16 February 2016

న్యాయం జరగదనే రోజా హైకోర్టును ఆశ్రయించారు

బుద్ధ ప్రసాద్ కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది
కమిటీతో అన్యాయం జరుగుతుందని ముందే చెప్పాం
ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి తప్పులు చూపిస్తున్నారు
అసెంబ్లీ లీకుడ్ వీడియోస్ పై సైబర్ క్రైంలో ..
ఫిర్యాదు చేద్దామంటే ముందుకు రావడం లేదు
స్పీకర్ చైర్ ను కోడెల దిగజార్చారు
ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష నేతను దుయ్యబట్టడం దారుణం

హైదరాబాద్ః అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తనపై నియమించిన బుద్ధప్రసాద్ కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కమిటీలో ముగ్గురు అధికారపార్టీకి చెందిన వారే ఉన్నందున..ముందు నుంచి తాము చెప్పినట్లే తమకు అన్యాయం  జరుగుతోందన్నారు. తమ అభ్యంతరాలను కమిటీ చర్చించలేదని, కేవలం వైఎస్సార్సీపీనే టార్గెట్‌గా చేసుకుని చర్చించిందని శ్రీకాంత్ రెడ్డి వాపోయారు. సోషల్ మీడియాలో లీకైన వీడియోలపై సైబర్ క్రైంలో ఫిర్యాదు చేద్దామని అడిగినా కమిటీ ముందుకు రాలేదని చెప్పారు. 

బుద్ధప్రసాద్ కమిటీతో తమకు న్యాయం జరిగేలా లేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాము బాధ్యతగా అడిగిన ప్రశ్నలపై సమాధానం రాలేదని, 19న జరగనున్న సమావేశంలో వస్తుందన్న ఆశ కూడా లేదన్నారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీని దారుణంగా విమర్శించిన టీడీపీ నేతలపై కమిటీలో చర్చించకపోవడం శోచనీయమని శ్రీకాంత్ రెడ్డి  ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీలతో న్యాయం జరగదన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే రోజా హైకోర్టును ఆశ్రయించారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. 

అపోజిషన్ లేకుండా జీరో అవర్ లో చర్చించిన అంశాలపై కమిటీ వేసిన దాఖలాలు చరిత్రలో ఎప్పుడూ లేవని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సభలో రోజా సస్పెన్షన్ , సభా తీరుపై తమ అధ్యక్షులు వైఎస్ జగన్ లేఖ రాసినా...దానిపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు.  కేవలం కొంత మంది సభ్యులను టార్గెట్ చేసి.... అధికారపక్షం, ప్రతిపక్ష సభ్యులను అవమానించడం బాధాకరమన్నారు.  అసెంబ్లీలో జరిగిన విషయాలు బయటకు ఎలా వచ్చాయో చెప్పమంటే స్పీకర్, అధికారపక్షం సభ్యులు నీళ్లు నములుతున్నారన్నారు. 

అసెంబ్లీ లీకుడ్ వీడియోస్  స్పీకరే ఇచ్చాడని కాల్వ శ్రీనివాసులు చెబితే, ఎలా వచ్చాయో కెమెరాతో రికార్డ్ చేశారేమో అని స్పీకర్ చెప్పడం శోచనీయమన్నారు. సోషల్ మీడియాకు వీడియోస్ లీకేజ్ పై  సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేద్దామంటే...పాలకపక్షం దానిపై  ముందుకు రావడం లేదన్నారు. గతంలో జరిగిన వీడియోలను వాయిస్ ట్యాంపర్ చేసి, వారికి అనుకూలంగా  ఎడిటింగ్ చేయించి ...ప్రతిపక్షాన్ని ఏదో విధంగా దెబ్బతీయాలని చూడడం దారుణమన్నారు. అచ్చెన్నాయుడు, బోండ ఉమ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, చింతమనేని ప్రభాకర్...ప్రతిపక్ష సభ్యులను నిండు సభలో దూషించినా అందుకు సంబంధించిన రికార్డ్స్ బయటపెట్టకుండా సభా గౌరవాన్ని మంటగల్పారన్నారు. 

సభా మర్యాదను, స్పీకర్ చైర్ కు ఉన్న గౌరవాన్ని స్పీకర్ కోడెల ప్రసాదరావు దిగజార్చారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గౌరవప్రదమైన చైర్ లో ఉన్న స్పీకర్...ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష నాయకుని దుయ్యబట్టడం దారుణమన్నారు.  వైఎస్సార్సీపీని టార్గెట్ చేసి ఎంతసేపు ఒకవైపునే తప్పులు చూపించడం ఘోరమన్నారు. ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలపైనా సభలో చర్చ జరగాలని వైఎస్సార్సీపీ కోరుకుటుందన్నారు. అందుకు అధికారపక్షం సభ్యులు సహకరించాలన్నారు. ఉన్నతంగా వ్యవహరించాలని స్పీకర్ కోడెలకు హితవు పలికారు. 

No comments:

Post a Comment