26 August 2016

గడపగడపకు కార్యక్రమం@50 డేస్

  • గడపగడపలో వైయస్సార్సీపీకి జననీరాజనం
  • మహోద్యమంలా కొనసాగుతున్న కార్యక్రమం
  • బాబు అవినీతి పాలనపై పెల్లుబికిన ఆగ్రహం
  • ఎన్నికల హామీలు విస్మరించిన బాబుపై మండిపాటు
  • ప్రజాబ్యాలెట్ లో చంద్రబాబుకు ఓటమి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం మహోద్యమంగా సాగుతోంది. గడపగడపలో  వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. రాజన్న తనయుడు జగనన్న సైన్యాన్ని ప్రజలు అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు. బొట్టు పెట్టి హారతిచ్చి అపూర్వస్వాగతం పలుకుతున్నారు. ప్రజాశ్రేయస్సే పరమావధిగా ఎక్కడ ఎవరికి ఏ ఆపద వాటిల్లినా నేనున్నానంటూ అండగా నిలుస్తున్న  ప్రతిపక్ష నేత, జననేత వైయస్ జగన్.... ప్రజల పార్టీ వైయస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఐదుకోట్లమంది ప్రజాభిమానాన్ని సంపాదించుకుంది. నేటికి గడగడపకూ కార్యక్రమాన్ని ప్రజల మధ్య దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకొని ముందుకు సాగుతోంది. 


అధికారం కోసం వందలాదిగా అమలుగానీ హామీలు గుప్పించిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక ప్రజలను నయవంచన చేశారు. హామీలను విస్మరించి, సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తూ... అవినీతి, అక్రమాలే ధ్యేయంగా  బాబు పాలన సాగిస్తున్నారు. రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్న బాబు దురాగతాలపై వైయస్సార్సీపీ అలుపెరగకుండా పోరాడుతోంది. ఈనేపథ్యంలోనే బాబు మోసాలను, అన్యాయాలను, అవినీతిని ప్రజల్లో ఎండగట్టేందుకు దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా. వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ..పార్టీ గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  



అధ్యక్షులు వైయస్ జగన్... ప్రియతమ నేత వైయస్ రాజశేఖరెడ్డి జయంతి రోజున ఇడుపులపాయలో స్వయంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  వైయస్సార్సీపీ ప్రజాప్రతినిధులు రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా బాబు చేసిన మోసాలను వివరిస్తున్నారు. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ఇంటింటికీ కరపత్రాలను అందించారు.  పాసా, ఫెయిలా..? మార్కులు వేయాలని కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాబ్యాలెట్ లో బాబుకు ఓటమి ఎదురైంది. 



ప్రతీ గడపలో బాబు పాలనపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. రుణమాఫీ, ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి, పక్కా ఇళ్లు ఇలా ఏఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబును తిట్టిపోస్తున్నారు. వితంతులు, వికలాంగులు, వృద్ధులకు వచ్చే పెన్షన్లు, రేషన్ లలో కోతపెట్టిన పచ్చపార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదీ చేస్తాం, ఇదీ చేస్తామని అబద్ధపు హామీలతో చంద్రబాబు తమను నమ్మించి నట్టేట ముంచారని వైయస్సార్సీపీ నేతల వద్ద ప్రజలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మహానేత వైయస్సార్ పాలన స్వర్గంలా ఉండేదని  గుర్తుకు తెచ్చుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాజన్న ఆశయాలు నెరవేరాలన్నా వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతీ ఒక్కరూ విశ్వసిస్తున్నారు. 

రెండేళ్లలోనే బాబు పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. ప్రజాసమస్యలను గాలికొదిలి రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన చంద్రబాబు సర్కార్ కు తగిన బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర్రంలోని ప్రతీ పౌరుడు ఎదురు చూస్తున్నాడు. ఎఫ్పుడు ఎన్నికలొచ్చినా వైయస్సార్సీపీని గెలుపించుకుంటామని చెబుతున్నారు. వైయస్ జగన్ ను సీఎం చేసుకొని తమ జీవితాలను బాగు చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment