6 April 2016

బాబు అవినీతిని బట్టబయలు చేసిన వాసిరెడ్డి పద్మ

  • సిట్ తో దర్యాప్తు అవసరం
  • నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగితే చంద్రబాబు దొరకటం ఖాయం
హైదరాబాద్:  ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు క‌లిగిస్తున్న అతిపెద్ద కుంభ‌కోణం ప‌నామా అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అభిప్రాయ పడ్డారు. దీని మీద ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్ ను ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
 ప్ర‌జా ధ‌నాన్ని ఇత‌ర దేశాల్లో దాచుకోవ‌డం నేర‌మ‌ని, 70 దేశాల‌కు సంబంధించిన దేశాధినేత‌లు, అనేక మంది వ్య‌క్తులు, పారిశ్రామిక‌వేత్త‌లు   వేల కోట్ల రూపాయ‌లు దాచుకున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింద‌న్నారు. అక్ర‌మంగాడ‌బ్బును దాచుకుంటున్న వారి గుట్టు విప్పాల‌ని మొద‌టి నుంచి వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంద‌ని, 70 దేశాల అధినేత‌ల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు పేరు సైతం త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానుంద‌ని స్ప‌ష్టం చేశారు. 
20 ఏళ్ల క్రిత‌మే తెహ‌ల్కా డాట్‌కామ్‌లో బాబు పేరు
20 ఏళ్ల క్రిత‌మే న‌ల్ల‌ధ‌నాన్ని విదేశాల్లో దాస్తున్నట్లు నింద‌ప‌డిన వ్య‌క్తి చంద్ర‌బాబని పేర్కొన్నారు. తెహ‌ల్కా డాట్ కామ్ ప్ర‌పంచ దేశాల్లో అత్యంత ధ‌న‌వంతుడైన రాజ‌కీయ నేతగా చంద్ర‌బాబుని పేర్కొంద‌ని చెప్పారు. 20 ఏళ్లుగా అన్ని దేశాల‌ను చుట్టివ‌స్తూ ఏపీకి సంబంధించిన ప్ర‌జాధ‌నాన్ని   విదేశాల్లో దాచిన విష‌యం కప్పి పుచ్చినా కానీ దాగ‌ని స‌త్య‌మ‌న్నారు. సీబీఐ విచార‌ణ అంటేనే చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌ని, కోర్టులో ఎవ‌రైనా పిటిష‌న్ వేస్తే సాంకేతిక కార‌ణాలు చూపించి స్టే తెచ్చుకొంటారని చెప్పారు. తాను నిప్ప‌ని చెబుతున్న బాబు కి అసలు ఆ స‌ర్టిఫికెట్ ఎవ‌రిచ్చార‌ని ప్ర‌శ్నించారు. చేతికి వాచీ, ఉంగ‌రం లేద‌ని చెబుతున్న బాబు ప‌ణామా లాంటి జాబితాలో ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ఒక రోజు తేలుతుంద‌ని,  ఒక‌సారి తీగ‌లాగితే డొంకంతా క‌దులుతుంద‌ని తెలిపారు. 
న‌ల్ల‌ధ‌నాన్ని దాస్తున్న వారిలో మొద‌టి పేరు బాబుదే
న‌ల్ల‌ధ‌నాన్ని దాస్తున్న రాజ‌కీయ నాయ‌కుల్లో చంద్ర‌బాబు పేరు మొద‌టిగా భార‌త‌దేశ వ్యాప్తంగా వినిపిస్తుంద‌ని చెప్పారు.  పనామా కుంభకోణంలో  కొంత‌భాగం మాత్రమే బ‌ట్ట‌బ‌య‌లైంద‌ని, త్వ‌ర‌లోనే అన్ని వివ‌రాలు తెలుస్తాయ‌న్నారు. సీబీఐ, ఈడీ నుంచి చంద్ర‌బాబు త‌ప్పించుకొవ‌చ్చుగానీ... ప‌నామా నుంచి మాత్రం బాబు ఎట్టి ప‌రిస్థితుల్లో త‌ప్పించుకోలేర‌ని చెప్పారు.    దోషిగా నిల‌బ‌డిన రోజున చంద్రబాబు ప‌క్క‌న ఒక్క వ్య‌క్తి కూడా నిల‌బ‌డ‌ని ప‌రిస్థితిని త్వ‌ర‌లోనే చూస్తార‌ని వైఎస్సార్‌సీపీకి ఖ‌చ్చితంగా విశ్వాసం ఉంద‌న్నారు.    సంప‌ద‌నంత వేరే దేశాల్లో దొంగ‌కంపెనీల పేరుతో కూడ‌బెడుతున్న వారిలో ప్ర‌తిసారి బాబు పేరు వినిపిస్తోంద‌న్నారు. 
