19 May 2016

జననేత దీక్షకు వెల్లువలా మద్దతు

  • మూడ్రోజుల పాటు వైయస్ జగన్ జలదీక్ష
  • కర్నూలుకు పోటెత్తిన పార్టీ శ్రేణులు, ప్రజలు
  • అక్రమ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా జననినాదాలు 
కర్నూలుః ఏపీ ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన జలదీక్ష విజయవంతం అయ్యింది. జనం కోసం జలనం కోసం జననేత చేపట్టిన జలదీక్షకు వెల్లువలా మద్దతు లభించింది. పార్టీ శ్రేణులు, ప్రజలు కర్నూలుకు పోటెత్తడంతో జన జాతరను తలపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి చిన్నా, పెద్ద అంతా తరలివచ్చి వైయస్ జగన్ దీక్షకు మద్దతుగా నిలిచారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు సహా వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున కర్నూలుకు కదం తొక్కారు. జననేతకు సంఘీబావం ప్రకటించారు. 

మూడ్రోజుల పాటు నిర్విరామంగా తనను కలుసుకునేందుకు వచ్చిన వేలాదిమంది ప్రజానీకంతో.... వైయస్ జగన్ చెదరని చిరునవ్వులతో ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించారు.  మరోవైపు, వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తల దీక్షలు, ధర్నాలతో రాష్ర్టవ్యాప్తంగా మండలకేంద్రాలు దద్దరిల్లాయి. అనేక మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి దీక్షలకు మద్దతు పలికారు. ప్రజల శ్రేయస్సే పరమావధిగా అలుపెరగని పోరాటం చేస్తున్న జననేతకు జనం జేజేలు కొట్టారు. 

తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా, ఆ ప్రాజెక్ట్ లను అడ్డుకోలేని ఏపీ అసమర్థ ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా వైయస్ జగన్ కర్నూలు కేంద్రంగా మూడ్రోజుల పాటు జలదీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా... మొద్ద నిద్రపోతున్న టీడీపీ ప్రభుత్వాన్ని తట్టిలేపేందుకు, జలదోపిడీని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు  వైయస్ జగన్ నిరాహార దీక్ష కొనసాగించారు. కృష్ణా,గోదావరి నదులపై ఎలాంటి అనుమతులు లేకుండానే తెలంగాణ సర్కార్ ప్రాజెక్ట్ ల నిర్మాణం చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.  

పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలతో పాటు గోదావరి నదులపైనా తెలంగాణ చేపట్టనున్న ప్రాజెక్ట్ ల వల్ల ఏపీకి జరగనున్న అన్యాయాన్ని వైయస్ జగన్ ప్రజలకు వివరించారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కార్ నోరుమెదపని వైనంపై మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసు భయంతో బాబు ఏపీ ప్రయోజనాలను పక్కరాష్ట్రాలకు తాకట్టు పెట్టిన దుశ్చర్యపై నిప్పులు చెరిగారు. వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు దీక్షాస్థలి వద్దకు వచ్చి వైయస్ జగన్ దీక్షకు మద్దతు పలికారు. 

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ...చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యపు వైఖరిపై మండిపడ్డారు. జలదోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజల హక్కులు కాపాడేందుకు వైయస్ జగన్ కడుపు మాడ్చుకొని పోరాటం చేస్తుంటే...చంద్రబాబు దోచుకున్న సొమ్ముతో విదేశాల్లో విలాసాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాలను కేసీఆర్ కు తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. వైయస్ జగన్ నాయకత్వంలో కలిసికట్టుగా పోరాడి ఏపీ హక్కులను సాధించుకుందామని రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు.  

No comments:

Post a Comment