9 August 2016

బాబు నిరంకుశ విధానాలపై మండిపాటు

  • విగ్రహాల తొలగింపుపై వైయస్సార్సీపీ నేతల ఫైర్
  • గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
  • క్విట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి పిలుపు

విజయవాడః ఏపీ నుంచి చంద్రబాబును తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని వైయస్సార్సీపీ నేతలు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. విగ్రహాలు, ఆలయాలు, నాయకులు ఇలా అందరిపైనా అసహనం ప్రదర్శిస్తూ చంద్రబాబు దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించిన ప్రదేశాన్ని పార్టీనేతలు పెద్దిరెడ్డితోపాటు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, జోగి రమేష్ తదితర నేతలు పరిశీలించారు. కొత్తగా ప్రతిష్టించిన మహాత్మ గాంధీజి విగ్రహానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈసందర్భంగా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...మహాత్మాగాంధీ విగ్రహాన్ని టీడీపీ ప్రభుత్వం కుట్ర ప్రకారం తొలగించిందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు నిరసనగా క్విట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... క్విట్ చంద్రబాబు సేవ్ ఏపీ అని ప్రతి ఒక్కరు నినదించాలన్నారు. అమానవీయంగా విగ్రహాన్ని తొలగించడం పట్ల చంద్రబాబు క్షమాపణలు చెప్పి... జిల్లా స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
 
పార్థసారథి మాట్లాడుతూ....ప్రజలకు ఆటంకంగా లేకున్నా చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగా విగ్రహాలు కూల్చేయిస్తున్నారని మండిపడ్డారు. మొన్న మహానేత వైయస్సార్, ఇవాళ జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఇలా ప్రతీ ఒక్కరి విగ్రహాలను కూల్చేస్తూ బాబు అసహనం వెళ్లగక్కుతున్నారని ఫైర్ అయ్యారు. విగ్రహాన్ని తొలగించగలరేమో గానీ ప్రజల గుండెల్లోంచి వారిని తొలగించలేరన్నారు. రాష్ట్ర రాజధానిని విదేశీయులకు తాకట్టు పెడుతున్న బాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. 
 

No comments:

Post a Comment