4 April 2016

చంద్రబాబు మార్కు బాదుడు

  • గత ఏడాది బిల్లులతో శ్లాబుల మార్పు
  • పేద మధ్య తరగతి వర్గాల మీద భారం

ఏంటి వేస‌వికాలం కాదా ఇంట్లో ఫ్యాన్లు స్పీడ్‌గా ఓ ప‌ది గంట‌లు ప‌ని చేస్తుందా..?  లేక ఇంట్లో రెండు లైట్లు ఓ ఐదు గంట‌లు వెలుగుతున్నాయా..?  టీవీ రోజు 10గంట‌లు న‌డుస్తుందా అయితే మీకు మోగాల్సిందే బిల్లుల మోతా..?  
ఇదేంటి అనుకుంటున్నారా.. మ‌న రాష్ట్ర ప్ర‌భుత్వం పేద‌ల సుఖ‌సంతోషాల‌తో బ‌త‌క‌డం అటుంచితే క‌నీసం వారి మానానా వారిని బ‌త‌క‌నీయ‌క‌పోవ‌డమే దాని ల‌క్ష్యం.  
ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌కు 75 యూనిట్లపై విద్యుత్ వాడితే అంటే 75 నుంచి 100వ‌ర‌కు అనుకుంటే ఒక్కొ యూనిట్ మేరనే విద్యుత్ బిల్లు వ‌చ్చేది అంటే మొద‌టి 50 యూనిట్ల‌కు 1.45 పైసలు, 51 నుంచి 100 యూనిట్ల‌కు రూ. 2.60, 101 నుంచి 200 యూనిట్ల‌కు రూ. 3.60 పైస‌ల చొప్పున చార్జీ ప‌డేది. కానీ ఇప్పుడు ప‌రిస్థితి అలా లేదు గ‌తేడాది వినియోగాన్ని ప్రామాణికంగా తీసుకోవ‌డం వ‌ల్ల తొమ్మిది వంద‌ల కంటే ఒక్క యూనిట్ ఎక్కువ వినియోగించిన వారంతా బీ కేట‌రిగీకి చెందుతారు. అంటే వారు ఈ సంవ‌త్స‌రం ఎంత త‌క్కువ విద్యుత్ వినియోగించినా వారికి యూనిట్‌కు రూ. 2.60 చొప్ప‌న బిల్ వస్తుంది. 
ఎలా అంటారు అయితే ఈ ఉదాహ‌ర‌ణ చూడండి
ఈ సంవ‌త్స‌రం బీ కేట‌గిరీలో ఉన్న వినియోగ‌దారుడు నెల‌లో 75 యూనిట్లు వాడితే అత‌ను యూనిట్‌కు రూ. 2.60 చొప్పున రూ. 195 చెల్లించాల్సి ఉంటుంది. అదే పాత ప‌ద్ద‌తి అయితే మొద‌టి 50 యూనిట్ల‌కు రూ. 1.45, మిగిలిన 25 యూనిట్ల‌కు 2.60 చొప్పున మొత్తం రూ. 137.50 చెల్లించేవాడు. ఈ కొత్త విధానంలో అత‌ను వినియోగించిన 75 యూనిట్ల‌కు రూ. 57.50 పైసల భారం అద‌నంగా ప‌డుతుంది. స‌రే 50 రూపాయ‌లే క‌దా అనుకునే వారు కొంద‌రుండొచ్చు... అదే పొట్ట‌కూటి కోసం విద్యుత్‌పై ఆధార‌ప‌డి వ్యాపారాలు చేసుకునే వ‌డ్రంగులు, టీవీ, ఫ్యాన్‌, మిక్సీ, సెల్‌ఫోల్ మెకానిక్‌లకు మాత్రం బిల్లు త‌డిసి మోపెడ‌వుతుంది. 
వీటికి విద్యుత్‌ను వాడ‌క త‌ప్ప‌దు
ప్ర‌స్తుత కాలంలో ఎంత దిగువ త‌ర‌గ‌తి ప్ర‌జ‌లైన స‌రే... ఏ చిన్న ఇంటిని తీసుకున్నా క‌నీసం 2 లైట్లు త‌ప్ప‌నిస‌రి. వీటిని రోజుకు ఐదు గంట‌లు వాడినా క‌నీసం నెల‌కు 9 యూనిట్లు ఖ‌ర్చ‌వుతుంది. రెండు ఫ్యాన్లు క‌నీసం రోజుకు 10 గంట‌లు వాడితే నెల‌కు 15 యూనిట్లు, ఫ్రిజ్ రోజుకు స‌గ‌టున 10 గంట‌ల వాడ‌కం ఉన్నా 30 యూనిట్లు, టీవీని రోజుకు 10 గంట‌లు వాడిన నెల‌కు 46 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. ఇలా నెల‌కు 100 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. అయిన 75 యూనిట్లు దాటితే విద్యుత్ బిల్లు రెట్టింపు అవ్వ‌డం వినియోగ‌దారుల‌కు పెనుభారం కానుంది. ముఖ్యంగా మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజలకు కరెంటు షాకు తప్పనిసరి అవుతోంది.

No comments:

Post a Comment