23 February 2016

అక్కడ అవినీతి చేసేందుకు తెలుగుదేశం నాయకులు పథక రచన చేస్తున్నారు

* క్రిష్ణా పుష్కరాల్లోనూ అదే దోపిడీ
* నామినేషన్ పద్దతిలోనే పనులు
* రూ. 2,200 కోట్ల మేర దోపిడీకి స్కెచ్
విజయవాడ) తెలుగుదేశం పార్టీ నాయకులకు క్రిష్ణా పుష్కరాలు అనుకోని వరంగా నిలుస్తున్నాయి. ఆగస్టు 12 వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే పుష్కరాల్లో పెద్ద ఎత్తున అవినీతి చేసేందుకు తెలుగుదేశం నాయకులు పథక రచన చేస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ అనుసరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అప్పుడు ఏం జరిగింది.
పుష్కరాలు అనేవి అప్పటికప్పుడు వచ్చి పడేవి కానే కావు. పన్నెండేళ్లకోసారి జరిగే ఈ క్రతువు గురించి ముందే తెలుసు. అయినా సరే, గోదావరి పుష్కరాల సమయంలో సమయం దగ్గర పడే దాకా చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు, సమీక్షలు జరపలేదు. తీరా సమయం దగ్గరకు వచ్చాక హడావుడిగా పనులు మొదలు పెట్టింది. సమయం లేదని వంక చూపించి దాదాపుగా అన్ని పనులు నామినేషన్ పద్దతిలో అప్పగించేశారు. అంటే టెండర్లు పిలవటం, విచారణ జరపటం అన్నది లేకుండా తెలుగుదేశం నాయకులకు ఎడాపెడా పనులు అప్పగించేశారు. దీంతో అవినీతి అన్ని చోట్ల కంపు కొట్టింది. అంతకు ముందు పుష్కరాలకు రూ. 100 కోట్లు ఖర్చు పెడితే ఒక్కసారిగా ఈ మొత్తాన్ని రూ. 16వందల కోట్లకు పెంచేశారు. అయిన కాడికి దోచుకొన్నారు.
ఇప్పుడు ఏం జరగబోతోంది...!
ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం అదే టెక్నిక్ ను ఉపయోగిస్తోంది. పుష్కరాలకు ఆరు నెలల సమయం ఉంది. ఒక పద్దతి ప్రకారం ఏర్పాట్లు చేసుకొనేందుకు చాలినంత గడువు ఉంది. అయినా సరే, తిరిగి నామినేషన్ పద్దతినే నమ్ముకొని ముందుకు వెళుతోంది. తెలుగుదేశం నాయకులు అడ్డగోలుగా దోచుకొనేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని బట్టి తెలుగుదేశ నాయకుల బరితెగింపు అర్థం అవుతోంది. సుదీర్ఘ సమయం పాటు మంత్రివర్గ సమావేశం జరిగితే అందులో పుష్కరాల గురించి ప్రస్తావన లేకపోవటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే తిరిగి మొత్తంగా డబ్బులు దోచేసేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని అర్థం అవుతోంది. 

No comments:

Post a Comment