9 February 2016

మరో ఐదు వేల మంది ఉద్యోగాలు హుళక్కి.. !

బాబు వస్తే జాబు వస్తుందన్నారు
బాబు వచ్చాకే జాబులు పోతున్నాయి
ఈ సారి శానిటేషన్ సిబ్బంది వంతు

గుంటూరు: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి జాబు వచ్చిన రోజు నుంచి వరుసగా ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఆరోగ్యమిత్ర, ఫీల్డు అసిస్టెంట్లు, ఆరోగ్యమిత్ర కార్యకర్తలు.. ఇప్పుడు ఆరోగ్య విభాగంలోని శానిటేషన్ సిబ్బంది చేరారు. చంద్రబాబుకి సంబంధించిన కాంట్రాక్టర్ కోసం దాదాపు 5 వేల మంది ఉద్యోగాలు పోగొట్టుకొని రోడ్డున పడబోతున్నారు.

ప్రస్తుత విధానం
దాదాపు ఏడాదిన్నర క్రితం అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆసుపత్రుల్లోనూ శానిటేషన్ పనుల నిర్వహణ కోసం కాంట్రాక్టర్లను పిలిచారు. టెండర్ విధానంలో గత అనుభవం, సామర్థ్యం ప్రాతిపదికన 70 మందికి పనులు అప్పగించారు. దీంతో పాటు ఆయా ఆసుపత్రుల్లో ఏఏ పనులు నిర్వహించాలో నిర్దేశించారు. ఒక వేళ విధుల నిర్వహణలో ఫెయిల్ అయితే ఆ కాంట్రాక్టర్ ను తొలగించే వెసులు బాటు పెట్టుకొన్నారు. ఆయా కాంట్రాక్టర్ల తరపున దాదాపు ఐదు వేల మంది దాకా సిబ్బంది పనిచేస్తున్నారు.

చంద్రబాబు సన్నిహితుల కోసం
ఈ పనుల మీద చంద్రబాబుకి కావలసిన సన్నిహితుల కన్ను పడింది. దీంతో ఉన్న పళంగా మొత్తం ఆసుపత్రుల శానిటేషన్ నిర్వహణ తమకు సంబంధించిన సంస్థకు అప్పగించాలని ఒత్తిడి తీసుకొన్నారు. చంద్రబాబు పేషీ నుంచి ఒత్తిళ్లు కావటంతో వైద్య ఆరోగ్య శాఖ వెంటనే అంగీకరించింది. దీంతో ఈ 70 మంది కాంట్రాక్టర్లను ఒక్కసారిగా తొలగించాలని ఆదేశాలు వెలు వడ్డాయి. ఇంతమందికి సంబంధించిన వ్యాపారం దెబ్బతినటం ఒక ఎత్తయితే, దాదాపు 5 వేల మంది ఉపాధి దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర్వులు జారీ అవటంతో ఇబ్బందుల్లో చిక్కుకొన్నారు.

అంతా చిరుద్యోగులే
ఆసుపత్రుల్లోని శానిటేషన్ విభాగం, టాయ్ లెట్ ల నిర్వహణలో పనిచేస్తున్న వారు అంటే చిరుద్యోగులు అని తేలిగ్గా అర్థం అవుతుంది. పొట్ట కూటి కోసం పనిచేస్తున్న దాదాపు 5 వేల మందిని రోడ్డు పాల్జేయటం మరోసారి చంద్రబాబు కే చెల్లింది. 

No comments:

Post a Comment