27 September 2016

అన్నదాతకు అండగా వైయస్ జగన్

  • వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన
  • నీటమునిగిన పంటల పరిశీలన

గుంటూరుః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ రెండో రోజు వరద ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తూ, నిరాశ్రయులైన బాధితులను పరామర్శిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. కాసేపటి క్రితమే వైయస్ జగన్ అనుపాలెం గ్రామానికి చేరుకొని నీటమునిగిన పంటలను పరిశీలించారు. అదేసమయంలో కొండమోడు వాగును పరిశీలించారు.  రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 

చంద్రబాబు రుణాలు మాఫీ చేయకపోవడంతో బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి మరీ పంటలు వేసిన రైతులకు కన్నీరే మిగిలింది. భారీ వర్షాల కారణంగా చేతికొచ్చిన పంటలు వరద నీట మునగడంతో అన్నదాతకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈసందర్భంగా రైతులకు తోడుగా నిలిచేందుకు వైయస్ జగన్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇంతవరకు అధికారులు గానీ, పాలకులు గానీ ఎవరూ తమ వద్దకు రాలేదని రైతులు వైయస్ జగన్ వద్ద వాపోయారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని వారికి భరోసానిచ్చారు. 

No comments:

Post a Comment