18 February 2016

ఫ్రంట్ స్క్రీన్ బ్యాక్ స్క్రీన్‌లో దారుణంగా దోచుకుంటున్న బాబులెవరు ?

ఫ్రంట్ స్క్రీన్ లో పెదబాబు
బ్యాక్ స్క్రీన్ లో చినబాబు
దారుణంగా దోచుకుంటున్నారు
కేబినెట్ మీటింగ్ మాటున బాబు..
దోపిడీకి మార్గాన్ని సుగుమం చేసుకుంటున్నాడుఃనెహ్రూ

హైదరాబాద్ః టీడీపీ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ మాటున దోపిడీకి మార్గాన్ని సుగుమం చేసుకుంటుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు.  ఫ్రంట్ స్క్రీన్ లో పెదబాబు, బ్యాక్ స్క్రీన్ లో చినబాబు దారుణంగా దోచుకుతింటున్నారని జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హంద్రీనీవా-గాలేరు నగరి ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ కోసం..... రూ. 12 వేల కోట్ల పనులకు, రూ.110 కోట్లు అంచనాలు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే మిగిలిన ప్యాకేజీలకు కూడా క్యాబినెట్ ఆమోదాన్ని ఆసరాగా చేసుకొని దోచుకుతింటారన్నారు.  ఇప్పటికే సుమారు రూ. 6 వేల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు కేబినెట్ లో శ్రీకారం చుట్టారని నెహ్రూ ఫైరయ్యారు.  

ఇద్దరు సీఎస్ లు ప్రభుత్వం చేస్తుంది  విరుద్ధ కార్యక్రమమని పైలును తిరస్కరించారు.  ఐనా కూడా  మందబలాన్ని ఉపయోగించుకొని..  నిధులను దోచుకోవడం కోసం కేబినెట్ లో ఆమోదించారు.  ఎస్టిమేట్ ఇంతగనం పెంచాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని నెహ్రూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై  శ్వేతపత్రం విడుదల చేసి, అందుకు గల కారణాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తనకి అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎంపీ  సీఎం రమేష్ , ఆయన అనుచరులకు.... దోచిపెట్టడం కోసం చేస్తున్న కార్యక్రమం తప్పించి, ఎస్టిమేట్ పెంచాల్సిన పనే లేదన్నారు. వాళ్లు వాటాలు తీసుకోవడం కోసమే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్నారు.

చంద్రబాబు ఆర్డర్ వేయడం, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ ఫైల్ రెడీ చేయడం. ఆతర్వాత  దోచుకోవడం వీరికి అలవాటుగా మారిందని నెహ్రూ దుయ్యబట్టారు. ప్రస్తుతం 40 ప్యాకేజీలకు... 11వేల 229 వందల కోట్ల రూపాయల పనులు చేయాల్సి ఉండగా..దాన్ని ఒక్కసారే  24 వేల 7 వందల కోట్లు పెంచారు.  చంద్రబాబు ఆయన అనుయాయులు చేస్తున్న అవినీతిని నిలదీస్తే...అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఓ గ్లోబల్ ప్రచారం చేసి,  వైఎస్సార్సీపీపై నింద వేస్తున్నారని నెహ్రూ వాపోయారు. నిజంగా అభివృద్ధి చేయాలన్న త్రికరణ శుద్ధి ఉంటే ఈవిధంగా ఎవరూ దోచుకోరన్నారు.

అభివృద్ధి జరగాలి, ప్రజాధనం దోపిడీ కాకూడదనే బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్నామన్నారు. రూ. 12 కోట్లకు పూర్తయ్యే ప్యాకేజీని 110 కోట్లకు ఎందుకు పెంచారో  వైట్ పేపర్ రిలీజ్ చేయాలన్నారు. ఆవిధంగానైనా  ప్రభుత్వ దోపిడీ విధానం ప్రజలకు అర్థమవుతుందన్నారు. టీడీపీ ఎంపీ  సీఎం రమేష్ అనే వ్యక్తికి లబ్ది చేకూర్చడం కోసమే కేబినెట్ లో  దోపిడీకి ఆమోదముద్ర వేశారన్నారు. ఇకనైనా తమ తీరు మార్చుకొని....మిగిలిన ప్రాజెక్ట్ ల విషయంలోనైనా అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  లేకపోతే  పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నెహ్రూ చెప్పారు. ప్రభుత్వ అవినీతిని అడ్డుకొని తీరుతామన్నారు. 

No comments:

Post a Comment