6 June 2016

చెప్పులు, చీపుర్లు చూపిస్తేనే బాబుకు బుద్ధి వస్తుంది

  • రెండేళ్లలో నిండా అవినీతిలో కూరుకుపోయాడు
  • పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు
  • హామీలు విస్మరించి ప్రజలను మోసం చేశాడు
  • విశ్వసనీయత అనగానే గుర్తుకు వచ్చేది వైయస్సార్
  • ఆ విశ్వసనీయతను బాబు వెన్నుపోటు పొడిచారు
  • టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన వైయస్ జగన్


అనంతపురంః  చంద్రబాబు రెండేళ్ల పాలన అంతా అబద్ధాలు, మోసాలు, అవినీతితోనే సాగిందని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిప్డడారు. నిండా అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేస్తూ పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఐదో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా చివరి రోజు అనంతపురంలో నిర్వహించిన ధర్నాలో  వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...ఆయన ఏమన్నారంటే....

బాబు ఎన్నికలకు ముందు చెప్పిందేమిటి. చేస్తున్నదేమిటి. ఒకే అబద్ధాన్ని పదే పదే చెబుతూ ప్రజలను మోసగిస్తున్నాడు. రెండేళ్లలో అవినీతి, మోసపూరిత పాలన తప్ప బాబు ప్రజలకు చేసిందేమీ లేదు.  ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది కాపాడండి అని వేలాదిమంది ప్రజలు అనంతపురంలో నడిరోడ్డుమీదికు వచ్చి గట్టిగా నినదిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేసిన చరిత్ర చంద్రబాబుది. 
మనమంతా ఆలోచన చేయాలి. మనకు ఎలాంటి నాయకత్వం కావాలి. ఎలాంటి ముఖ్యమంత్రి కావాలి అని గుండెల మీద చేయి వేసుకొని ప్రశ్నించుకోవాలి. ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా వద్దా అంటే...ప్రజలంతా బాబు మాకు వద్దే వద్దు అంటూ నినదించారు.  


ఓట్లేస్తే గానీ కూర్చీలో కూర్చునే పరిస్థితి లేకపోవడంతో బాబుకు రెండేళ్ల క్రితం ప్రజలతో పనిబడింది.. ఆరోజు మైక్ పట్టుకుని చెప్పిన మాటలేమిటి బాబు.  ఏ ఇంట్లో టీవీ ఆన్ చేసినా , ఏ గోడల మీద రాతలు చూసినా, ఉపన్యాసాల్లో చూసినా అవే మాటలు, అవే రాతలు.  ఫ్లైక్సీలకు లైట్లు మరీ హామీలతో ఊదరగొట్టారు.  గ్రామాల్లో ఫ్లైక్సీలు వదిలిపెట్టలేదు. ఇంట్లో టీవీలను వదిలిపెట్టలేదు. చివరకు గోడల మీద రాతలు రాయడం కూడా మానలేదు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే  బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బ్యాంకుల్లో బంగారం వచ్చిందా అని అడుగుతున్నా. రాలేదు. కానీ వేలం వేస్తున్నట్లు నోటీసులు మాత్రం వస్తున్నాయి. ఎప్పుడంటే అప్పుడు బ్యాంకర్లు ఇంటికొచ్చి  రైతులను వేధిస్తున్నారు. 


రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ అన్నాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. రెండేళ్లలో  రుణాలు  కట్టనందుకు 87 వేల కోట్ల మీద అదనంగా రైతులు  25 వేల కోట్లు వడ్డీలు కడుతున్నారు . మాఫీ పేరిట ఈపెద్దమనిషి ఇచ్చింది శనక్కాయలు, బెల్లానికి కూడా సరిపోలేదు.  రైతులు సంతోషంగా ఉన్నారని  మాట్లాడుతున్నాడు. ఏ గోడల్లో, టీవీల్లో, ఉపన్యాసాలు చూసినా డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ అన్నాడు.  మాఫీ సంగతి దేవుడెరుగు ముష్టివేసినట్లు మూడు వేలు అప్పుగా ఇచ్చి అదే మాఫీఅంటున్నాడు. ఇది న్యాయమేనా బాబు..? బతకడానికి అవస్థలు పడుతున్న వారు వడ్డీలు లేని పరిస్థితి నుంచి నెలకు రూ. 2 రూపాయలు వడ్డీ కడుతున్న పరిస్థితి. 

