26 March 2016

బాబే దగ్గరుండి అవినీతి చేయిస్తున్నారు :వైఎస్ జగన్

  • ఫైబర్ ఆప్టిక్ కాంట్రాక్ట్ లో అవినీతి సుగంధం
  • బాబు సన్నిహితులకు రూ. 330 కోట్ల కాంట్రాక్టు
  • టెరా సంస్థల బండారాన్ని బయట పెట్టిన జన నేత వైఎస్ జగన్

హైదరాబాద్: ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ బండారాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బట్ట బయలు చేశారు. రాష్ట్రంలో టెలివిజన్ చానెల్స్ ను గుప్పెట్లోకి తెచ్చుకొనేందుకే  ఈ ఏర్పాటు చేస్తున్నారని ఆయన విశ్లేషించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం తర్వాత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ అంశం  మీద మాట్లాడారు.
      ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వ్యవహారం అన్నది రూ. 330 కోట్లు దోచిపెట్టే పథకం అని అభివర్ణించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక దుకాణాలకు ఈ పాస్ యంత్రాల్ని అమర్చటంలో విఫలం చెందినందుకు టెరా సాఫ్టు వేర్ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిందని వెల్లడించారు. మరి అదే సంస్థకు ఫైబర్ గ్రిడ్ పనుల్ని ఎలా అప్పగిస్తారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ సంస్థ యజమానులకు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని వివరించారు. దీనికి నేత్రత్వం వహిస్తున్న హరిక్రిష్ణ ప్రసాద్ గతంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్ని దొంగిలిస్తూ దొరికిపోయినప్పుడు పోలీసు కేసు అయిందని పేర్కొన్నారు.
      ఫైబర్ గ్రిడ్ పనుల కోసం టెండర్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ ని ఏర్పాటు చేసిందని వైఎస్ జగన్ వెల్లడించారు.  ఈ కమిటీ లో వేమూరు హరిక్రిష్ణ ప్రసాద్ ఒక సభ్యుడు అని వివరించారు. ఈయన ఆధ్వర్యంలో టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ సంస్థ ఉందని, ఇది టెరా సాఫ్టువేర్ లిమిటెడ్ కు సోదర సంస్థ అని వివరించారు. హరిక్రిష్ణ ప్రసాద్ తన పలుకుబడి ఉపయోగించి కమిటీతో తన సంస్థలకే పనులు దక్కేట్లుగా చేయించుకొన్నారని వైఎస్ జగన్ చెప్పారు. పైగా హెరిటేజ్ ఫుడ్స్ లో డైరక్టర్ గా వ్యవహరించే దేవినేని సీతారామ్ .. 2014 సెప్టెంబర్ దాకా ఈ టెరా సాఫ్టు వేర్ సంస్థకు డైరక్టర్ గా వ్యవహరించారని వివరించారు. దీన్ని బట్టి టెరా సంస్థలకు చంద్రబాబు కుటుంబానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో అర్థం అవుతుందని చెప్పారు. ఇది ఎంత దారుణమైన కేటాయింపో అర్థం చేసుకోవచ్చని వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబే దగ్గర ఉండి అవినీతి చేయిస్తున్నారని విడమరిచి చెప్పారు. 

No comments:

Post a Comment