17 June 2016

చంద్రబాబు రాజధాని లో చేస్తున్న కిరికిరి ఏమిటి..

  • రైతులకు కౌలు ఇవ్వకుండా ఏడిపిస్తున్న వైనం
  • కుంటిసాకులతో కాలం వెళ్లదీస్తున్న ప్రభుత్వం
  • కూలీలకూ అదే గతి

అమరావతి: రాజధానికి ప్రభుత్వ ఉద్యోగుల్ని తరలించేందుకు చాలా హడావుడి చేస్తున్న ప్రభుత్వం రాజధాని కోసం త్యాగాలు చేసిన రైతుల్ని మాత్రం గాలికి వదిలేసింది. అదే పనిగా వెలగపూడిలో తిరుగాడుతూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. తప్పితే చుట్టుపక్కల గ్రామాల వైపు కన్నెత్తి చూస్తే ఒట్టు. ఎందుకంటే రైతులకు ఇస్తామన్న సాయం విషయంలో ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రశ్నిస్తారని భయపడుతున్నారు
అప్పట్లో ఎన్నెన్నో మోసాలు
రైతుల నుంచి భూములు లాక్కొనేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేయని మోసం లేదు. ఎన్నెన్నో హామీలు గుప్పించారు. భూములు అప్పగించిన రైతులకు ప్లాట్లు కేటాయిస్తామన్నారు. అది కూడా అదే గ్రామంలో ఒకే చోట ఇస్తామని నమ్మబలికారు. రైతు కుటుంబాల్లో విద్యాధికులు ఉంటే వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రీ అని చెప్పారు. ఊరూరా అన్న క్యాంటీన్లు పెట్టించి ఉచితంగా భోజనం అందిస్తామని, వ్రద్ధుల కోసం శరణాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయ కూలీలకు పింఛన్లు చెల్లిస్తామని మాట ఇచ్చారు.
హామీలన్నీ గాలికే
రాజధాని ప్రాంతంలో భూములు సింగపూర్ కంపెనీలకు ఇచ్చేందుకు చక చకా ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. తప్పితే రైతులకు ప్లాట్ల కేటాయింపు ఊసే లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు మంత్రి నారాయణ మాత్రం గుర్తుకు వచ్చినప్పుడల్లా అదిగో ప్లాట్లు, ఇదిగో ప్లాట్లు అని మాటలు చెబుతున్నారు.
ఎదురుచూపులు
        రైతులకు ప్రతీ ఏటా క్రమం తప్పకుండా శిస్తు చెల్లిస్తానని 24 వేల మంది రైతులతో ఒప్పందం కుదుర్చుకొన్నారు. అంతే కాకుండా ప్రతీ ఏడాది వడ్డీ కింద 10 శాతం అదనంగా చెల్లిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతీ ఒక్క రైతుకి రూ. 30 నుంచి 50వేల రూపాయిల శిస్తు ఇస్తామన్నారు. మొదట్లో అదే విధంగా రైతుల్ని బుజ్జగించేందుకు, కొత్త రైతుల్ని వంచించేందుకు గాను చెల్లించారు. ఇప్పుడు రెండో సంవత్సరం శిస్తు మాత్రం ఎగనామం పెడుతున్నారు.
        అటు రైతు కూలీలకు ఇవ్వాల్సిన పింఛన్లు ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలూ ఊపందుకొన్నాయి. దాదాపు 50వేల మంది రైతు కూలీలు అక్కడ ఉపాధి కోల్పోతే రక రకాల వంకలు పెట్టి 38వేల మంది కూలీలు అర్హులని తేల్చారు. వీరిలో రక రకాల వంకలు పెట్టి 20వేల మంది కూలీలకు పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. మార్చి నెల నుంచి పింఛన్లు అందక ఈ కూలీలంతా సీఆర్డీయే కార్యాలయం చుట్టు  తిరుగుతున్నారు.
అందుకే గ్రామాలకు దూరం
ఈ వాస్తవాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఆయన మంత్రివర్గ సహచరులకు తెలుసు. అందుకే వెలగ పూడి తప్ప ఇతర గ్రామాలకు మాత్రం వెళ్లటం లేదు. ఆయా గ్రామాలకు వెళితే నిలదీస్తారన్న భయం వెంటాడుతోంది. అందుకే అధికారులను అందుబాటులో ఉంచి నాయకులు దొంగాట ఆడుతున్నారు. 

No comments:

Post a Comment