29 September 2016

నారా చంద్రబాబు కాదు.. నయీం చంద్రబాబు

  • నదులు కాదు..అవినీతి అనుసంధానం
  • టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ ఎల్లో ట్యాక్సు పై సీఎం స్పందించాలి

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నయీం చంద్రబాబు నాయుడుగా వైయస్సార్సీపీ సీనియర్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రతీచోట తన మనుషుల్ని పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.   చంద్రబాబు నదుల అనుసంధానం పేరుతో అవినీతిని అనుసంధానం చేశారని మండిపడ్డారు. ఆయన నారా చంద్రబాబు కాదని, నయీం చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.   రాష్ట్రంలోని ప్రతి పథకంలోనూ అవినీతి, ఎల్లో ట్యాక్స్‌లు అధికమయ్యాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రే స్వయంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

వెంకటగిరి ఎమ్మెల్యే వ్యవహారమే ఉదాహరణ
తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరకడమే అందుకు ఒక ఉదాహరణ అని ఆయన చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే ఏమీ మాట్లాడకపోవడంతోనే ఏం జరిగిందో అందరికీ తెలిసిందని చెప్పారు. ప్రతి అభివృద్ధి పనిలోను చంద్రబాబుకు వాటాలు ముడుతున్నాయని, అందుకే ఎమ్మెల్యేలు ఏం చేసినా పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు రామకృష్ణ అవినీతి వెలుగులోకి రావడంతో టీడీపీ నేతలు బెల్లం కొట్టిన రాయిలా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రామానికో నయీం తయారయ్యాడని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ రైల్వే కాంట్రాక్టరును బెదిరించిన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
జనాలను మేనేజ్‌ చేయలేవు
అవినీతితో సంపాదించిన డబ్బుతో ఏపీ సీఎం చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేయగలరేమో గాని జనాలను మేనేజ్‌ చేసే సత్తా ఆయనకు లేదని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కోటి ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో జలయజ్ఞం చేపడితే..నాడు ధనయజ్ఞమని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు మహానేత చేపట్టి ప్రాజెక్టులకు మూడొంతు చొప్పున అంచనాలు పెంచి ప్రజా సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. ఐదు కోట్ల ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను చంద్రబాబు పోలవరం కాంట్రాక్ట్‌ కోసం తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతికి ప్రోత్సాహం
 అన్నా హజారే శిష్యుడ్ని అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కరువును పారద్రోలుతామని పగల్బాలు పలికిన సీఎం రూ.350 కోట్లు ఖర్చు చేసి రెయిన్‌గన్లు కొని కనీసం పది వేల ఎకరాలు కూడా తడప లేదని విమర్శించారు. డబ్బులు సంపాదించడం, వ్యవస్థలను మేనేజ్‌ చేయడం బాబుకు అలవాటైందని దుయ్యబట్టారు. వైయస్‌ఆర్‌సీపీలో ఉంటే ఎమ్మెల్యేలపై కేసులు పెడతారని, అదే ఎమ్మెల్యే టీడీపీలో చేరితే కేసులు ఎత్తివేస్తున్నారని ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి మంచిది కాదని హితవు పలికారు. కేంద్రం నిధులతో చేపట్టే ప్రతి పనిలోనూ టీడీపీ నేతలు కమీషన్లు పొందుతూ అభివృద్ధికి అంతరాయం కలిగిస్తున్నారని, గ్రామ, నియోజకవర్గ, రాష్ట్రస్థాయి వరకు టీడీపీ నేతల అవినీతి విస్తరించిందని మండిపడ్డారు. అవినీతిని కట్టడి చేయకపోతే టీడీపీ నేతల అరాచకాలు పెట్రేగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు వీటన్నింటిని గమనిస్తున్నారని, అధికార పార్టీ నేతలకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గడికోట శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.

No comments:

Post a Comment