20 June 2016

ముద్రగడకు ఏం జరిగినా..?

  • ముద్రగడ ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది
  • తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
  • ప్రభుత్వానికి  అంబటి డిమాండ్ 
హైదరాబాద్ః ముద్రగడ పద్మనాభంకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. పద్మనాభం ప్రాణాలతో చెలగాటమాడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముద్రగడ ఆరోగ్యం బాగా క్షీణించిందని, ఆయన ప్రాణానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులున్నాయని వాపోయారు. మొదటిసారి ముద్రగడ దీక్ష చేసినప్పుడు, విరమింపజేసేందుకు వెళ్లిన మంత్రులు ...హామీలు నెరవేరుస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. హామీలు నెరవేర్చని కారణంగానే ఆయన మరోసారి దీక్షకు దిగారని అంబటి చెప్పారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. 

ముద్రగడకు ఇచ్చిన వాగ్ధానం నెరవేరుస్తారన్న ఉద్దేశ్యంతోనే తాము ఇంతకాలం సంయమనంతో వ్యవహరించామని అంబటి రాంబాబు తెలిపారు. కానీ  ఇంప్లిమెంటేషన్ జరగకుండా ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ హామీలను నెరవేర్చకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు.  ఆయన ప్రాణాలు పోయినా పర్వాలేదన్న రీతిలో చంద్రబాబు వ్యవహరించడం దారుణమన్నారు. ముద్రగడకు ఏం జరిగినా ప్రజాస్వామ్యవాదులు చూస్తూ ఊరుకోరని, ఇలాంటి దుశ్చర్యను ఎవరూ సహించరని బాబును హెచ్చరించారు. రాష్ట్రం ఏమైపోతుందో ఆలోచన చేయాలన్నారు. 

ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ముద్రగడను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అంబటి అన్నారు. ఆయన ప్రాణాలతో చెలగాటమాడొద్దని ప్రభుత్వాన్ని మరోమారు హెచ్చరించారు. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇంతకాలం ఇంప్లిమెంటేషన్ జరుగుతుందనే తాము ఊరుకున్నామన్నారు. కాపు పెద్దలంతా సమావేశమైంది కులతత్వంతో కాదని కులాన్ని అణిచివేస్తే ప్రతిఘంటించడానికే కలిశామని చెప్పారు. కాంగ్రెస్, వైయస్సార్సీపీ సహా అనేకమందిని అరెస్ట్ చేశారు. రౌడీ షీట్ ఓపెన్ చేశారు. పోలీసులతో అణిచివేయాలని చూశారు గనుకే గత్యంతరం లేక ప్రతిఘటించేందుకు సమావేశనట్లు అంబటి పేర్కొన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.  

No comments:

Post a Comment