26 February 2016

అవినీతి సొమ్ముతో సిగ్గుమాలిన పనులు

బ్లాక్ మనీ సొమ్ముతో ఎమ్మెల్యేలకు ఎర
ఉంగరమే లేదన్న నీకు కోటాను కోట్లు..
ఎక్కడి నుంచి వచ్చాయి బాబు
బాబు కుంభకోణాల గురించి మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదు
ఎవరూ పార్టీ వీడకపోయినా అదేపనిగా ఎందుకు రాస్తున్నారు
పోలీసులు, రిగ్గింగ్, డబ్బులతో రాజకీయాలు చేయలేరు
చంద్రబాబును ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారుః వైఎస్ జగన్


వైఎస్సార్ జిల్లాః  ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉగంరం లేదు, గడియారంలేదు, చేతుల్లో డబ్బుల్లేవని మాట్లాడుతున్న చంద్రబాబుకు...కోటాను కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయారు. పట్టిసీమ, గాలేరు నగరి లో కోట్ల స్కాం, ఇసుక నుంచి మట్టి దాకా స్కాం, మద్యం, జెన్ కో టెండర్లలో కుంభకోణాలు,  తాత్కాలిక సచివాలయం, పుష్కరాల్లో 1600 కోట్లు,  రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, పేదల భూములు, దళిత భూములు దోచుకుంటున్నారు. ఇన్ని కుంభకోణాలు జరుగుతుంటే  అవేమీ పట్టించుకోకుండా...వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు వార్తలు రాయడమేంటని కొన్ని మీడియా ఛానళ్లను ప్రశ్నించారు. 

చంద్రబాబు చెప్పినట్లు మీడియా ఆడడం మంచి పద్ధతి కాదన్నారు. దోచుకున్న అవినీతి సొమ్ముతో చంద్రబాబు నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమం చేస్తున్నారు.  ఆయన చేస్తున్న సిగ్గుమాలిన కార్యక్రమాలను తప్పుపట్టకుండా...ఎవరూ వైఎస్సార్సీపీ నుంచి పోకపోయినా పోతున్నారని ఎల్లో మీడియా ప్రచారం చేయడం దారుణమని వైఎస్ జగన్ మండిపడ్డారు. మీరు చేసే ప్రచారాల వల్ల నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబుకు ఇది ప్రజలతో జరుగుతున్న పోరాటామన్నారు. ప్రజల గొంతు నొక్కలేరని,  ఎవరూ పోయినా బాధపడాల్సిన పనిలేదన్నారు. టీడీపీలోకి వెళ్లినపోయిన నాయకులున్నచోట అంతకన్నా మంచి లీడర్లు వస్తారన్నారు. చినబాబు జిల్లాకు వస్తున్నారని ఆఖరికి కార్పొరేటర్లనైనా చేర్పించాలని టీడీపీ నాయకులు తెగ తాపత్రయపడడం విడ్డూరమన్నారు.  

చంద్రబాబును చూస్తే అసలు మనిషేనా అనిపిస్తోందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. రాక్షసుడిగా పుట్టాల్సింది మనిషిగా పుట్టాడని ఫైరయ్యారు.  బాబుకు దమ్మూ, ధైర్యం సిగ్గు, లజ్జ ఉంటే ఎన్నికలకు పోదాం రావాలన్నారు.  ప్రజలు ఎవరికి ఓటేస్తారో దాన్ని రెఫరెండం తీసుకుందామన్నారు. రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలను తీసుకోవడమేంటని ప్రశ్నించారు. లాక్కున్న వాళ్లను ఉపఎన్నికలకు వెళ్లలేని పరిస్థితిలో బాబు ఉన్నారని దుయ్యబట్టారు. ప్రజల్లోకి వెళ్లే సత్తా లేక భయపడుతున్నారన్నారు. పోలీసులు, రిగ్గింగ్ లు, డబ్బులతో రాజకీయాలు చేయలేరని, ప్రజలు తిరగబడితే చంద్రబాబు బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమన్నారు. 


చంద్రబాబు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని వైఎస్ జగన్ అన్నారు. రుణమాఫీ అన్నాడు. వడ్డీలు కూడా మాఫీ కాలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేస్తున్నారని రైతులు బాబును నిలదీస్తన్నారు. చంద్రబాబు కారణంగా రెండు రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుందని, చంద్రబాబు లాంటి మోసగాడు లేడని డ్వాక్రామహిళలు అంటున్నారు. చదువుకునే పిల్లలు బాబును ద్వేషిస్తున్నారు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. కోటి 75 లక్షల ఇళ్లు నెలకు రూ.2వేలు ఎప్పుడు ఇస్తావని అడుగుతున్నారు. చంద్రబాబు నోట మోసం తప్ప ఇంకోటి రావడం లేదు. ప్రజలు, దేవుడు చంద్రబాబు పునాదులు కదుపుతారన్నారు. 

అధికారంలోకి వచ్చి 22 నెలలయంది. కొత్త ఇళ్లు సంగతి దేవుడెరుగు పాత ఇళ్లకు బిల్లులు కూడా రావడం లేదు. కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయి. నిత్యవసర ధరలు భగ్గుమంటున్నాయి. చంద్రబాబును ప్రజలు తిట్టిపోస్తున్నారు.  ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోరాటాలు చేస్తున్నారని చంద్రబాబు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ప్రలోభాలకు తలొగ్గకుండా..వైఎస్సార్సీపీలోనే ఉన్న 61 మంది ఎమ్మెల్యేలకు హ్యాట్సాప్ చెప్పారు. ప్రజల బాధలు కనపడకూడదని చంద్రబాబు వారి గొంతు నొక్కుతున్నారు. దాంట్లో బాగంగానే బ్లాక్ మనీతో పదవులు, డబ్బులు ఆఫర్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 

తనకు తప్ప బాబు అందరికీ ఫోన్లు కొడుతున్నారు. ఎల్లో చొక్కాలు వేసుకున్న ఛానళ్లు అదేపనిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారని వార్తలు రాస్తున్నారు. మా ఎమ్మెల్యేలు ఖండించినా...ఒకటి రెండు రోజులు ఆగి మళ్లీ మొదలుపెడుతున్నారు. చంద్రబాబు బ్లాక్ మనీ గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు. మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకోండి. మీరు రాయడం వల్ల ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తున్నాయి. పోకముందే బండ వేయడం తగదు. మానవత్వంతో వ్యవహరించాలి.  చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు. ఇంత డబ్బులు ఆఫర్ చేస్తున్నా ఐదుగురు పోయారు. మునిగిపోయే పడవలోకి ఎవరూ వెళ్లరు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి గానీ ఇలా అడ్డదారిన దిక్కుమాలిన పనులు చేయడం దుర్మార్గమన్నారు

No comments:

Post a Comment