24 May 2016

మినీ మహానాడు కాదది మనీ మహానాడు

  • స్పెషల్ ఫ్లైట్లు, ఫైవ్ స్టార్ హోటల్లో బాబు విలాసాలు
  • విచ్చలవిడిగా ప్రజాధనం దుర్వినియోగం
  • మహానాడు పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారు
  • టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన అంబటి రాంబాబు
హైదరాబాద్ః స్పైషల్ ఫ్లైట్లు, ఫైవ్ స్టార్ హోటల్ లలో విలాసాలు చేస్తూ చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఓ పక్క రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఉద్యోగులు త్యాగం చేయాలని మాట్లాడుతూ..మరో పక్క బాబు మాత్రం విచ్చలవిడిగా ప్రజధనాన్ని కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకుంటాడని ప్రజలు బాబుకు ఓట్లేస్తే...ఇచ్చిన వాగ్ధానాలను గాలికొదిలేసి ప్రజల సొమ్మును ఇష్టమొచ్చినట్లు ఖర్చుచేస్తున్నారని దుయ్యబట్టారు.  తక్షణమే చంద్రబాబు ఫైవ్ స్టార్ హోటల్ ఖాళీ చేసి బయటకు రావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. 

మినీ మహానాడుల పేరుతో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని అంబటి రాంబాబు ఫైరయ్యారు. మట్టి నుంచి ఇసుక దాకా అంతా దోపిడీయేనని అన్నారు. బ్రాందీ షాపుల ఓనర్ల దగ్గర డబ్బులు తీసుకొని మహానాడు నిర్వహిస్తున్నారని నిప్పులు చెరిగారు. అది మినీ మహానాడు కాదని మనీ మహానాడు అని అంబటి తూర్పారబట్టారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఇచ్చిన వాగ్ధానాలను ఏమేరకు అమలు చేశారో చర్చిస్తారని అంతా అనుకున్నారని...కానీ అవన్నీ వదిలేసి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ను దూషించడమే పనిగా పెట్టుకోవడం విడ్డూరమన్నారు.  వైయస్ జగన్ పై అవాకులు, చెవాకులు పేలడం తప్ప...ఎక్కడ కూడా మహానాడులో రాష్ట్రాభివృద్ధిపై చర్చించిన పాపాన పోలేదన్నారు. 


మహానాడులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల మధ్య తోపులాటలు జరుగుతుంటే...ముఖ్యమంత్రి క్రమశిక్షణ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తెలుగుదేశంలో ఎంతటి క్రమశిక్షణ ఉందో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. ఎదుటి పార్టీవాళ్లను లాక్కోవడమేనా బాబు మీ క్రమశిక్షణ అని నిలదీశారు. ఇతరులకు నీతులు చెప్పడం మాని..ముందు బాబు క్రమశిక్షణ నేర్చుకోవాలన్నారు. ఒక్క హామీ నెరవేర్చలేదు. కొత్తగా పథకాలను ప్రవేశపెట్టలేని పరిస్థితుల్లో తెలుగుదేశం ఉండడం సిగ్గుచేటన్నారు. రెండేళ్లుగా రాష్ట్రాన్ని ప్రాజెక్ట్ లు, మట్టి, ఇసుక పేరుతో దోపిడీ చేశారని...ఆఖరికి మినీమహానాడు పేరుతో  వ్యాపారస్తుల దగ్గర డబ్బులు దండుకుంటున్నారని నిప్పులు చెరిగారు. మనీ మహానాడు వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. 

వైయస్ జగన్ ను కళావెంకట్రావు నీరో చక్రవర్తిగా సంబోధించడంపై అంబటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవరు నీరో చక్రవర్తో ఒక్కసారి లోతుగా వెళ్తే అర్థమవుతుందని కళా వెంకట్రావుకు చురక అంటించారు. జూబ్లీహిల్స్ లో చంద్రబాబు తన నివాసాన్ని పడగొట్టారు. అక్కడి నుంచి  మదీనాగూడ ఫాంహౌస్ కు మకాం మార్టారు. అక్కడ రూ. 2కోట్లు ఖర్చుచేశారు. దాన్ని వదిలేసి  ఫైవ్ స్టార్ హోటల్ కు మకాం మార్చారు. మీకు ఇళ్లే దొరకడం లేదా బాబు.  కోట్లాది రూపాయలు ప్రజల సొత్తును  ఖర్చు చేసి మీరు, కుటుంబసభ్యులు, మీ పరిహారం ఫైవ్ స్టార్ హోటల్ లో నివాసముంటే...నీరో చక్రవర్తి మీరా మేమా అంటూ నిప్పులు చెరిగారు. 

రాష్ట్రం లోటు బడ్జెట్ తో  కొట్టుమిట్టాడుతుంటే ఫైవ్ స్టార్ హోటల్ లో ఉండాలన్న వ్యామోహంతో బాబు ఉండడం సిగ్గుచేటన్నారు.  విమానాల్లో విదేశాలు తిరుగుతారు. ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటారు. ఇళ్ల నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అక్రమ కట్టడంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దాంట్లో నివసిస్తున్నారు. ఇలాంటి మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంటే నమ్మాలా..? అంటూ విరుచుకుపడ్డారు. ప్రజల సొమ్ము అంటే ఎందుకు బాబు మీకు అంత చులకనా అని అంబటి పైరయ్యారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను, వారి సొమ్మును దుర్వినియోగం చేయడం తప్ప.... సద్వినియోగం చేయాలన్న ఆలోచనే బాబుకు లేకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు.. మా కుటుంబం బాగుంటే చాలు అన్న విధంగా చంద్రబాబు ఉండడం దారుణమన్నారు. గతంలో ఎన్టీఆర్ కుటీరంలో ఉండి ప్రజలకు ఆదర్శులుగా నిలిచారని అంబటి గుర్తు చేశారు.  

కాపు భవనాలు, సంక్షేమ పథకాలకు చంద్రన్న పేరు పెట్టాలని, మీరే జీవో విడుదల చేసి డ్రామాలు ఆడుతున్నది వాస్తవం కాదా? అని అంబటి ప్రశ్నించారు.  మీకు తెలియకుండానే జీవోలు విడుదలవుతున్నాయా బాబు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడమెందుకని పదవికి రాజీనామా చేయాలని బాబును డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆఖరికి మేధావులు, స్వామీజీలకు కూడా రాజకీయాలు అంటగడుతున్నారని దుయ్యబట్టారు.  ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం, స్వామి స్వరూపానందలు అడుగుతుంటే...అందుకు వైఎస్ జగన్ను నిందిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. ముద్రగడ పద్మనాభంను విమర్శిస్తూ  బాబు కాపుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. మీరిచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ కులాలకు ముందుండి తలలో నాలుక లాగా పోరాడుతుంది
వెనుక ఉండాల్సిన అవసరం లేదు. 

No comments:

Post a Comment