5 August 2016

బాబుకు కేసుల భయం

నెల్లూరుః ఏపీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్రత్యేకహోదా కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ఉద్యమిస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి మాట తప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాలను ఎండగడుతున్నారు. అదే సమయంలో ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి యువభేరి కార్యక్రమాల ద్వారా యువతను చైతన్యపరుస్తున్నారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, దాన్ని సాధిచేవరకు విశ్రమించే ప్రసక్తే లేదని నెల్లూరు యువభేరి కార్యక్రమం ద్వారా వైయస్ జగన్ మరోసారి తేల్చిచెప్పారు. ఈసందర్భంగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. 


విద్యార్థులతో వైయస్ జగన్ సంభాషణ

సంతోష్‌వ‌ర్మ స్టాప్‌వేర్ ఇంజ‌నీర్ (చెన్నై)....ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఉద్యోగం ఇస్తామ‌న్నారు... లేక‌పోతే నెలకు రూ. 2వేలు నిరుద్యోగ‌భృతి ఇస్తామ‌న్నారు...  రెండున్న‌ర సంవ‌త్స‌రాలు అవుతుంది... ఇప్ప‌టికీ నిరుద్యోగులకు ఏమీ లేదు.. ఇలా మోసం చేస్తే ఎలా..?  మాతో ఎన్నిక‌ల్లో ఓట్లు వేయించుకున్న ముఖ్య‌మంత్రిని ఏం చేయాలి సార్‌...
వైయ‌స్ జ‌గ‌న్‌..... స‌్థానికంగా నెల్లూరు అయినా చెన్నైకి వెళ్లి ఉద్యోగం చేయాల్సిన ప‌రిస్థితి దారుణం. అధికారంలోకి వ‌స్తే ఉద్యోగం... లేక‌పోతే నిరుద్యోగ‌భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన చంద్ర‌బాబు... ఇప్ప‌టికైనా స్పందించి ప్ర‌త్యేక హోదా కోసం  పోరాడాలి. అప్పుడైనా బాబుకు జ్ఞాన‌దోయం అవుతుంది. ప్ర‌జ‌ల‌ను మోసం చేసే వారికి దేవుడు త‌ప్ప‌కుండా బుద్ధి చెబుతాడు. ఏపీలో పుట్టిన ప్ర‌తిఒక్క‌రూ చంద్ర‌బాబుకు బుద్ధి చెప్పే అవ‌కాశం త్వ‌ర‌లోనే ఉంది. 

సంతోష్‌ వర్మ మళ్లీ మాట్లాడుతూ:  ప్ర‌తిప‌క్షంలో ఉండి  యువ‌భేరిల‌ను నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌ను, యువ‌త‌ను ఎంతో చైత‌న్య‌వంతులు చేస్తున్న జ‌గ‌న్ అన్న నీకు స‌లాం.. టీడీపీ తెలుగుదేశం పార్టీ కాదు... తెలుగుదొంగ‌ల పార్టీ... వైయ‌స్సార్‌సీపీ యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా మా జీవితాంతం గుర్తుంటుంది. 

కీర్తికుమార్‌, బీటెక్ విద్యార్థి (ప్రైవేట్ ఉద్యోగి).... చంద్రబాబు విదేశీ ప్రయాణాల కోసం ప్ర‌త్యేక విమానాలకు వంద‌ల కోట్ల కుమ్మరిస్తున్నారు క‌దా... ఏపీకి ఏమైనా పెట్టుబ‌డులు వ‌చ్చాయా..?
వైయ‌స్ జ‌గ‌న్‌.... బాబు ఏం చేసినా ప్ర‌త్యేక విమానాల్లోనే.  ప్ర‌త్యేక విమానాలకు పెట్టే ఖ‌ర్చులో నాలుగు వంతు ఏపీకి వినియోగించినా అభివృద్ధి జ‌రుగుతుంది. ప్రత్యేక హోదా వ‌స్తే బాబు ఎక్క‌డికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు.. అక్కడి వాళ్లే వచ్చి ఇక్కడ పెట్టుబ‌డులు పెడ‌తారు.

గిరినందిని(డిగ్రీ ఫైనల్ ఇయర్).... ప్ర‌త్యేక హోదా వ‌ల్ల విద్యార్థుల‌కు ఎలాంటి లాభాలు ఉన్నాయి సార్..?
వైయ‌స్ జ‌గ‌న్‌..... ప‌్రత్యేక ఉన్న రాష్ట్రాల‌్లో పారిశ్రామిక వేత్త‌లు ప‌రిశ్ర‌మ‌లు పెట్టే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయి. 100 శాతం ఇన్ మ‌క్ ట్యాక్స్ క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. దేశంలో 29 రాష్ట్రాలుంటే కేవ‌లం ఒక్క 11 రాష్ట్రాల‌కు మాత్ర‌మే ఈ అవ‌కాశం వచ్చింది. క‌రెంట్ 50 శాతం రాయితీ లభిస్తుంది. అప్పుడు ఇతర దేశాల పారిశ్రామికవేత్తలు కూడా మన రాష్ట్రంలో కంపెనీలు స్థాపిస్తారు.. అందువ‌ల్ల వారికి లాభాలు వస్తాయి... ఏపీలో నిరుద్యోగం పోతుంది. మోసం చేస్తున్న వారిని ప్ర‌శ్నించిన‌ప్పుడే ఈ వ్య‌వ‌స్థ మారుతుంది.

సంధ్య‌(డిగ్రీ ఫైనల్ ఇయర్)....ప్ర‌త్యేక హోదా కోసం మీరు ఎందుకు ఇంత‌గా పోరాడుతున్నారు సార్... బాబు ఎందుకు పోరాడ‌టం లేదు..?
వైయ‌స్ జ‌గ‌న్‌.. మ‌న క‌ర్మ ఏమిటంటే త‌ల్లి... ఇంత‌కు ముందు నేను ఉదాహ‌ర‌ణగా చెప్పా. చంద్ర‌బాబు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి.  పోరాటం చేయాల్సిన ప‌రిస్థితిలో ఉండి రాష్ట్రానికి సంబంధించిన హోదా హ‌క్కును వ‌దిలేస్తున్న తీరు చూస్తే బాధ క‌లుగుతుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాబు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు సూట్‌కేస్‌ల నిండా బ్లాక్‌మ‌నీ పంపించేశారు. దీంతో వారు ఆడియో , వీడియో టెపుల్లో బిగించేశారు. ఎప్పుడైతే చంద్ర‌బాబు అడ్డంగా దొరికిపోయారో... అప్పుడు భ‌యం ప‌ట్టుకుంది. చంద్ర‌బాబు మోడీని గ‌ట్టిగా నిల‌దీస్తే, ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్ప‌గిస్తారు. సీఎంకు ఇంత బ్లాక్‌మ‌నీ ఎక్క‌డి నుంచి వ‌చ్చిందన్నది బయటపడుతుంది...? ఒక ముఖ్య‌మంత్రి సాక్ష‌ాధారాల‌తో దొరికిపోవ‌డం దేశ చ‌రిత్ర‌లో ఇదే మొట్ట‌మొద‌టిసారి. రాష్ట్రంలో రూ. ల‌క్షా 45వేల కోట్ల కుంభ‌కోణాలు జ‌రిగాయి. మట్టి నుంచి మద్యం దాకా అంతా అవినీతే. ఈ స్కాంల‌న్నీ బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చంద్ర‌బాబు త‌న‌ను తాను కాపాడుకోవ‌డం కోసం రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు.

స‌హ‌న‌(డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం)... స‌మైక్యాంధ్ర కోసం ఎంత‌గానో పోరాటాలు చేశాం... అప్పుడు స‌మైఖ్యాంధ్ర రాలేదు... ఇప్పుడు ప్ర‌త్యేక హోదా వ‌స్తుందా సార్..?
వైయ‌స్ జ‌గ‌న్‌... మ‌నం వ‌దిలేస్తే ఏది రాదు తల్లీ... మనవాళ్లు స్వాతంత్ర్యం కోసం దాదాపు వందేళ్లు పోరాటం చేశారు.. ఆనాడు ఆ పోరాటం వ‌దిలేసి ఉంటే ఈ రోజు స్వాతంత్ర్యం వ‌చ్చేదీ కాదు.. బ్రిటీష్‌వారు ప‌రిపాల‌న చేస్తుండేవారు. ఇది మా హక్కు అని పోరాటం చేస్తేనే అప్పుడు వారు మ‌ర్చిపోకుండా ఉంటారు.. ఈ రోజు కాక‌పోతే రేపైనా దొరుకుతుంది. దేవుడు ద‌య‌త‌లుస్తాడు... కచ్చితంగా వ‌స్తుంది. ఆ రోజు మ‌నల్ని మోసం చేసిన వారిని బంగాళా ఖాతంలో క‌లిపే ప‌రిస్థితి వ‌స్తుంది. పోరాటాన్ని మ‌నం వ‌దిలేస్తే దీనిని ఎవ్వ‌రు ప‌ట్టించుకోరు.

స‌హ‌న‌:  2013లో మేము పోరాడే స‌మ‌యంలో మాకు ఎవ్వ‌రు మ‌ద్దతు ఇవ్వ‌లేదు... ఇప్పుడు ప్ర‌త్యేక హోదా కోసం మీరు మ‌ద్ద‌తిస్తున్నారు. చాలా థాంక్స్ సార్‌....

వంశీకృప నిద‌ర్శ‌న్ (ఐఐటీటీఎం కాలేజీ, బీబీఏ మొద‌టి సంవ‌త్స‌రం)...చిన్న‌ప్ప‌టి నుంచి నాకు రీయంబ‌ర్స్‌మెంట్ వ‌చ్చేది... కానీ ఇప్పుడు ఆ రీయంబర్స్‌మెంట్ ఏమ‌వుతున్నాయి. ఎక్క‌డి వెళ్తున్నాయి... ఎవ‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్తున్నాయి. బాబు పిల్లలపై ఎందుక‌ు దుష్ట రాజ‌కీయాలు  ప్రయోగిస్తున్నారు. వైయ‌స్సార్‌సీపీ 2019లో  అధికారంలోకి వ‌స్తే మీ ప్ర‌ణాళిక ఏంటి? మ్యానిఫెస్టోలో ఏం పెడ‌తారు? మీరు మా త‌ర‌ఫున 2019లో రీయంబ‌ర్స్‌మెంట్ కోసం ఏం చేస్తారు?
వైయ‌స్ జ‌గ‌న్‌.... వ‌ంశీ,  ఫీజురియంబ్స్‌మెంట్ అనే ప‌థకం దివంగ‌త మ‌హ‌నేత ప్రియ‌త‌మ నాయ‌కుడు వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు ప్రవేశ‌పెట్టారు. ప్ర‌తి పేద‌వాడు చ‌ద‌వాలి, చ‌దువు కోసం డ‌బ్బులు లేనిత‌నం అడ్డుగా ఉండ‌కూడ‌దు. డ‌బ్బులు లేకున్నా ప్ర‌తీ పేద‌వాడికి చ‌దువుకునే ప‌రిస్థితి రావాల‌ని వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ అనే స్వ‌ప్నంను ముందుకు తెచ్చారు.
*మెడిసిన్ చ‌ద‌వాలంటే సంవ‌త్స‌రానికి రూ. 50 వేలు, ఇంజ‌నీరింగ్ చ‌ద‌వాలంటే సంవ‌త్స‌రానికి రూ. 30 క‌ట్టాల్సి వ‌స్తుంది
* వైయ‌స్సార్ అన్ని ప్రైవేట్ క‌ళాశాల‌లో ఫీజులు రూ. 30వేలు దాట‌కూడ‌ద‌న్న నిబంధ‌న పెట్టారు. 
* ఫీజులు పెంచే అవ‌కాశం లేకుండా చేసి... ప్ర‌తి పేద‌వాడి చ‌దువుకు అయ్యే ఖ‌ర్చుల‌ను రాజ‌న్న ప్ర‌భుత్వం క‌ళాశాల‌ల‌కు డ‌బ్బులు చెల్లించింది.
* ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ ద్వారా కాలేజీలు, విద్యార్థులు బాగుప‌డి మెరుగైన చ‌దువులు చ‌దివారు. 
* ఆ మ‌హానేత మ‌ర‌ణం త‌రువాత ఫీజు రియంబర్స్‌మెంట్ అనే ప‌థ‌కాన్ని నీరు గార్చేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 
* చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఒక‌వైపు ప్రైవేట్ క‌ళాశాల‌లు ఫీజులు పెంచుకునేందుకు అవ‌కాశం ఇచ్చారు.
* ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచ‌లేదు. దీన్ని ఫ‌లితంగా చ‌దువులు ఆగిపోయే ప‌రిస్థితి నెల‌కొంది. 
* చంద్ర‌బాబు ప్ర‌భుత్వం 2015-16కు ఫీజు రియంబ‌ర్స్‌మెంట్‌ ఇంకా 50 శాతం చెల్లించాల్సి ఉంది. 
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మాత్రం ప‌రిపాల‌న ఇలా ఉండ‌దు వంశీ. 
* ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కంలో ఒక రెవ‌ల్యుూష‌న్ తీసుకొస్తాం. 
* ఏ పేద‌వాడైనా త‌న‌కు న‌చ్చిన చ‌దువును అప్పు చేయ‌కుండా నేను తోడుగా ఉండి చ‌దివిస్తా...
* చంద్ర‌బాబులాగా నేను ఇంత ఇస్తా మిగిలింది మీరు చూసుకొండి అని చెప్ప‌ను..
* పూర్తి ఫీజురియంబ‌ర్స్‌మెంట్‌తో పాటు మెస్‌, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ చార్జీలు సైతం ఇపిస్తా. 
* ఫీజురియంబ‌ర్స్‌మెంట్‌, ఆరోగ్య‌శ్రీ‌ని చంద్ర‌బాబు గాలికి వ‌దిలేశారు. 

హేమ‌ప్రియ (డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం).. ప్ర‌త్యేక హోదా కోసం ఎంతో పోరాటం చేస్తున్నా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేదు... మీపైనే మా న‌మ్మ‌కం... మీరు ఏం చేస్తారు
వైయ‌స్ జ‌గ‌న్‌:  గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేస్తాను... ఇది నా ఒక్క‌డితో అయ్యేదీ కాదు.. నాతో పాటు మీరంద‌రూ క‌లిసిక‌ట్టుగా అడుగులో అడుగు వేస్తేనే ప్ర‌త్యేక హోదా సాధ్య‌మ‌వుతుంది. కచ్చితంగా వారిపై మ‌రింత ఒత్తిడి పెంచుదాం... రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక హోదా ఎవ‌రైతే ఇస్తారో... వారికే మ‌ద్ద‌తు తెలుపుతాం అన్న స్థాయి వ‌ర‌కూ పోరాటం చేస్తాం. ప్ర‌త్యేక హోదా సాధించుకునే హ‌క్కు దేవుడు ఏదో ఒక రోజు కచ్చితంగా ఇస్తాడు. 

వినీల్ (నారాయ‌ణ కళాశాల‌)... యువ‌భేరికి వెళ్లొద్ద‌ని మా నారాయణ సంస్థ చెప్పింది. నారాయ‌ణ‌కు హోదా రావ‌డం ఇష్టం లేదా..? 

వైయస్ జగన్.... ప్ర‌త్యేక హోదా కోసం అడ్డుప‌డుతున్న వ్య‌క్తి చంద్ర‌బాబు.... మొన్న జ‌రిగిన బంద్‌ను విఫ‌లం చేయ‌డానికి సీఎం ప్ర‌య‌త్నించారు. అయినా బంద్ దిగ్విజ‌యంగా జ‌రిగింది అంటే ప్ర‌త్యేక హోదా ప్ర‌జ‌ల అభిలాష‌. ఒక‌వైపు చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదాను నీరుగార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు... ఆయన క్యాబినెట్‌లో నారాయ‌ణ మంత్రి కాబ‌ట్టి ప్ర‌త్యేక హోదా వ‌స్తే ఆయ‌నకు పోటీగా కాలేజీలు క‌డ‌తారేమోన‌న్న భ‌యం.

No comments:

Post a Comment