21 September 2016

వైయస్‌ఆర్‌ సీపీపై బాబు కుట్రలు చేస్తున్నారు

  • తుని ఘటనను అంటగట్టాలని చూస్తున్నారు
  • పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యహరిస్తున్నారు
  • ఇది ప్రజాస్వామ్యమా లేక పాకిస్తానా..?
  • వైయస్‌ఆర్‌ సీపీ నేతలు అంబటి, చెవిరెడ్డి

గుంటూరు: తుని ఘటనలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని భాగస్వామిగా చేయాలని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ కుట్రలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ధ్వజమెత్తారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు ప్రతిపక్షంపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారని , తుని ఘటనతో ఏసంబంధం లేకున్నా వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌రెడ్డిలకు అంటగట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుట్రలకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. గోప్యంగా జరిగే సీఐడీ విచారణను కొన్ని పత్రికలు క్షుణ్ణంగా రాస్తున్నాయని, బల్లకింద ఏమైనా పత్రిక యజమానులు దాక్కున్నారో అర్ధం కావడం లేదన్నారు. 

ఒక పత్రిక బాహటంగా రాస్తుందంటే చంద్రబాబు ఆదేశాల మేరకు విచారణ జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సహకరించకపోతే ఆ పత్రికలను ఇప్పటికే పశ్నించేవారని అన్నారు.  నేరం  చేయని వ్యక్తిని రెండు రోజులు 16 గంటల పాటు విచారంచి మళ్లీ విచారణకు పిలిచారంటే గుడ్డివాడు నల్లపిల్లి కోసం చీకటి గదిలో వెతినట్లేనని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యమా లేక పాకిస్తానా అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేస్తారా అని చంద్రబాబు సర్కార్‌ను ప్రశ్నించారు. పోలీస్‌ వ్యవస్థ కూడా టీడీపీకి కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్యాయంగా, అక్రమంగా తప్పుడు కేసులు పెడితే ప్రజలతో కలిసి వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంపై తిరగబడుతుందని హెచ్చరించారు. 

No comments:

Post a Comment