తొమ్మిదేళ్ల పాల‌న‌లో ఈ విదేశీ ప‌ర్య‌ట‌న‌లు ఎందుకని ప్రశ్నించారు. గ‌తంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న‌ప్పుడు అనేక‌మార్లు స్విడ్జర్లాండ్, దావూస్ ఎందుకు వెళ్లార‌ని ఆమె నిలదీశారు.  రాజధాని పనుల్ని మొత్తం ఇత‌ర దేశాల్లో ఎందుకు పెట్టార‌ని, ఆ దేశాల‌పై ఎంద‌కంత ప్రేమ‌ని నిల‌దీశారు.   బాబు తొమ్మిదేళ్ల అవినీతితో పాటు, రాజ‌ధాని పేర సంపాధిస్తున్న అక్ర‌మ సంపాద‌న వివరాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌స్తాయని వివ‌రించారు. తెహ‌ల్కా డాట్‌కామ్ నుంచి త‌న పేరును తొల‌గించుకున్నంత ఈజీగా, కోర్టుల నుంచి సాంకేతిక లోపం పేరుతో స్టేలు తెచ్చుకున్నంత ఈజీగా.. ప‌నామా కుంభకోణం నుంచి త‌ప్పించుకోలేర‌ని తెలిపారు. అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల్లో దాదాపుగా భార‌త‌దేశానికి సంబంధించిన అనేక మంది ఈ జాబితాలో ఉన్నార‌ని తెలిసిన త‌ర్వాత ఇప్ప‌టికైనా న్యాయ‌బ‌ద్ధంగా విచార‌ణ చేప‌ట్టాల్సిన బాధ్య‌త కేంద్రంపై ఎంతైనా ఉంద‌న్నారు. న‌ల్ల‌ధ‌నాన్ని వెన‌క్కి తీసుకొస్తామ‌ని చెప్పి అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ప‌నామా లాంటి విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడైనా స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల‌ని వైఎస్సార్‌సీపీ కోరుతుంద‌న్నారు. ఇప్ప‌టికైనా కేంద్రం ప‌నామాలో స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టి అవినీతిప‌రుల‌ను క‌ఠినంగా శిక్షిస్తుంద‌ని ఆశిస్తున్నామ‌న్నారు.  
రాష్ట్రంలో అరాచ‌క పాల‌న
రాష్ట్రంలో జ‌న్మ‌భూమి క‌మిటీల పేరున ఇష్టారాజ్యంగా ఆరాచ‌క పాల‌న కొన‌సాగుతోంద‌ని, కొంద‌రు టీడీపీ నేత‌ల్లో సైతం దీనిపై అసంతృప్తి ఉంద‌ని వాసిరెడ్డి పద్మ అన్నారు.కొత్త‌రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో ఇరిగేష‌న్‌కు సంబంధించి గోదావ‌రి, కృష్ణ న‌దిపై చేప‌ట్ట‌బోయే ప్రాజెక్టుల మీద భారీగా ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చింద‌ని, దీనిపై టీడీపీ వైఖ‌రి ఏంటో స్ప‌ష్టం చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు.కృష్ణా న‌ది చంద్ర‌బాబు తాతసొత్తు కాద‌ని... గోదావ‌రి న‌ది ఆయ‌న కుమారుడు తీసుకొచ్చింది అంత‌క‌న్నా కాద‌ని, ఇది ప్ర‌జ‌ల సొత్త‌ని తెలియజేశారు. ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌పై అటు కేంద్రంతో... ఇటు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో మాట్లాడటం లేదని, ఇక తెలంగాణ ప్ర‌భుత్వంతో మాట్లాడాలంటే బాబుకు వ‌ణుకు పుట్టుకొస్తుంద‌ని అన్నారు. మ‌రి ఒక సీఎంగా ఎవ‌రితో మాట్లాడ‌తార‌ని నిల‌దీశారు.  తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాజెక్టుల‌ను నిర్మిస్తామ‌ని బ‌హిరంగంగా చెబుతుంటే ప్ర‌శ్నించక‌పోవ‌డం బ‌ట్టే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మీరు శ‌నిలాగా దాపురించిన విష‌యం తెలుస్తుంద‌ని ఎద్దేవా చేశారు.  తొమ్మిదేళ్ల పాల‌న స‌మ‌యంలో కర్ణాట‌క ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తే గ‌మ్మున ఉన్నార‌ని, రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తామంటున్నా ఇప్పుడు గ‌మ్మున ఉంటున్నార‌ని ఆరోపించారు.
ఏక‌ప‌క్ష పార్టీ ఉండాల‌నేదీ తండ్రికొడుక‌ల కల
  సింగపూర్‌లా ఏక‌ప‌క్ష పార్టీ ఉండాల‌ని తండ్రికొడుకులు క‌ల‌లు కంటున్నార‌ని వాసిరెడ్డి పద్మ అన్నారు.రాష్ట్రంపై పెత్త‌నం చెల్లాయించుకుంటున్నారా అని, ఏపీలో ఇత‌ర పార్టీలు ఉండకూడ‌దా అని ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్ష పార్టీ గొంతును నొక్కేసి, చంపేయాల‌న్న ఆలోచ‌న‌ చేస్తున్నారని మండిపడ్డారు.  ప్రాజెక్టుల‌పై రెండు రోజుల్లో త‌మ వైఖ‌రీ ఏంటో చెప్పాల‌ని లేనిప‌క్షంలో వైఎస్సార్‌సీపీ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తుంద‌న్నారు. 

No comments:

Post a Comment