25 March 2016

చంద్రబాబుది ప్రచారపు ఆరాటమే..!

  • నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో శీత కన్ను
  • కేటాయింపులు స్వల్పం, ప్రచారం మాత్రం ఘనం
  • సొంత ఖాతాలో వేసుకొనేందుకు బాబు ఆరాటం


హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుడు దేవినేని ఉమా మహేశ్వర రావు చేస్తున్న ప్రకటనలు.. ప్రభుత్వ ఉద్దేశ్యాలను చెప్పకనే చెబుతున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపించని ప్రభుత్వం... వాటి ద్వారా వచ్చే లబ్దిని మాత్రం తన ఖాతాలోకి పంపించుకొనేందుకు ఆరాట పడుతోంది.
వాస్తవాలు ఇవే..!
రాష్ట్రానికి నీటిపారుదల ప్రాజెక్టులు చాలా ముఖ్యం. నదుల నుంచి పారే నీటిని మళ్లించుకొని పొలాల్లోకి పంపిస్తేనే సాగుబడి వర్థిల్లి ప్రజలకు ఆహారం, రైతులకు ఆదాయం సమకూరుతుంది. అందుకే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జల యజ్నం పనులకు అంత పెద్ద మొత్తంలో నిధుల్ని కేటాయించింది. పదవీ కాలంలో ఎప్పుడూ నీటిపారుదల ప్రాజెక్టులను పట్టించుకోని చంద్రబాబు ఘనతను కూడా ఇక్కడ గమనించాలి.
        వంశధార ప్రాజెక్ట్  అంచనా వ్యయం రూ. 1242 కోట్లు అయితే...బాబు తన హయాంలో రూ. 44 కోట్లు పెట్టారు. మహానేత  వైఎస్సార్ తన హయాంలో రూ.657 కోట్లు వెచ్చించారు. వైఎస్ మరణానంతరం 138 కోట్లు కేటాయింపులు జరిగాయి. దీన్ని బట్టి వాస్తవాలు అర్థం అవుతున్నాయి కదా. పుష్కరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 608 కోట్లు అయితే, బాబు   కేవలం రూ.7.6 కోట్లు వెచ్చించా రు. వైఎస్సార్ తన హయాంలో ప్రాజెక్ట్ కోసం రూ. 538 కోట్లు ఖర్చుపెట్టారు. వైఎస్సార్ మరణానంతరం రూ.61.77 కోట్లు కేటాయింపులు జరిగాయి.
మరో ఉదాహరణ తీసుకొంటే..  తోటపల్లి ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.527 కోట్లయితే , వైఎస్సార్ హయాంలో రూ.398.88 కోట్లు కేటాయింపులు జరిగాయి.  బాబు   కేవలం రూ. 3 కోట్లు మాత్రమే కేటాయించి కబుర్లు మాత్రం బాగా చెబుతున్నారు.  ఇక తాడిపూడి ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 467 కోట్లు అయితే, బాబు రూ.3.23 లక్షలు కేటాయిస్తే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో 384.64 కోట్లు వెచ్చించారు. వైఎస్సార్ మరణానంతరం రూ. 55.19 కోట్లు ఖర్చు చేయటం జరిగింది.
 ప్రచారం కోసం ఆరాటం
       వాస్తవాలు ఇంత చేదుగా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఆరాట పడుతోంది. ప్రాజెక్టుల్లో దాదాపు 90 శాతం పైగా పనులు పూర్తయిన వాటిని గుర్తిస్తోంది. వాటికి మెరుగులు దిద్ది, అంతా తమ ఘనతే అని చెప్పుకొనేందుకు తాపత్రయ పడుతోంది. అందుకే చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరుడు దేవినేని ఉమ చేస్తున్న ప్రకటనలు కోటల్ని దాటుతున్నాయని చెబుతున్నారు. వాస్తవాల్ని దాచిపెట్టి చేస్తున్న ప్రకటనలు ప్రచారం కోసమే అన్న మాట స్పష్టంగా వినిపిస్తోంది.

No comments:

Post a Comment