21 April 2016

రాజవంశం పరువు తీసిన రాజా వారు

  • పుట్టిన రోజు వేళ బాబు నీచ రాజకీయాలు
  • రాజీనామా చేయకుండా పచ్చకండువా కప్పుకోవడం సిగ్గుచేటు
  • ఆనాడు వైస్రాయ్ లో వెన్నుపోటు జాతర
  • ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వైనం
హైదరాబాద్ః చంద్రబాబు అప్రజాస్వామిక విధానాన్ని నిరసిస్తూ ఈనెల 25న వైఎస్సార్సీపీ తలపెట్టిన సేవ్ డెమెక్రసీ ఆందోళనను 23న నిర్వహిస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ఈనెల 25న రాష్ట్రపతి అపాయిమెంట్ లభించే అవకాశం ఉన్నందున తేదీని రెండ్రోజుల ముందుకు మార్చినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు దీన్ని గమనించాలన్నారు. ప్రజాస్వామ్యంలో పెను ప్రమాదం వచ్చింది గనుక   జాతీయస్థాయిలో కూడా దీనిపై ఉద్యమం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. దీన్ని జాతీయస్తాయిలో ఎలుగెత్తకపోతే ప్రజాస్వామ్యానికి సమాది కట్టే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో జాతీయస్థాయిలో ఆందోళనకు కంకణం కడుతూనే..బాబు కుట్ర రాజకీయాలను  రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా నిరసనలు చేపడుతామన్నారు. 

బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, ఆయన సోదరుడు ముఖ్యమంత్రి సమక్షంలో పచ్చకండువా కప్పుకొని చేసిన వ్యాఖ్యలు  హేయనీయమని వాసిరెడ్డి పద్మ అన్నారు.  తమది రాజవంశం, ఉన్నతస్థాయిలో ఆలోచిస్తాం. పార్టీలు మారే చౌకబారు రాజకీయాలు చేయమని మాట్లాడిన బొబ్బిలి రాజావారు...అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే పార్టీ మారుతున్నానంటూ చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రజలు మీకు గత ఎన్నికల్లో ఏం తీర్పుఇచ్చారు రాజా వారు.  ప్రజలు నిన్ను వైఎస్ జగన్ తో ఉండమని గెలిపించారు. అలాంటి నీవు బాబు ఇచ్చే వంద,150 ఎకరాల కోసమో, మంత్రి పదవి కోసమే  వెళుతూ ప్రజల తీర్పును తుంగలో తొక్కావ్. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసే హక్కు నీకు ఎవరిచ్చారని నిలదీశారు.

కాల్ మనీ సెక్స్ రాకెట్ రాజకీయాలు చేసేవాళ్లే నీతివంతులన్నట్లుగా బొబ్బిలి రాజా మాట్లాడుతున్నాడు. పచ్చకండువా కప్పుకుంటే తప్ప చంద్రబాబు ప్రజలకు రేషన్ ఇవ్వడు, ఇళ్లు ఇవ్వడనే కప్పుకుంటున్నారా.   రాజీనామా అంటే ఎందుకంత ఉలికిపడుతున్నారు. మీది రాజవంశమయితే, పౌరుషం, సత్తా ఉంటే  పదవికి రాజీనామా చేసి వెళ్లాలి. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును కాలతన్నుతున్న సుజయకృష్ణకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. 

కేంద్రమంత్రిగా ఉండి రాష్ట్రానికి వెంట్రుకంత సహాయం కూడా చేయని అశోక గజపతిరాజు... వైఎస్ జగన్ పై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. అశోకగజపతి రాజు దళారీగా మారాడు.  వంశం పేరు చెప్పుకొని  సుజయకృష్ణ రంగారావు తాండ్రపాపారాయుడు పరువు దిగజార్చాడు.  బొబ్బిలి చరిత్రను మలినం చేసి.... ఈ రాజకీయాలే గొప్ప రాజకీయాలన్న బ్రాండింగ్ చేసుకుంటున్నారు. వీళ్లందరినీ ముంచడానికి  కృష్ణా, గోదావరి నదులు కూడా సరిపోవని వాసిరెడ్డి పద్మ విరుచుకుపడ్డారు. చంద్రబాబు మార్కు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.  

అన్యాయమైన ఏపీకి మోడీ-బాబు జోడితో ఏపీకి ఏదో  న్యాయం జరుగుతుందని మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించారు. రైతులు, మహిళలకు పూర్తిగా డ్వాక్రారుణాలు మాఫీ అన్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు. కాపులకు, ఎస్సీలకు, వివిధ కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. వందలకొద్దీ హామీలు గుప్పించి ఇవాళ ఏ ఒక్కటీ అమలు చేయకుండా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. పలానా పని చేశానని చెప్పుకునే దమ్ము లేక,  కాళ్లకింద భూమి కదులుతుండడం వల్లే... చంద్రబాబుకు  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమం చేస్తున్నాడని పద్మ ఫైరయ్యారు.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో బాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనే ..ఎవరూ తమ అవినీతిని ప్రశ్నించకూడదన్న దుర్భిద్దితో ప్రతిపక్షాన్ని బలహీనం చేయాలన్న కుటిలనీతికి పాల్పడుతున్నాడు.  వైఎస్ జగన్ ను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక, గోముఖ వ్యాఘ్యాల్లాగా అందరూ కలిసి జననేతపై బండలు వేస్తన్నారని వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు.  కాల్ మనీ స్కాం లో 200 సీడీలతో  ఆడియా, వీడియాలతో పట్టుబడిన తమ్ముళ్లను కేసుల నుంచి తప్పించి...దాన్ని ఎవరూ అడగకూడదన్న ఉద్దేశ్యంతో బాబు  ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టాడని మండిపడ్డారు. ప్రజల తీర్పును గౌరవించరు. ఎన్నికలంటే వణుకు. రాజీనామా అంటే పారిపోతున్నారు. ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడుతూ పచ్చకండువాలు కప్పి జాతర చేస్తున్నాడు. ఆ నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడుస్తూ వైఎస్సాయ్ హోటల్ లో కండువాలు కప్పి జాతర చేశారు. ఇవాళ  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మరో జాతర చేస్తున్నాడు. 

ప్రతిపక్షం మాట నిలుపుకోవడం లేదని మాట్లాడుతున్నారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది మీరు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది మీరు. మీరు విఫలమై ప్రతిపక్షాన్ని ఆడిపోసుకోవడం అవివేకమని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  ప్రతిపక్షం బలంగా ఉందనే చంద్రబాబుకు తన బలంమీద నమ్మకం లేక....వైఎస్సార్సీపీని  బలహీనం చేయాలన్న  కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. జాతీయస్థాయిలో ఎంతోమందిని  ప్రధానులను చేశా,  రాష్ట్రపతిలను చేశానని చెప్పుకుంటున్నావే...ఈ రకంగా కండువాలు కప్పితే నవ్విపోరా బాబు . ఏపీకి ఇదేమన్నా రోగమా అని ఉమ్మేయరా బాబు అంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 

రాష్ట్ర పరువును బాబు ఢిల్లీ బజారున పడేశారని వాసిరెడ్డి పైరయ్యారు. పుట్టినరోజు వేళ ఎవరైనా మంచి పని చేయాలనుకుంటారు. అమ్మా, నాన్నల రుణం తీర్చుకునేందుకు ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనుకుంటారు. దానీ చంద్రబాబు అనే ఈపెద్దమనిషి రాజీనామా చేయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు పచ్చకండువాలు కప్పి నీచ రాజకీయాలు చేస్తున్నారు.  నీతి, నిజాయితీతో కూడిన నికార్సయిన  రాజకీయాలు చేయడం ఈజన్మలో నీకు చేతకాదా బాబు అంటూ చురక అంటించారు.  ఒక్క వ్యక్తితోనైనా నిజాయితీ పరుడినని చెప్పుకోగలిగారా..? బాబు ఆయన చేసిన అవినీతే రాజకీయం అనుకుంటున్నాడని పద్మ మండిపడ్డారు. 

చంద్రబాబు చేసే కుట్రలు, కుతంత్రాలు ...కులాల మధ్య చిచ్చు, ఆడవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకున్న స్కాంలు బయటకు వస్తున్నా ...ఆ రాజకీయాలే మాకు నచ్చాయంటూ  ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం సిగ్గుచేటు. ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కుతున్న జంపింగ్ ఎమ్మెల్యేలకు ప్రజల  గురించి మాట్లాడే అర్హత లేదని పద్మ అన్నారు. బాబు ఎమ్మెల్యేలను కొనొచ్చేమే గానీ ప్రజలను కొనలేరని దుయ్యబట్టారు.అభివృద్ధి చేశామన్న మాటే నిజమైతే...పచ్చకండువాలు కప్పిన  ఎమ్మెల్యేలతో  రాజీనామా చేయించాలని బాబుకు సవాల్ విసిరారు. 

అశోకగజపతి రాజు లాంటి వాళ్లు మాట్లాడ్డం చూస్తుంటే వాళ్ల నైతికత ఏ స్థాయిలో పతనమవుతోందో అర్థమవుతోంది. ఒక్క వైఎస్ జగన్ మీద ఇంతమంది కక్షగట్టి కుట్రలు చేస్తునారు.  వైఎస్ జగన్ ను అడ్డుకోవడం కోసం ఉచ్చం, నీచం అన్నిమర్చిపోయారు. మనిషి రాజకీయ పతనం ఇవాళ చూస్తున్నాం. నీతిగా వైఎస్ జగన్ ను ఎదుర్కోలేక మీకు మీరే పతనం అయిపోతున్నారు. ఎందాకా ఈరాజకీయం కొనసాగిస్తారో చూస్తాం అంటూ పద్మ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment