26 April 2016

బాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతున్నడా..?

  • బాబువి దిగజారుడు రాజకీయాలు
  • మోసాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రలోభాలు
  • ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు

న్యూఢిల్లీః అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు ఇలా ప్రతి ఒక్కరినీ మోసం చేసిన చంద్రబాబు...ప్రజల కోపాగ్ని నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బాబు ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు.  ఢిల్లీలో వైఎస్ జగన్ బృందం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యింది. బాబు అవినీతి పాలనపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని హోంమంత్రిని కోరినట్లు ఈసందర్భంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

పట్టపగలే ప్రజలు చూస్తుండగానే ఒక్కో ఎమ్మెల్యేకు  బాబు 20,30 కోట్లు ఎరవేస్తున్నారు.  ఇంతింత డబ్బులతో ఎమ్మెల్యేలను  కొనుగోలు చేస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని మరొకటి ఉండదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ప్రజల్లోకి తీసుకుపోయే ధైర్యం లేదు.  నమ్మకం లేని పరిస్థితుల్లో బాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. బాబు పాలనను చూసి  ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు రాష్ట్ర పరువు ఏవిధంగా తీస్తున్నాడో సీతారాం ఏచూరి మీడియాకు చెప్పారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మీ అందరి సహకారం కావాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా రావాలి అని వైఎస్ జగన్ మీడియాముఖంగా చెప్పారు. 

డీ లిమిటేషన్ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ....దాన్ని వల్ల ఓ 50 మంది ఎమ్మెల్యేలకు ఉద్యోగాలిస్తాయి తప్ప సామాన్య ప్రజానికానికి ఎలాంటి లాభం ఉండదన్నారు.  ప్రజలకు కావాల్సింది విభజన హామీలు అమలు అవుతున్నాయా లేదా అన్నదే ముఖ్యమన్నారు. ప్రత్యేకహోదా అడగకుండా డీలిమిటేషన్ అడిగితే బాబు అంత చరిత్ర హీనుడు మరొకరు ఉండరని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో  ప్రశ్నించాల్సిన పరిస్థితులు ఉండి కూడా అలా జరగకపోవడం అన్యాయంమన్నారు.  కచ్చితంగా బాబు అనైతిక, అవినీతి కార్యక్రమాలపై ఎంక్వైరీ జరగాలన్నారు. శరద్ పవార్ కు ఇచ్చిన నోట్  తో పాటు...విభజన హమీలకు సంబంధించిన నోట్ ను కూడా హోంమంత్రికి ఇచ్చామని వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న ప్రత్యేకహోదా, పోలవరం, రైల్వే జోన్ సహా అనేక విభజన హామీల ప్రస్తావన లెటర్ కూడా అటాచ్ చేసి ఇచ్చినట్లు తెలిపారు. 

1 comment:

  1. ప్రశ్న: బాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతున్నడా..?
    సమా: జగన్ పార్టీకి భవిష్యత్తు ఉన్నదా? అన్నది ప్రస్తుతం అసలు ప్రశ్న. ఇంకా మాట్లాడితే జగన్ కు భవిష్యత్తే కాదు వర్తమానం కూడా కనిపించటం లేదు.

    ReplyDelete