25 July 2016

స్విస్ ఛాలెంజ్ విధానం లోపభూయిష్టం

దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి
బాబు కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారు
రైతులు, కూలీలు, కార్మికులందరినీ రోడ్డున పడేశారు
ఇంత అవకతవకలు జరుగుతుంటే కేంద్రం నిద్రపోతుందా?

విజయవాడః రాష్ట్రంలో చంద్రబాబు ఆకృత్యాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయని వైయస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి మండిపడ్డారు. చట్టాలను, కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ బాబు  స్విస్ ఛాలెంజ్ విధానం కొనసాగించడం దారుణమని అన్నారు. పేదల పొట్టగొట్టి బాబు పెద్దలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో గౌతంరెడ్డి మాట్లాడారు.

ఏమన్నారో ఆయన మాటల్లోనే...
  • బాబు రాజకీయ పార్టీల్ని, మతాధిపతుల్ని, ప్రజల్ని ఎవర్ని ఖాతరు చేయడం లేదు.  చట్టాల్ని, కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్నారు. 
  • స్విస్ ఛాలెంజ్ విధానం లోపభూయిష్టమని కేంద్రం నియమించిన కేల్కర్ కమిటీ తేల్చింది. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
  • పారదర్శకంగా, జవాబుదారిగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ దాన్ని గోప్యంగా ఉంచరాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
  • కానీ, బాబు నియమ నిబంధనల్ని బేఖాతరు చేస్తూ నేను చెప్పిందే అమలు చేస్తానంటూ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాడు
  • తెల్లారి లేస్తే సింగపూర్, చైనా అంటూ  పరుగులు పెట్టడంలో ఆంతర్యమేంటో బాబు చెప్పాలి. 
  • రాష్ట్రంలో నిర్మాణాలు చేపట్టడానికి టెండర్లు వేయకుండా సింగపూర్ కు వెళ్లి అక్కడ సీక్రెట్ గా మాట్లాడుతున్నాడు
  • బాబు బినామీ ఆస్తులన్నీ సింగపూర్ లోనే ఉన్నాయి. వాటిని పెంచుకునేందుకే స్విస్ ఛాలెంజ్ విధానం. 
  • భారత భూబాగాన్ని వేరేవాళ్లకు ఇవ్వాలంటే నిబంధనలకు లోబడి ఇవ్వాలి. కానీ బాబుకు అవేమీ పట్టడం లేదు.  
  • సీఆర్డీఏకు కేవలం 42 శాతం మాత్రమే ఇచ్చి, సింగపూర్ వాళ్లకు 58 శాతం కట్టబెట్టడం దారుణం. 
  • కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంపై సరైన అగాహన, నియంత్రణ ఉందా లేదా..?
  • రాష్ట్రంలో ఇంత అవకతవకలు జరుగుతున్నా...! బాబు యాక్ట్ లు ఉల్లంఘించి యాక్టింగ్ చేస్తుంటే వాటిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. 
  • కేంద్రం నిద్రపోతుందా...? కేంద్రప్రభుత్వం కూడా దీనిలో ముద్దాయిగా ఉన్నట్లు భావించాల్సి వస్తుంది.
  • స్విస్ ఛాలెంజ్ విధానం తప్పుడు విధానమని కేంద్ర కమిటీయే చెప్పింది. 
  • ప్రజాధనాన్ని దోచుకునేందుకే బాబు సింగపూర్ లోని తన సంస్థలను తీసుకొస్తున్నారు.
  • ప్రతీ పనిని బాబు గోప్యంగా చేస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగపర్చే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 
  • స్విస్ ఛాలెంజ్ విధానాన్ని దేశమంతా వద్దంటున్నా నీవు ఎందుకు పెడుతున్నావు బాబు..?
  • ఇది సరైంది కాదు. సుప్రీంకోర్టు ఆదేశాల్నికూడా తుంగలో తొక్కారు. 
  • స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వైయస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దీన్ని వెంటనే  ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. 
  • స్వదేశీ కంపెనీలను కూడా ఆహ్వానించాలి. నియమనిబంధనలకు అనుగుణంగా పారదర్శకత చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది.
  • మీ బినామీ ఆస్తులను పెంచుకోవడం కోసం మీ కంపెనీలనే తీసుకొచ్చి..రాజధానిలో మీరే పెట్టుబడులు పెట్టి వాటిని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. 
  • పేదవాడి భూములు లాక్కొని పెద్దలకు కట్టబెడుతున్నారు. 
  • లక్షలాది మంది వ్యవసాయకూలీలు, రైతులు, కార్మికులను  రోడ్డున పడేశారు. 
  • 12 లక్షల ఎకరాల్ని తీసుకుంటానని బాబు చెప్పడం దారుణమని గౌతంరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment