18 April 2016

బ‌ల‌వంతంగా దీక్ష భ‌గ్నానికి యత్నం

విశాఖపట్నం:  ప్ర‌త్యేక రైల్వే జోన్ కోసం చేస్తున్న నిర‌వ‌ధిక నిరాహార దీక్ష పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించింది. విశాఖ‌ప‌ట్నంలో వైఎస్సార్సీపీ త‌ర‌పున పార్టీ అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్ నాథ్ దీక్ష‌ను పోలీసులు భ‌గ్నం చేసేందుకు య‌త్నం చేశారు. ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ఈ నెల 20న విశాఖ వ‌స్తున్నార‌ని పార్టీ నాయ‌కులు ప్ర‌క‌టించారు. దీని కోసం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ త‌రుణంలో ప్ర‌భుత్వం కుట్ర‌ల్ని అమ‌లు చేసింది.


విశాఖకు రైల్వే జోన్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ  గుడివాడ అమర్‌నాథ్ నాలుగు రోజులుగా  నిరవధిక నిరాహార దీక్షను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జా సంఘాల నాయ‌కులు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున దీక్ష శిబిరానికి త‌ర‌లి వ‌స్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి వెల్లువలా వచ్చిన నాయకులు, ప్రజల రద్దీ రాత్రి తగ్గింది. దీక్షా శిబిరంలో ఉన్నవారు విశ్రమిస్తున్న సమయంలో ఒక్కసారిగా వందలాది మంది  పోలీసులు  వచ్చి చుట్టుముట్టారు. అక్కడున్నవారు తేరుకునే లోపే క్షణాల్లో అమర్‌నాథ్‌ను దారుణంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. 
ఈ సమ‌యంలో పోలీసులు దారుణంగా వ్య‌వ‌హ‌రించారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మీద విరుచుకు పడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని పక్కకు నెట్టివేస్తూ రోడ్డుపై సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లోకి ఎత్తి పడేశారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)కి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐఆర్‌సీయూ విభాగంలో ఉంచారు. ఆస్పత్రిలోనూ అమర్‌నాథ్ దీక్ష కొనసాగిస్తున్నారు. వైద్యానికి నిరాకరిస్తున్నారు. పోలీసులు తనను బలవంతంగా ఆస్పత్రిలో చేర్చినా అక్కడే దీక్ష కొనసాగిస్తానని గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment