26 July 2016

ఒక్క స్విస్ చాలెంజ్.. టాప్ టెన్ ప్రశ్నలు

ఎంత మంది వద్దంటున్నా చంద్రబాబు నాయుడు మాత్రం స్విస్ ఛాలెంజ్ నే ఇష్ట పడుతున్నారు. సుప్రీంకోర్టు, కేల్కర్ కమిటీ, కేంద్రంలోని పెద్దలు, ఇతర రాజకీయ పార్టీలు వద్దని చెబుతున్నా వినటం లేదు. సింగపూర్ బినామీ సంస్థలకు మొత్తంగా రాజధాని భూముల్ని దోచిపెట్టేందుకు తాపత్రయ పడుతున్నారు. స్విస్ ఛాలెంజింగ్ విధానం మీద ఎన్నెన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నా ప్రభుత్వం నుంచి జవాబివ్వటం లేదు.
1.     స్విస్ ఛాలెంజ్ విధానం సరికాదని సుప్రీంకోర్టు స్వయంగా వెల్లడించినా  ప్రభుత్వం ఎందకు పట్టించుకోవటం లేదు
2.     సింగపూర్ బినామీ కంపెనీలకు చాలా సరళంగా నిబంధనలు రూపొందించిన సర్కారు, బయట కంపెనీల విషయంలో ఎందుకు కఠినంగా వ్యవహరిస్తోంది.
3.     సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య (జీటూజీ) ఒప్పందమని ముందు చెప్పారు.  కేంద్రం సరేనంది. అంతే.. ఆ తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని పక్కకు జరిపి ప్రైవేటు కంపెనీలను ఎందుకు రంగంలోకి దింపారు.
4.      ‘స్విస్ చాలెంజ్’పై సుప్రీంకోర్టు తీర్పును, మార్గదర్శకాలను ఉటంకిస్తూ రాష్ర్ట ఆర్థికశాఖ స్వయంగా విడుదల చేసిన సర్క్యులర్‌ను ఎందుకు ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవటం లేదు.
5.      స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టే ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఎవ్వరికీ ప్రభుత్వం ఇవ్వకూడదు. ఈ విధానంలో పాల్గొనే సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సంప్రదింపులు జరపరాదు. అయితే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే పలు సార్లు సింగపూర్ ప్రైవేట్ సంస్థలతో నేరుగా సంప్రదింపులు జరిపారు. అలాగే వారితో సంప్రదింపులు జరిపేందుకు ఏకంగా మం త్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు.
6.     రాష్ర్టప్రభుత్వానికి ఈ ప్రాజెక్టులో 51% వాటా ఉండాలని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ మౌలికసదుపాయాల కల్పన (ఏపీఐడీఈ) చట్టాన్ని ఎందుకు పక్కన పెట్టారు. ప్రభుత్వ వాటాను 42 శాతానికి ఎందుకు పరిమితం చేస్తున్నారు.
7.     స్విస్ చాలెంజ్ విధానంలో ఏ ఏ ప్రాజెక్టులు చేపట్టనున్నారో అందరికీ తెలిసేలాగ పారదర్శకంగా ప్రభుత్వం ప్రకటించాలి. కానీ ఏఏ ప్రాజెక్టులను స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టనున్నదీ ఎందుకు ప్రకటించలేదు.
8.     స్విస్ చాలెంజ్ విధానంలో ఎటువంటి ప్రాజెక్టులను చేపట్టనున్నారో చాలా ముందుగా పూర్తి వివరాలతో బహిరంగంగా ప్రకటించాలి.  ఎటువంటి ప్రాజెక్టులు స్విస్ చాలెంజ్ విధానంలోకి వస్తాయో స్పష్టం చేయాలి. కానీ మొదట నుంచీ చంద్రబాబు గోప్యత పాటిస్తున్నారు.
9.      స్విస్ చాలెంజ్ విధానంలో కంపెనీలు తమంతట తాముగా ప్రాజెక్టును ఎంతకు చేపడతాయో తెలియజేయాలి. ప్రభుత్వం ఎలాంటి వివరాలను అందజేయరాదు. కానీ, ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే ఎదురు లేఖ రాసింది.
10.                         బాబు బినామీ ఆస్తులన్నీ సింగపూర్ లోనే ఉన్నాయి. వాటిని పెంచుకునేందుకే స్విస్ ఛాలెంజ్ విధానం అన్న విమర్శ వినిపిస్తున్నప్పటికీ ఎందుకు జవాబు ఇవ్వటం లేదు
ఇన్ని అవకతవకలు ఉన్నాయి కాబట్టే స్విస్ ఛాలెంజ్ కు తాము వ్యతిరేకం అని వైయస్సార్సీపీ ప్రకటించింది.  

No comments:

Post a Comment