26 August 2016

వ‌ర్షాకాల స‌మావేశాల‌ను ఐదు రోజులే నిర్వ‌హించ‌డం దారుణం

  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు కాలేదు
  • రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
  • స‌మావేశాల‌ను నాలుగు వారాల పాటు నిర్వ‌హించాలి
శాస‌న‌మండ‌లిలో వైయ‌స్సార్‌సీపీ ప‌క్ష నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు
హైద‌రాబాద్‌ః  రాష్ట్రానికి సంబంధించిన అనేక స‌మ‌స్య‌లను చ‌ర్చించాల్సి ఉండ‌గా, ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను కేవలం ఐదురోజులు మాత్రమే నిర్వహించాలనుకోవడం సరైంది కాద‌ని శాసనమండలిలో వైయ‌స్సార్‌సీపీ ప‌క్ష నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు  అన్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాలి త‌ప్ప తూతూ మంత్రంగా కాద‌ని చంద్ర‌బాబుకు హిత‌బోద చేశారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ... ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితిలో ఉంద‌న్నారు. రైతుల‌కు రుణ‌మాఫీ కాక‌పోవ‌డంతో అటు బ్యాంకుల‌కు రుణాలు చెల్లించ‌లేక ఇటు పంట‌ల‌ను సాగు చేసేందుకు డ‌బ్బులు లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని ఆయ‌న వెల్లడించారు.

మ‌రిన్ని విష‌యాలు ఆయ‌న మాట‌ల్లోనే..
- రాష్ట్రంలో వ‌ర్షాభావ ప‌రిస్థితులు ఉన్నాయి. అన్ని వ‌ర్గాల్లో తీవ్ర‌స్థాయిలో స‌మ‌స్య‌లు ఉన్నాయి.
- రాష్ట్రంలో 40.95ల‌క్ష‌ల హెక్టార్ల‌లో పంట‌లు సాగు కావాల్సి ఉండ‌గా... ఇప్ప‌టి వ‌ర‌కు అందులో 30శాతం కూడా సాగు కాలేదు
- రాష్ట్ర ప్ర‌భుత్వం రుణమాఫీని అమ‌లు చేయ‌కపోవ‌డంతో రైతులు బ్యాంకులకు రుణాలు క‌ట్ట‌లేక నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.
- వ‌ర్షాకాల స‌మావేశాల‌ను కనీసం 3 నుంచి 4 వారాల పాటు నిర్వ‌హించాలి
-  ప్ర‌త్యేక హోదా, స్విస్ ఛాలెంజ్, రాజ‌ధానిలో అక్ర‌మ భూ కేటాయింపులు, సుమారు 500 సంక్షేమ వ‌స‌తి గృహాల తొల‌గింపు వంటి ఎన్నో ముఖ్య‌మైన స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల్సి ఉంది. ఇందుకు కేవ‌లం ఐదు రోజులు స‌రిపోవు
- టీడీపీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు అవుతున్నా బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ఒక్క ప‌క్కాగృహం కూడా నిర్మించ‌లేక‌పోయింది
- గోదావ‌రి పుష్క‌రాల్లో జ‌రిగిన ప్రాణాన‌ష్టంపై నియ‌మించిన సోమ‌యాజుల క‌మిటీ ఇప్ప‌టికీ ఎటువంటి నివేదిక‌ను స‌మ‌ర్పించ‌లేక‌పోయింది
- కృష్ణా పుష్క‌రాల్లో ఎక్క‌డ ఆధ్యాత్మికం క‌నిపించ‌లేదు. కేవ‌లం టీడీపీ పార్టీ కార్య‌క్ర‌మంగా నిర్వ‌హించారు.
- జీఎస్‌టి బిల్లుపై ఆమోదం తెలియ‌జేస్తే స‌రిపోతుంద‌నే విధానం స‌రైంది కాదు
- రాష్ట్రంలో అనేక దేవాల‌యాలు, చ‌ర్చిలు, మ‌సీదులు, గాంధీ విగ్ర‌హం, మ‌హానేత వైయ‌స్సార్ విగ్ర‌హాల‌ను కూల్చ‌డం దారుణం
- ఇంత‌టి రాక్ష‌స పాల‌న ఏ రాష్ట్రంలో కూడా లేదు
- స‌దావ‌ర్తి భూముల వేలంపై భారీ కుంభ‌కోణం జరిగిన విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు
-  కాపుల రిజ‌ర్వేష‌న్లు సెప్టెంబ‌ర్ వ‌ర‌కు పూర్తివుతుంద‌న్నారు. ఇంత‌వ‌ర‌కు ఎటువంటి స్ప‌ష్ట‌త లేదు
- జీడీపీలో రాష్ట్రానికి 30వ ర్యాంకు వ‌చ్చింది... కానీ, దానికి భిన్నంగా రాష్ట్రం అభివృధ్ధిలో ముందుకు వెళ్తుంది అని టీడీపీ చెప్ప‌డం సిగ్గుచేటు
- ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండున్న‌ర ఏళ్లు అవుతున్న ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల ఎందుకు అమ‌లు కాలేదు చంద్ర‌బాబు 
- నిరుద్యోగులు, రైతులు,  ఇలా ప్రతీ ఒక్కరి ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింది
- ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌పై అసెంబ్లీ స‌మావేశాల్లో క్షుణ్ణంగా చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంది. 
- న‌యీం ఎన్‌కౌంట‌ర్‌లో సైతం టీడీపీ పెద్ద‌వారు ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి
- ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అధికార పార్టీ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది
- కృష్ణ న‌ది జ‌ల‌ాల్లో మాకు సైతం హ‌క్కు ఉంద‌ని ఓ వైపు తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతున్నా టీడీపీకి చీమ‌కుట్టిన‌ట్లు కూడా లేదు
- కృష్ణా డెల్టాలో చుక్క‌నీరు లేదు. ప‌ట్టిసీమ నుంచి నీళ్లు వ‌స్తాయ‌నుకుంటే అదీ లేదు
- రెండున్న‌రేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువ‌త‌కు వ‌య‌స్సు దాటిపోతోంది. మరి వారి పరిస్థితి ఏంటి?
- ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా అసెంబ్లీ స‌మావేశాల నిర్ణ‌యాల‌కు ముందే ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నాం. తూతూమంత్రంగా సమావేశాలు జరపడం సరికాదు. కనీసం నాలుగు వారాలైనా నిర్వహించాలి

No comments:

Post a Comment