5 October 2016

చంద్రబాబు కు వైయస్ జగన్ సూటి పశ్న

  • ఒక్క ఎకరా కూడా ఎండనివ్వనని బీరాలు పలికాడు
  • జిల్లాలో కరువు ఉందా అంటూ ఎగతాళి చేశాడు
  • నాలుగు రోజుల్లోనే కరువును తరిమికొట్టానంటూ పచ్చి అబద్ధాలు
  • ఇలాంటి ముఖ్యమంత్రిని చంద్రబాబునే చూస్తున్నాం
  • రైతు మహాధర్నాలో బాబుపై ధ్వజమెత్తిన వైయస్ జగన్

అనంతపురంః రైతులు కరువుతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ కోసం పాకులాడటం సిగ్గుచేటని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. కరువు ప్రాంతాలను కూడా హెలికాఫ్టర్‌లో ఏరియల్‌ సర్వే ద్వారా సమీక్షించే ముఖ్యమంత్రిని చంద్రబాబునే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహా ధర్నాకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ ధర్నాలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. 



ముఖ్యమంత్రి కరువే లేదన్నాడు...
అనంతరపురం జిల్లాను ఆగస్టు 6, 8, 28 తేదీల్లో సందర్శించిన మూడుసార్లు సందర్శించిన ముఖ్యమంత్రి జిల్లాలో ఒక్క ఎకరాన్ని కూడా ఎండిపోనివ్వనని బీరాలు పలికారన్నారు. ఆగస్టు 28న పుట్టపర్తికి వచ్చిన బాబు జిల్లాలో కరువుందా అని వ్యంగ్యంగా మాట్లాడి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే నాలుగు రోజుల తర్వాత సెప్టెంబర్‌ 1న కరువును తరిమికొట్టానని పేర్కొనడం చేస్తుంటే అంతా అయోమయంగా ఉందన్నారు. కరువే లేదన్న ముఖ్యమంత్రి నాలుగు రోజుల్లో కనిపించిందా అని ఎద్దేవా చేశారు. వ్యవసాయ మంత్రి మాట్లాడుతూ కరువే లేదని సెలవిస్తే మరో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కరువును పారదోలేందుకు సమీక్ష నిర్వహిస్తారని చెప్పడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. రాష్ట్ర తాజా పరిస్థితులపై మీలోనే ఇన్ని బేదాభిప్రాయాలున్నప్పుడు ప్రజలను ఎలా ఆదుకుంటారని ప్రశ్నించారు. 

15 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది...
రెయిన్‌ గన్‌లతో నాలుగు రోజుల్లో కరువును తరిమికొట్టానని సీఎం చంద్రబాబు చంకలు గుద్దుకోవడంపై వైయస్‌ జగన్‌ తీవ్రంగా స్పందించారు. రాయలసీమ జిల్లాల్లో 21 లక్షల ఎకరాలకు గాను దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని తెలిపారు. రెయిన్‌ గన్‌లను ఈయనే కొత్తగా కనిపెట్టినట్టు ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. రెయిన్‌గన్లు, డ్రిఫ్ట్‌లు, స్ప్రింకర్లు దాదాపు పదిహేనేళ్ల నుంచే వాడుకలో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి హడావుడి చేసి దానేదో అపర బ్రహ్మలా మాట్లాడటం సరికాదన్నారు. వాస్తవ పరిస్థితులను చూసి తెలుసుకోవాలన్నారు. కరువు పరిస్థితులను తెలుసుకోవాలంటే హెలికాఫ్టర్‌లో తిరిగితే తెలియదని, వరదలు వచ్చిన సందర్భాల్లోనే హెలికాఫ్టర్లు వాడటం చూస్తాంగానీ మన ముఖ్యమంత్రి మాత్రం వరదలొచ్చినప్పుడూ గాల్లో తిరుగుతుంటారని ఎద్దేవా చేశారు. కంప్యూటర్లు తానే కనిపెట్టానని డబ్బాలు కొట్టుకుంటూ... ప్రతీదీ ఇంటర్నెట్‌లో వెతికే  ముఖ్యమంత్రికి రాష్ట్రంలో కరువుందని మీ కంప్యూటర్లు చెప్పలేదా అని ప్రశ్నించారు. 

రోజుకు 25 లక్షల ట్యాంకర్లు ఎక్కడ్నుంచి తెచ్చారు..
నాలుగు రోజుల్లో కరువును తరిమేసిన ముఖ్యమంత్రీ 30 లక్షల ట్యాంకర్లు ఎక్కడ్నుంచి తెచ్చారని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రెయిన్‌గన్‌ల పనితీరు సామర్థ్యం.. వాటికి అవసరమయ్యే నీటిని వివరాత్మకంగా ట్యాంకర్లతో లెక్కించి బాబు మాయను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఒక ఎకరా పంటను తడిపేందుకు కనీసం 5 ఎంఎం వర్షపాతం కావాలని.. అంటే దానికి 25వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్లు అవసరమవుతాయని జగన్‌ వెల్లడించారు. మన దగ్గర ఉండేవి 5 లô దా 6 వేల లీటర్ల ట్యాంకర్లు కాబట్టి కనీసం ఐదు ట్యాంకర్లు అవవసరం కావొచ్చిని తెలిపారు. అంటే ఎకరాకి దాదాపు 25 ట్యాంకర్లు వినియోగిచాల్సి వస్తుందన్నారు. అలాంటిది లక్ష ఎకరాలను తడపాలంటే కనీసం 25 లక్షల ట్యాంకర్లు అవసరం కావొచ్చని అన్ని ట్యాంకర్లు పక్క రాష్ట్రాలు తిరిగినా దొరకవన్నారు. అలాంటిది నాలుగు రోజుల్లో రోజుకు లక్ష ఎకరాల వంతున 25 లక్షల ట్యాంకర్లతో నాలుగు రోజులకు లక్షల ట్యాంకర్లు ఎక్కడ్నుంచి తెచ్చారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.  

పదును రావాలంటే కనీసం 28 ఎంఎం వర్షపాతం కావాలి
బాబు చెప్పిన దాని ప్రకారం చూసుకుంన్నా ఎకరాకి 5 ఎంఎం తడి ఎట్టిపరిస్థితుల్లోనూ సరిపోదన్నారు. పంట సక్రమంగా పండాలంటే..  పదును రావాలంటే కనీసం 28 ఎంఎం వర్షపాతం అవసరం అవుతుందని 5ఎంఎంతో పంటలను ఎలా బతికిద్దామనుకన్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా బూటకపు మాటలతో ప్రజలను మాయం చేయడం ఆపాలని సూచించారు. 

టీడీపీ మాజీ సర్పంచ్‌ పంట ఎండిపోయింది...
మీరే స్వయంగా రెయిన్‌ గన్‌లతో తడి చేసిన మీ మాజీ సర్పంచ్‌ పొలం ఎండిపోయిందని ఈ సందర్భంగా జగన్‌ ఫొటోలు చూపెట్టి బాబుకు హితబోధ చేశారు. రాయచోటిలోని మాధవరం టీడీపీ మాజీ సర్పంచ్‌కు చెందిన పొలంలో చంద్రబాబు రెయిన్‌గన్‌లతో నీరు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా అదిప్పుడు ఎండిపోయిందని అలాంటిది నాలుగు లక్షల ఎకరాల సంగతి ఎలా ఉంటుందో తెలిసిపోతుందన్నారు. తాను రోడ్డు మార్గంలో జిల్లాకు వచ్చేటప్పుడు చూడగా పొలాలన్నీ ఎండిపోయి బీళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించాలి తప్ప మాటలు చెప్పి కడుపులు నింపాలనుకోవడం సరికాదన్నారు. ఆనాడు దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి కరువు పరిస్థితుల్లో రాష్ట్రానికి చేసిన మేళ్లు ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ప్రస్తావించారు. 

No comments:

Post a Comment