22 August 2016

బాబు విధానాలతో రాష్ట్రం అధోగతి పాలు

  • రాష్ట్ర హక్కులను కాలరాస్తున్న బాబు
  • మోడీ కాళ్ల వద్ద రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వైనం
  •  రెండేళ్లు దాటినా ఇంకా కాకమ్మ కథలు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
హైదరాబాద్ః  రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి బిచ్చగాడిలా వ్యవహరిస్తూ..... రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టుపెడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చంద్రబాబుపై మండిపడ్డారు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా విభజన చట్టంలోని హామీలను సాధించడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యాడని అన్నారు. చంద్రబాబు, లోకేష్ లు రాష్ట్రాన్ని దోచుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలయిందన్నారు. ఇప్పటికైనా బాబు మేల్కొని రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల కోసం కేంద్రసర్కార్ పై పోరాడాలని సూచించారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు.

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...

()బాబు , మోడీలు అధికారంలోకి వచ్చి సగకాలం అయిపోయింది. ఎక్కడవేసిన గొంగలి అక్కడే ఉన్నాయి. ఏదీ ముందుకు సాగడం లేదు.  రాజధాని, పోలవరం హామీలు ఏమయ్యాయి. వాటిని నిర్మించే బాధ్యత మాదేనని బాబు, మోడీలు కలిసిచెప్పారు. రాష్ట్రాన్ని దోచుకోవడంపైనే  బాబు, లోకేష్ లున్నారు తప్ప అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. బాబు తన స్వప్రయోజనాల కోసం బీజేపీ కాళ్లు పట్టుకొని ఏపీని తాకట్టు పెడుతున్న తీరుతో రాష్ట్రం అవమానాలపాలైంది. 
()1976 కోట్ల రూపాయలు సాయం ప్రకటించినట్లుగా తెలిసింది. ఇది చూసి సంతోషపడాలో, బాధపడాలో అర్థం కాని పరిస్థితి. చీలిపోయిన రాష్ట్రానికి భవిష్యత్తు ఎలా ఉంటుంది. కేంద్రం బిక్షమేసినట్టుగా వేస్తుంటే బిచ్చగాడిగా లాగా ముఖ్యమంత్రి తీసుకుంటుంటే రాష్ట్రం ఏమైపోతుందోనని తెలుగు ప్రజలు గుండెలు తొలుస్తున్నాయి.
()కాంగ్రెస్ చేతిలో దగాపడిన రాష్ట్రాన్ని కేంద్రం ఉదారంగా ఆదుకోవాలని బాబు మాట్లాడడం శోచనీయం. కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత బాబుకుంది. భాగస్వామిలాగా మాట్లాడకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు మాట్లాడుతూ నటిస్తున్నారు. తనకు సంబంధించిన పత్రికల్లో  గట్టిగా మాట్లాడుతున్నట్లు డ్రామాలు ఆడుతున్నాడు.
()కేంద్రం ఇవ్వవలిసిన నిధులు కచ్చితంగా ఇచ్చి తీరాలి. చట్టంలో పెట్టిన అంశాలు నెరవేర్చకపోవడం సరికాదు. పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేశారు. ఇప్పటికీ మూడు ఆగష్టు 15లు అయిపోయాయి. ఇంకా బాబు కాకమ్మ కథలు చెబుతున్నారు. 
() రాష్ట్ర హక్కుల కోసం పోరడమంటే బాబు పోరాడరు. పోనీ అందరం కలిసిపోరాడుదామంటే కేంద్రంలో మీరు దూరుతారా అని వెటకారంగా మాట్లాడుతున్నారు. ప్రతీ దానికి రాజీపడి పోయి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం బాబు నైజం. మేము రాజీపడేవాళ్లమే అయితే తమపై కేసులు పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది.  ప్రజల ప్రయోజనాలే వైయస్సార్సీపీకి ముఖ్యం. 
()ఏపీ బిచ్చగాళ్ల సంఘం అధ్యక్షుల్లాగా  ఉదారంగా ఇవ్వండంటూ బాబు కేంద్రాన్ని అడుక్కోవడం సిగ్గుచేటు. బాబు బిచ్చమెత్తుకోవడానికి కాదు ప్రజలు ఎన్నుకుంది. కేంద్రం నుంచి చట్టప్రకారం రావాల్సిన నిధులను రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఎన్నుకుంటే...బిచ్చగాడిలా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజలను అవమానించేవిధంగా ప్రవర్తిస్తున్నాడు. 
() కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని చీల్చాలనుకున్నప్పుడు మీరు ఏమన్నారో గుర్తులేదా బాబు..?రాష్ట్రం విడిపోతే రాజధానికి 4 నుంచి 5 లక్షల కోట్ల వ్యయం అవుతుందని చెప్పావ్. ఇఫ్పుడు కేవలం 2500 కోట్లు ఇచ్చారు. మరి నీకు నోరు ఎందుకు పెగలడం లేదు బాబు.  పత్రికల్లో మాట్లాడుతారా. మోడీ దగ్గర మాట్లాడరా. లోటు బడ్జెట్ ని మేమే పూరిస్తామని విభజన చట్టంలో పెట్టారు. అది బిక్ష కాదు రాష్ట్ర ప్రజల హక్కు. 
()ఒకసారి 15 వేల కోట్లు, మరోసారి 16, ఇంకోసారి 21 వేల కోట్లు లోటు బడ్జెట్ అంటూ లెక్కలు పంపడంతో బాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఇది లోటు బడ్జెట్ కాదు. మేము ఇవ్వాల్సింది ఇస్తామని మూడేళ్లలోరూ. 3379 కోట్లు ఇచ్చారు. 
()బాబు చెప్పే విషయాలను కేంద్రం విశ్వాసంలోకి తీసుకోవడం లేదు.  మెడ పట్టుకొని బయటకు గెంటుతుంటే బాబు సూరిపట్టుకుని వేలాడుతున్నాడు. వెనుకబడిన ఏడు జిల్లాలకు 1050 కోట్లు, రాజధాని 450 కోట్లు అని ప్రకటించారు తప్ప ఇవ్వడం లేదు.  
()చంద్రబాబుకు డబ్బులిస్తుంటే తన సోకులు, కమీషన్ ల కోసం ఖర్చుపెట్టుకుంటున్నారు. బాబు లెక్కలు చెబితే తప్ప డబ్బులివ్వమనే పరిస్థితికి కేంద్రం వచ్చింది. 
()తెలుగు ప్రజలందరినీ కించపర్చే విధానంతో వ్యవహరిస్తే నోరు ఎందుకు పెగలడం లేదు. ఆంధ్ర ప్రజల తరపున పోరాడావల్సిందిపోయి కాలం బాబు గడిపే పరిస్థితి చేస్తున్నారు.  కేంద్రాన్ని నిలదీసినట్టు, దూషించినట్టు పత్రికల్లో ఘీంకరిస్తున్నారు తప్పితే బాబుకు ప్రజల ప్రయోజనాలే పట్టడం లేదు. 
() ప్రజలను మభ్యపెట్టేవిధంగా కాకుండా చిత్తశుద్ధితో రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి. కరప్టడ్ సీఎం అని కేంద్రం ముద్రవేసే పరిస్థితిలో ఉండడమంటే అది తెలుగు రాష్ట్రానికే అవమానమైన రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకహోదాపై ప్రకటన చేయాలి. అదేవిధంగా నిధులు అరకొర తీసుకొచ్చి మోసం చేయోద్దు. 
()ఈమూడేళ్లలో రెవెన్యూలోటు, వెనుకబడిన జిల్లాలకు, రాజధాని, పోలవరానికి ఇచ్చింది కేవలం 8,370 కోట్లు మాత్రమే ఇచ్చి పండుగ చేసుకోమనడం బాధాకరం. పోలవరం చట్టంలో ఉన్న బాధ్యత. రూ.36 వేల కోట్ల రూపాయలు పోలవరానికి కట్టాల్సి ఉంటే అరకొరగా విదిల్చారు. 
బాబు, మోడీలు పోలవరాన్ని భూస్థాపితం చేసే కుట్ర చేస్తున్నారు. ఏపీ అంతా ఎడారిగా మారుతుందని జలనిపుణులు చెబుతంటే పోలవరాన్ని గాలికొదిలేస్తున్నారు. 
()బాబు విధానం వల్ల రాష్ట్రం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే వారికి తమ మద్దతు తప్పకుండా ఉంటుంది. 
ప్రత్యేక హోదా, ప్యాకేజీతో పాటు విభజన చట్టంలోనీ హామీలన్నీ నెరవేర్చాలి. 
()రియో ఒలింపిక్స్ లో పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధించాలని వైయస్సార్సీపీ ఆకాంక్షిస్తోంది.

No comments:

Post a Comment