6 June 2016

బాబుకు బుద్ధి వచ్చేలా చెప్పులు చూపించండి

  • హామీలు విస్మరించి ప్రజలను నట్టేట ముంచారు
  • పట్టపగలే ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేస్తున్నారు
  • రాష్ట్ర ప్రయోజనాలు కేసీఆర్, కేంద్రానికి తాకట్టు పెట్టారు
  • కదిరి బహిరంగసభలో ప్రజలకు వైయస్ జగన్ పిలుపు

అనంతపురం :
 ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చంద్రబాబు అవినీతి, మోసపూరిత పాలనపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కావాలనే ఆరాటంతో ఇష్టమొచ్చినట్లు హామీలు గుప్పించిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోవడం లేదని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఐదో రైతు భరోసా యాత్రలో భాగంగా కదిరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అశేష జనవాహినినుద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన ఎమన్నారంటే.. 

'యాత్రలో భాగంగా ఇప్పటివరకూ జిల్లాలో 80 కుటుంబాల వద్దకు వెళ్లడం జరిగింది. చనిపోయినవారిలో దాదాపుగా 15మంది చేనేత కార్మికులు ఉంటే మిగతావారు రైతులే. ఒక్క అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఎవరు?.ఎన్నికల ముందు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. చంద్రబాబు సీఎం అయ్యారు...బ్యాంకుల్లో బంగారం ఇంటికొచ్చిందా?  రుణాలు కట్టొద్దంటు రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు.


రుణాలు కట్టకపోవడంతో రైతులపై వడ్డీ భారం పడింది. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను కూడా చంద్రబాబు మోసం చేశారు.  చంద్రబాబు సీఎం అయిన తర్వాత డ్వాక్రా మహిళలపై వడ్డీ భారం పడింది. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. మరి అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ హామీ ఏమైంది. ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి చంద్రబాబు ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోయారు. పట్టపగలే చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు.

ఒక్కో ఎమ్మెల్యేను రూ.30 నుంచి రూ.40 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్ను ఎందుకు నిలదీయడం లేదు. ఓటుకు కోట్లు కేసులో దొరికినందుకే కేసీఆర్ను చంద్రబాబు నిలదీయలేకపోతున్నారు. నిలదీస్తే చంద్రబాబును జైలుకు పంపుతారు. అక్రమ ప్రాజెక్టుల వల్ల ఏపీ ఎడారిగా మారే ప్రమాదం ఉంది. మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు పెట్టాలా వద్దా?. రాయలసీమలో మోసం చేసిన వారిని చెప్పుతో కొట్టాలంటారు. ఇంతమందిని మోసం చేసిన చంద్రబాబును ఏం చేయాలి. ముఖ్యమంత్రిని ఏమీ అనకూడదంట. కానీ ఆయన మాత్రం మోసాలు చేయొచ్చు... అబద్దాలు ఆడొచ్చు. మనమంతా కలిసికట్టుగా ఒక్కటై వ్యవస్థలో మార్పులు తీసుకొద్దాం' అని వైయస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment