2 June 2016

అద్భుతంగా డబ్బు సంపాదించటం ఎలా.. టాప్ వన్ సీక్రెట్

  • ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు నెరవేర్చిన పాపాన పోలేదు
  • ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు
  • అన్నీ నారాయణార్పితం చేస్తున్నారు
  • నయవంచనకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు
  • ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలిఃతమ్మినేని సీతారాం
హైదరాబాద్ః రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడైన చంద్రబాబు నవనిర్మాణ దీక్ష కోసం జీవోను విడుదల చేయడం విడ్డూరమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం నిప్పులు చెరిగారు. నయవంచనకు నిలువెత్తు నిదర్శనం నారా చంద్రబాబు నాయుడని సీతారం ఫైరయ్యారు. చంద్రబాబు ఏం సాధించారని నవనిర్మాణ దీక్ష చేపడుతున్నారని తమ్మినేని నిలదీశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు వందలాది ఫ్రీ వాగ్ధానాలు చేసిన ఆల్ ఫ్రీ బాబు...అన్ని వర్గాల ప్రజలను నయవంచన చేసి నవనిర్మాణ దీక్ష చేపడుతామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తమ్మినేని సీతారాం మాట్లాడారు. 

కోస్టల్ బెల్ట్ లో ల్యాండ్ బ్యాంక్ పేరుతో రైతుల మీద లాఠీ ఛార్జ్ చేసి 10 లక్షల ఎకరాలు లాక్కున్నదానికి ఏ దీక్ష పేరు పెట్టాలి బాబు..? రాజధానిలో రైతుల భూములు మీ అబ్బ జాగీరులుగా దోచుకున్న దానికి ఏమని పేరు పెట్టాలి...? సాండ్ మాఫియాలో కోట్లాది రూపాయలు లోకేష్ కు దోచిపెట్టినదాన్ని ఏ దీక్ష అనాలి...? ల్యాండ్,  లిక్కర్ మాఫియాల దోపిడీని ఏ దీక్షల కింద పెడతారు..? ఉపాధి హామీ పథకాన్ని డైవర్ట్ చేసి నీరు చెట్టు పేరుతో పసుపుచొక్కాలకు పందికొక్కుల్లా తినమని దోచిపెడుతున్నారే దాన్ని ఏ దీక్ష కింద చూపిస్తారు..? బాబు అంటూ తమ్మినేని విమర్శలు గుప్పించారు. ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారని చంద్రబాబుపై తమ్మినేని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

నవనిర్మాణ దీక్ష అనుకోవాలా, నయవంచన దీక్ష అనుకోవాలా బాబు అంటూ తమ్మినేని విరుచుకుపడ్డారు. ఎయిర్ పోర్ట్ లు, సీ పోర్ట్ లు,  స్మార్ట్ సిటీలు అన్నావ్ . అవి ఎక్కడున్నాయి బాబు. ఏ ప్రాంతమెళితే  అక్కడ  మలేషియా చేస్తా, సింగపూర్ చేస్తా, జపాన్ చేస్తానంటూ బాబు ప్రజలను మభ్యపెడుతున్నారని తమ్మినేని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించాలని బాబు చిదంబరానికి లేఖల మీద లేఖలు రాశారు. రోశయ్య హయాంలో ఆల్ పార్టీ మీటింగ్ లో విభజనకు ఆమోదముద్ర వేసింది వాస్తవం కాదా బాబు..! ఓటింగ్ తర్వాత అప్పటి మీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు బయటకు వచ్చి విభజనకు తొలివోటు వేసింది తెలుగుదేశమేనని చెప్పింది వాస్తవం కాదా .! దీన్ని ఖండించే ధైర్యం ఉందా..! ఆనాడు విభజనకు అంగీకరిస్తున్నామని చెప్పి ఈరోజు అన్యాయమని బాబు చెప్పడం ఇంకా ప్రజలను వంచించడమేనని తమ్మినేని దుయ్యబట్టారు. కేంద్రంలో బలం లేకపోయినా వైయస్ జగన్ విభజనకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ప్లకార్డు ప్రదర్శించిన విషయాన్ని తమ్మినేని గుర్తు చేశారు. 

చేసిన తప్పిదాలను నిస్సిగ్గుగా కప్పిపెట్టడమే బాబు నైజమని తమ్మినేని సీతారాం మండిపడ్డారు. టీడీపీ, బీజేపీలు కలిసి విభజన చట్టంలోని అంశాలను తుంగలో తొక్కాయన్నారు. రాజ్యసభలో  ఏపీకి పదేళ్లు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ వెంకయ్యనాయుడు , కాదు పదిహేను ఇవ్వాలని తిరుపతి సాక్షిగా చంద్రబాబు నాయుడు అన్న మాటలను తమ్మినేని ఈసందర్భంగా మరోసారి గుర్తు చేశారు. ఆ హోదా కోసం పోరాడకుండా.... చంద్రబాబు ఓటుకు నోటు కేసులో తాళం వేసుకొని  ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాను తుంగలో తొక్కారు. రైల్వే జోన్ ను పక్కనబెట్టారు.  కృష్ణా, గోదావరి నదీ జలాలను తెలంగాణ సర్కార్ తోడుకుపోతుంటే, రాష్ట్ర హక్కులను లాక్కెలుతుంటే తాకట్టు పెట్టే మీ నైజం నయవంచన గాక మరేమంటారు బాబు అని తమ్మినేని మండిపడ్డారు. 

రుణాలు మాఫీ అన్నారు. ఏ గ్రామంలో ఎంతమంది రైతులకు మాఫీ చేశారో చెప్పగలరా బాబు..? రైతులు బ్యాంకు గడప తొక్కకుండా చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు. పైసా చెల్లించలేదు. ఇది నయవంచన కాదా చంద్రబాబు. ప్రతి వర్గానికి హామీలిచ్చారు. జాబు రావాలంటే బాబు రావాలని కరపత్రాలు వేయించి ఇంటింటికి పంపించారు. జాబులెక్కడ బాబు. విద్యార్థులు, నిరుద్యోగులను నయవంచన చేశారు. పాఠశాలలను మూసేస్తున్నారు. అన్నీ నారాయణార్పితం చేస్తున్నారు. దీన్నేమంటారు బాబు నయవంచన గాక. టీచర్లను గ్రామాల్లోకి పంపినా పిల్లలు ప్రభుత్వ బడులకు రావడం లేదంటూ ఓ సాకుతో ప్రభుత్వ స్కూళ్లను  ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తున్నారు. దీన్ని నారాయణ వంచన అనాలా నారావంచన అనాలా అంటూ తమ్మినేని ఫైరయ్యారు.  

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో బాబు మీటింగ్ లు చూసి జనం నవ్వుకుంటున్నారని తమ్మినేని సీతారం ఎద్దేవా చేశారు. విలువలను పాతరేసి నడిరోడ్డున నిలబెట్టిన ఫిరాయింపు శాసనసభ్యులు ....చంద్రబాబు విలువల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. విలువల గురించి మాట్లాడే అర్హత  పార్టీ మారిన ఎమ్మెల్యేలు కోల్పాయారని తమ్మినేని దుయ్యబట్టారు. జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి ల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని తమ్మినేని అన్నారు. వారి మాటలతో విలువల తల్లి సిగ్గుతో తలదించుకుంటోందని ఎద్దేవా చేశారు. 

జ్యోతుల నెహ్రూ నీవు  చెబితే  బాబు ఐదు ప్రాజెక్ట్ లు ఇచ్చాడా . లేకపోతే ఆ జిల్లా ప్రజలు సంకనాకిపోవాలా. ముఖ్యమంత్రిగా పరిరక్షించాల్సిన బాధ్యత బాబుకు లేదా. ప్రజలను మభ్యపెట్టి జీవోలివ్వడం సరైంది కాదు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులంతా  రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడితే బాగుంటుందని తమ్మినేని హితవు పలికారు. వైయస్ జగన్ పక్కన కూర్చోనివ్వలేదంటూ  ఏపీ ప్రజల కళ్లకు గంతలు కట్టేవిధానం మానుకోవాలని జ్యోతుల, భూమాలను హెచ్చరించారు. చంద్రబాబు ఎలాంటి వాడో అందరికీ తెలుసునన్నారు. మీరు మాట్లాడే విధానం సరైంది కాదని మీ అంతరాత్మ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తుందన్నారు. 

No comments:

Post a Comment