చినట్టు తిట్టి చక్కాపోయాడు రేవంత్ రెడ్డి. క్రమశిక్షణకి కేరాఫ్ అడ్రస్ నేను అని చెప్పుకునే బాబు, రేవంత్ ని ఒక్కమాట కూడా అనలేకపోయాడు. ఓటు కు నోటు విషయంలో రేవంత్ నోరు మెదిపితే ఏమౌతుందో బాబుకు బాగా తెలుసు. అందుకే రేవంత్ రెడ్డిని బుజ్జగించుకుంటూ సాగనంపారు. ఈ భయంతో కెమెరాలు ఇంకెక్కడెక్కడ పెట్టారో అని బాత్రూంకి వెళడానికి కూడా భయపడుతున్నారట సెక్రెటేరియట్ ఉద్యోగులు. 

No comments:

Post a Comment