8 April 2016

లోకేష్ కి మంత్రి పదవి కోసం ఆర్భాటం ఎందుకు

  • కేంద్రాన్ని ప్రశ్నించలేని చంద్రబాబు
  • లోకేష్ సత్తా సుస్పష్టం అన్న అంబటి రాంబాబు

హైదరాబాద్: రాష్ట్ర అవసరాల మీద కేంద్రాన్ని నిలదీయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అభిప్రాయ పడ్డారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నించకుండా కేంద్ర ముఖ్య కార్యదర్శి కొఠారీ ని కోప్పడినట్లుగా వార్తలు రాయించుకోవటంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గుంటూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
 కేంద్రాన్ని నిలదీయలేరా..!
     కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల్ని గాలికి వదిలేసినప్పుడు అక్కడి నాయకుల్ని ప్రశ్నించాలని సూచించారు. అక్కడ తమ మంత్రుల్ని పదవుల్లో కొనసాగించటంలోని ఆంతర్యం ఏమిటని అడిగారు. ప్రత్యేక హోదా గురించి ఏమాత్రం చంద్రబాబు పట్టించుకోవటం లేదని, బోలెడన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చేశారని అంబటి రాంబాబు చెప్పారు. అటువంటప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలన్న సంకేతాల్ని పంపించినట్లయిందని పేర్కొన్నారు. పోలవరానికి కేంద్రం నుంచి వంద, రెండు వందల కోట్లు వస్తుంటే , తానేదో 3 వేల కోట్లు ఇచ్చేస్తున్నానని చెప్పటం ఎటువంటి సంకేతం అని అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు.
లోకేష్ మంత్రిపదవి కోసం ఆర్భాటం ఎందుకు
     ఇటీవల లోకేష్ కి మంత్రిపదవి ఇవ్వాలని తెలుగుదేశం నాయకులు హడావుడి చేస్తున్నారని అంబటి గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన కొడుక్కి మంత్రి పదవి ఇస్తానంటే అడ్డుకొనేది ఎవరని, దానికి నేతల హడావుడి ఎందుకని చురకలు అంటించారు. చంద్రబాబుకి 66 విద్యలు తెలిస్తే లోకేష్ కు అంతకన్నా డబుల్ విద్యలు తెలుసని అన్నారు. రాజకీయ ప్రవేశం చేసిన వెంటనే ప్రతిపాదించిన మనీ ట్రాన్స్ ఫర్ పథకం చతికిల పడిందని, దీన్నిబట్టే లోకేష్ సత్తా తెలిసిపోయిందని, ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో రూఢీ అయిందని చెప్పారు. తెలంగాణ లో అడ్డంగా దొరికిపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటంలో లోకేష్ పోస్టు గ్రాడ్యుయేట్ చేశారని ఎద్దేవా చేశారు. పరుల భూముల్ని కబ్జాలు చేయటంలో చంద్రబాబుది మామూలు డిగ్రీ అయితే లోకేష్ ది పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ అని అభివర్ణించారు.
టీడీపీ నేతల హడావుడి దేనికి
     ఇప్పటిదాకా రాజ్యాంగేతర శక్తిగా ఉన్న లోకేష్ .. రాజ్యాంగ ప్రకారం శక్తిగా అవతరిస్తున్నారా అని ప్రశ్నించారు. దీనికి మంత్రులు, నాయకుల బాజా భజంత్రీలు ఎందుకని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల చెత్త పాలన్ని ఈ రెండేళ్ల అధ్వాన పాలన మించిపోయిందని అన్నారు. దీన్ని బట్టే లోకేష్ సత్తా తెలిసిపోయిందని పేర్కొన్నారు. ఇప్పటికే చంద్రబాబు మంత్రి పదవిని లోకేష్ కు ఇవ్వాలని నిర్ణయించుకొని ఉంటారని, అందుకే మార్కులు కొట్టేసేందుకు టీడీపీ నేతలు పోటీ పడుతున్నారని ఆయన అన్నారు. బహుశా తన కన్నా కొడుకుని పొగిడితేనే ప్రాధాన్యం అని చంద్రబాబు భావిస్తున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. 

1 comment:

  1. ఈ దరిద్రపు బ్లాగు వలన అవినీతి ఇంటిపేరులాగా గెలుచుకున్న జగన్‌కి ఉపకారం కన్నా అపకారం మాత్రమే దక్కుతుంది! మీ చండాలపు రాతలూ కోతలూ జనం నమ్ముతారనే భ్రమపడుతున్నారా!!! మంచిది ఇలాగే హాస్యాస్పదమైన వ్రాతలతో జనానికి వినోదం పంచండి. Pot calling kettle black అన్నట్లు ఈ దోపిడీదారు జగన్‌కి నిందాలాపాలూ వాటిని ప్రచారంచేయటాని వందిమాగధగణాలూ వేయిన్నొక్క దిక్కుమాలిన మీడియా ట్రిక్కులమారి ఎత్తులూను. భలే భలే.

    ReplyDelete