12 May 2016

ప‌నామా పత్రాల్లో చంద్ర‌బాబు జాడ‌లు..!

హైద‌రాబాద్: చ‌ట్ట ప‌రిధికి రాకుండా ఆర్థిక లావాదేవీలు క‌లిగిన వారి పేర్లు వెల్ల‌డించే ప‌నామా ప‌త్రాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌తీసారి చంద్ర‌బాబు జాడ‌లు క‌నిపిస్తున్నాయి. మొన్న‌టికి మొన్న ఏపీ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మితులైన అజ‌య్ దేవ‌గ‌న్ పేరు రాగా, ఇప్పుడు స్వ‌యంగా బాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ డైర‌క్ట‌ర్ ప్ర‌సాద్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చి్ంది. 

2014 లో ఎన్నిక‌లు పూర్త‌య్యాక చంద్ర‌బాబుకి అధికార ప‌గ్గాలు దొరికిన త‌ర్వాత హెరిటేజ్ సంస్థ లో కొన్ని మార్పులు జ‌రిగాయి. ఇందులో భాగంగా మోట‌ప‌ర్తి శివ‌రామ ప్ర‌సాద్ కు ఇండిపెండెంట్ డైర‌క్ట‌ర్ గా నియ‌మించారు. ఆయ‌న‌కు బ్రిటిష్ వర్జిన్‌ ఐలాండ్స్‌, పనామా, ఈక్వెడార్‌లో మూడు కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా పన్నులు ఎగవేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్రసాద్‌ కుమారుడు సునీల్  అమెరికా, హైదరాబాద్‌లో స్టార్టప్‌ కంపెనీల్లో  డబ్బును ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రసాద్‌ ప్రవాస భారతీయుడు కాగా... హైదరాబాద్‌లో కొన్ని కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటు ఘనా, టోగో, అమెరికాలో ప్రసాద్‌కు వ్యాపారాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ ఆర్థిక లావాదేవీల్లోనే ప‌న్నులు ఎగ‌వేస్తూ విదేశాల్లో డ‌బ్బును తిప్పుతున్నార‌ని ప‌నామా ప‌త్రాల్లో పేర్కొన్నారు.
కాగా ప్ర‌సాద్ త‌మ సంస్థ డైరక్ట‌ర్ అని హెరిటేజ్ సంస్థ ప్ర‌క‌టించింది. ఆయ‌న నియామ‌కాన్ని హెరిటేజ్ ఫుడ్స్ ప్రెసిడెంట్ సాంబ‌శివ‌రావు నిర్ధారించారు.

ఇటీవ‌లే చంద్ర‌బాబు ఏరికోరి బ్రాండ్ అండాసిడ‌ర్ గా నియ‌మించిన అజ‌య్ దేవ‌గ‌ణ్ పేరు ప‌నామా పత్రాల్లో వెల్లడైంది. అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న వ్య‌క్తిని బాబు నియ‌మించ‌టం వెనుక వ్య‌వ‌హారం ఈ న‌ల్ల‌ధ‌నం స‌ర‌ఫ‌రాయే అని అర్థం అవుతోంది. తాజాగా ఆయ‌న కుటుంబ వ్యాపార సంస్థ‌ల డైర‌క్ట‌ర్ కూడా దొరికిపోవ‌టంతో చంద్ర‌బాబు లావాదేవీలు అంద‌రికీ అనుమానాలు క‌లిగిస్తున్నాయి. దీని మీద తెలుగుదేశం వ‌ర్గాలు మౌనం పాటిస్తున్నాయి. 

No comments:

Post a Comment