22 February 2016

చంద్రబాబుకి ఆ టైటిల్ కలిసోచ్చిందా లేదా..

* చంద్రబాబు సింగపూర్ దోపిడీకి భయపడుతున్న అధికారులు
* నో చెప్పిన అధికారుల మీద వేటు
* ముగ్గురిని పక్కకు తప్పించిన వైనం
హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో కోట్ల రూపాయిల ఆస్తుల్ని సింగపూర్ కు తరలించేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రల్ని చూసి ఉన్నతాధికారులు భయపడుతున్నారు. చెప్పిన చోట సంతకాలు పెట్టాల్సిందేనని బెదిరిస్తుండటంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మరీ మొండికేస్తే పదవుల నుంచి తప్పించేందుకు కూడా వెనుకాడటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పదవిలో ఇప్పటి దాకా ముగ్గురిని మార్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
       రాజధాని ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారాలన్నీ అవినీతి, అక్రమాలతోనే నిండిపోయాయి. సింగపూర్ కు చెందిన అసెండాస్.. సెమ్జ్ కార్ప్..సిన్ బ్రిడ్జ్ కన్సార్టియమ్ కు మొత్తం దోచి పెట్టేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. మొట్ట మొదట పురపాలక శాఖ కు నాయకత్వం వహించిన సాంబశివరావు ఈ విషయంలో చురుగ్గా వ్యవహరించారు. కానీ లోతుకు వెళ్లే కొద్దీ బుసలు కొడుతున్న అవినీతి ని చూసి హడలి పోయారు. అడ్డగోలుగా సంతకాలు పెట్టేందుకు నిరాకరించటంతో ఆయన్ని   పక్కకు సాయం పెట్టేశారు. టీటీడీ ఈ వో గా బదలీ చేసి సీనియర్ అధికారి గిరిధర్ ను నియమించారు. తర్వాత కాలంలో కార్యకలాపాల్ని ఆయన కనుసన్నల్లో నడిపించారు. కానీ అడ్డగోలుగా జీవో లు జారీ చేయటానికి ఆయన వెనుకంజ వేశారు. అంతే గాకుండా ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనుల మీద ఆయన ప్రశ్నలు వేసి ఫైల్స్ లోనే కొర్రీలు వేశారు. దీనికి చంద్రబాబు అండ్ కో కి చాలా కోపం వచ్చింది. దీంతో ఆయన్ని ఏ మాత్రం ప్రాధాన్యం లేని ఏపీపీఎస్సీ కార్యదర్శి పదవికి మార్చేశారు. రాష్ర్టంలో రెండేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయని ఏపీపీఎస్సీ కి పోస్టింగ్ అంటే ఏ రీతిలో అవమానించారో అర్థం చేసుకోవచ్చు.
తర్వాత పురపాలక శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అజయ్ జైన్ , పదవి రీత్యా రాజధాని నగర అభివ్రద్ది యాజమాన్య సంస్థ కు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో మాస్టర్ డెవలపర్ ను ఎంపిక చేయటంలో ఈ సంస్థ ది కీలకపాత్ర.      చంద్రబాబు చెప్పినట్లు చేయటంలో అజయ్ జైన్ కూడా వెనుకడుగు వేశారన్నది సెక్రటేరియట్ వర్గాల కథనం. ముఖ్యంగా స్విస్ ఛాలెంజ్ పద్థతిలో మాస్టర్ డెవలపర్ ను ఎంపిక చేయించాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యం. దీనికి అజయ్ జైన్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. పైగా థానే ఇళ్ల నిర్మాణం కేసులో సుప్రీంకోర్టు స్విస్ చాలెంజ్ మీద రూపొందించిన మార్గదర్శకాల్ని ఆయన ఉదహరించినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు కోటరీ కి మింగుడు పడలేదు. దీంతో అజయ్ జైన్ ను అకస్మాత్తుగా సీసీడీఎంసీ చైర్ పర్సన్ పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ పదవిలో రిటైర్డ్ అధికారి లక్ష్మీ పార్థ సారధి ని నియమించినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు పాచిక పారటానికి మార్గం సుగమం అయింది.  

No comments:

Post a Comment