జాబు రావాలంటే బాబు రావాలి అన్నాడు. జాబు ఇవ్వకపోతే నెలకు రెండు వేల నిరుద్యోగ భృతి అన్నాడు. బాబు 
ముఖ్యమంత్రి అయ్యాడు. ఉన్న జాబులు ఊడబెరుకుతున్నాడు. అందరికీ ఇళ్లు కట్టిస్తా. గుడిసెలు లేని రాష్ట్రం చేస్తానని మాట్లాడారు. ఒక్క ఇళ్లు కట్టించిన పాపాన పోలేదు. ఇంత దారుణంగా బాబు మోసాలు చేస్తున్నారు.  ఎన్నికలప్పుడు అబద్ధాలు ఆడాడు. ఆతర్వాత మోసం చేశాడు. కేంద్రం నుంచైనా హామీలను తీసుకొస్తాడు. యువకులకు ఉద్యోగాలొస్తాయనుకున్నాం. పదేళ్లు కాదు పదిహేనేళ్లు హోదా కావాలని మాట్లాడాడు. అధికారం దక్కాక వాటికి తూట్లు పొడిచాడు. మోడీ గురించి మాట్లాడడు. ఏపీలో ఉన్నప్పుడు మోడీని తెలుగులో తిడతారు. డిల్లీకి పోయి ఇంగ్లీష్ లో మోడీని పొగుడుతారు.  హోదా ఇవ్వకపోతే మంత్రులను ఉపసంహరించుకుంటామని అల్టిమేటం ఇవ్వడం లేదు. కారణం.. బాబు అవినీతి మీద మోడీ సీబీఐ ఎంక్వైరీ వేయిస్తాడని భయం. మోడీతో ఎలాగూ కొట్లాడలేవు. కనీసం కేసీఆర్ నైనా నిలదీస్తాడేమో అనముకుంటే. అదీ లేదు. అడ్డగోలుగా కృష్ణా, గోదావరిలపై కేసీఆర్ ప్రాజెక్ట్ లు కడుతున్నాడు. 800 అడుగుల్లోనే లిఫ్ట్ లు పెట్టి నీళ్లు ఎడాపెడా తోడుకుపోతుంటే అడగడు. ఎందుకు నిలదీయలేకపోతున్నాడో తెలుసా. 

కొద్ది రోజుల క్రితం మనం చూస్తే సూట్ కేసుల్లో డబ్బులు కనిపించేవి. బాబు మనిషి సూట్ కేసుల్లో ఎమ్మెల్యేలను కొనేదానికి డబ్బులు తీసుకుపోయాడు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు సూట్ కేసు నిండా నల్లధనమే. ఫోన్ లో మాట్లాడారు. ఏం మాట్లాడారో తెలుసా. మనవాళ్లు బ్రీఫుడ్ మీ అంటూ నల్లధనం పంచిపెట్టాడు. సంవత్సరమైంది. ఆ సూట్ కేస్ మనిషిని మర్చిపోతున్న పరిస్థితి. కేసీఆర్ ను నిలదీస్తే బాబు మాట్లాడిన  మనవాళ్లు బ్రీఫ్ డ్ మాటలు బయటకొచ్చి జైలుకు పోతాడు. అందుకే రాష్ట్రాన్ని కూడా అమ్మేశాడు. అన్ని రకాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలను మోసం చేశాడు. ముఖ్యమంత్రిగా పోరాటం చేయాల్సిందిపోయి రాష్ట్ర ప్రయోజనాలను అమ్మేశాడు.

రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. ఇసుక నుంచి మట్టి దాకా. రాజధాని భూముల దగ్గరి నుంచి గుడి భూములు, గుడిలో లింగాన్ని సైతం మింగేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి సినిమాల్లోకి పోతే...మనకు వెంటనే గుర్తుకు వచ్చేదేమంటే విలన్ పాత్ర గుర్తొస్తుంది. 14 రీల్లు ఉంటే 13 రీల్లు విలన్ దే ఆధిపత్యం. అంటే చంద్రబాబు మాదిరి. హీరో అమాయకుడు. కానీ 14వ రీల్ వచ్చే సరికి క్లైమాక్స్ లో కథ అడ్డం తిరిగితే ఏమౌతుందో తెలుసా. విలన్ జైలుకు పోతాడు. హీరో రాజవుతాడు. ఇదే జరుగుతుంది. ఇటువంటి  మోసాలు చేసే వ్యక్తిని ఏం చేయాలని అడుగుతున్నా. రాయలసీమలో అయితే మాములుగా మాట్లాడే మాటలు ఏంటో తెలుసా. ఇటువంటి మోసాలు, పిక్ పాకెట్ చేసే వాళ్లను చెప్పు చూపించి చెప్పుతో కొట్టాలి అంటారు. నీనైతే అనడం లేదబ్బా. చంద్రబాబుకు చెప్పు అంటే ఉలికిపాటు వస్తుంది. ఆయనకు ఇష్టం లేదు కాబట్టి చెప్పులొద్దు గానీ..చెప్పులతో పాటు చీపుర్లు చూపించండి.  అప్పుడైనా బాబుకు అర్థమౌతోంది. బాబు తాను చేసిన మోసాలకు రైతులు, చేనేతలు ఆత్మహత్యలకు ఎలా కారణమయ్యారో అర్థమవుతోంది. హోదాను తాకట్టు పెట్టడం వల్ల యువకులకు ఉద్యోగాలు దొరక్క ఏవిధంగా అవస్థలు పడుతున్నారో. ఎంతవరకు ధర్మమో అర్థమవుతోంది. రాష్ట్రంలో తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్ లు కట్టుకుంటే పోతే చుక్క నీరు ప్రజలకు దొరకదు. చెప్పులు, చీపుర్లు ఎందుకు చూపిస్తున్నారో అప్పుడైనా బాబుకు అర్థమవుతుంది. 

ముఖ్యమంత్రి గానీ, ఓ నాయకుడు  నోట్లోంచి గానీ ఏదైనా మాట వస్తే ఆ మాట మీద నిలబడాలి. ఎందాకైనా పోవాలి. అప్పుడే విశ్వసనీయత అనిపించుకుంటుంది. విశ్వసనీయత అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి. కానీ ఆ విశ్వసనీయతను కూడా వెన్నుపోటు పొడిచింది ఎవరంటే గుర్తుకు వచ్చే పేరు చంద్రబాబు . ఈ వ్యవస్థ మారాలంటే మనలో చైతన్యం రావాలి. ఎన్నికల ముందు అడ్డగోలుగా వాగ్ధానాలు చేయడం కాదు చెప్పులు, చీపుర్లు కూడా చూడాల్సి వస్తుందని చాటిచెప్పాలి. ప్రజల గొంతు వినిపడకుండా పోతే నన్ను ఎవరు అడుగుతారని బాబు అనుకోవచ్చు. ప్రజల గొంతు నొక్కాలంటే ఎమ్మల్యేలను అవినీతి సొమ్ముతో కొనుగోలు చేస్తే పాయే కదా . ప్రజలు మాట్లాడడం  మానేస్తారనుకోవచ్చు. నీ ఆలోచన తప్పు బాబు. ఇప్పటికే 19 ఎమ్మెల్యేలకు 30, 40 కోట్లకు కొనుగోళ్లు చేశారు. 

ఆరోజు 2009,11లో  వైయస్ జగన్ అనే వ్యక్తి బయటకు వచ్చినప్పుడు వైయస్ జగన్ వాళ్ల అమ్మ మాత్రమే ఉన్నారు. ఆ రోజు తమ వెంట నిలబడింది ఎవరంటే వైయస్సార్ ను ప్రేమించే ప్రతి గుండెచప్పుడు నిలబడింది. ఆ గుండె చప్పుడే బాబును బంగాళాఖాతంలో కలిపేస్తుంది. ఎమ్మెల్యేలు పోయిన చోట ప్రజలే మళ్లీ మంచి నాయకుడిని తెచ్చుకుంటారు. బాబు తీసుకుపోయిన ఎమ్మెల్యేల చేత రాజీనామ చేయించరు. డిస్ క్వాలిఫై చేయరు. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే దమ్ము, దైర్యం చేయడు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టే  ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తూ వైయస్సార్సీపీ నేతలపై కోపం తీర్చుకుంటున్నాడు. హాస్పిటల్ లో మనవాళ్లను పరామర్శించడానికి పోతే ప్రకాష్ ను చంపాలని చూశారు. ప్రజాస్వామ్యంలో పట్టపగలే ఖూనీ చేసే పరిస్థితికి పోతున్నారు. పట్టపగలే ఎమ్మార్వో కార్యాలయంలో హత్య . సింగిల్ విండో అధ్యక్షుడిని చంపిస్తారు. ప్రభుత్వమే దగ్గర ఉండి ఇలాంటి కార్యక్రమం చేస్తే ప్రజలు ఎవరు దిక్కు. వారు ఎక్కడకు పోవాలి. 

ప్రతి పోలీస్ అధికారికి చెబుతున్నా. ఎల్లకాలం బాబు పరిపాలన సాగదు. ప్రజాస్వామ్యం కాపాడండి. బాబు చేయమని చెప్పినా వినకండి.  మానవతా దృక్పథంతో న్యాయం చేయండి. మీరు వేసుకున్న చొక్కాలకు బాబు కాదు జీతం ఇచ్చేది ప్రజలు. ఇవాళ బాబు ఉండొచ్చు. రేపు మేమొస్తాం. చూస్తూ ఊరుకోం. ధర్నాలు చేస్తాం. పోరాటం ఉధృతం చేస్తాం. జరుగుతున్న అన్యాయాన్ని గర్జించడానికి వేలాదిమంది రోడ్డుపైకి వచ్చారు. గమనించండి పోలీస్ లారా. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించేందుకు ప్రతి గడప తొక్కా.  చనిపోయిన ప్రతి కుటుంబాన్ని చేతనైన కాడికి పరామర్శించాం. ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి తోడుగా ఉంటాం. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు కృతజ్ఞతలు అంటూ వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు. 

No comments:

Post a Comment