17 February 2016

జడ్పీ సమావేశంలో ప్రోటోకాల్‌ రగడ

జిల్లాలో టీడీపీ నేతల బరితెగింపు
ప్రతిపక్ష నేతలపై దుర్భాషలు
అధికారులతో కలిసి కుట్రలు

వైఎస్‌ఆర్‌ జిల్లా: జిల్లా  జడ్పీ సమావేశంలో ప్రోటోకాల్‌ రగడ చోటుచేసుకుంది. ఈ సమావేశంలో కొందరు ఓడిపోయిన టీడీపీ నేతలు పాల్గొనడంతో వైఎస్సార్సీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. ఓడిపోయిన వారిని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవొద్దని ఎక్కడైనా ఉందా అంటూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ , సతీష్ రెడ్డిలు వైఎస్సార్సీపీ నేతలపై బరితెగింపు వ్యాఖ్యలు చేశారు.  కలెక్టర్‌ ఆధ్వర్యంలోనే ఎన్నికైన సభ్యులకు అవమానం జరుగుతోందని ఈసందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మండిపడ్డారు. 

మిథున్ రెడ్డి...( రాజంపేట ఎంపీ)
రాష్ట్రంలో ప్రజా ప్రతినిథులకు విలువ అనే మాటే లేకుండా పోతోంది. ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే పబ్లిక్ హెల్త్ సెంటర్ ఓపెనింగ్ చేస్తే...అనధికారికంగా ప్రారంభించారంటూ టీడీపీ నేతలు తమపై అక్రమ కేసు పెట్టి, ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. తాము ఓపెన్ చేశామన్న కక్షతోనే ఇదంతా చేశారు.  ఓడిపోయిన టీడీపీ నేతలను ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం దారుణం.  ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు. ప్రజలంతా గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు. 

గడికోట శ్రీకాంత్ రెడ్డి..(రాయచోటి ఎమ్మెల్యే) 
సిగ్గుందా అంటూ టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులను దూషించడం సరికాదు. మెడికల్ ఆఫీసర్స్ తో సహా అందరం వెళ్లి ...హెల్త్ సెంటర్ ను ప్రారంభిస్తే నిర్ధాక్షిణంగా పగలగొట్టారు.  ప్రాపర్టీ డ్యామేజ్ చేశారని తిరిగి మాపైనే కేసు పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇవి చీకటి రోజులు. ఇలాంటివి చేస్తే విశ్వాసం సన్నగిల్లుతుంది. తెలుగుదేశం నేతలు డైలాగులు చెప్పడం మాని ముందుగా ప్రోటోకాల్ పాటించడం, రాజ్యంగబద్దంగా నడవడం నేర్చుకోవాలి. పార్లమెంట్ సభ్యులను అగౌరవంగా మాట్లాడే పద్దతి  మార్చుకోవాలి. రాజ్యాంగాన్ని , ప్రజాస్వామ్యాన్ని గౌరవించినప్పుడే అందరికీ గౌరవం పెరుగుతున్న విషయం టీడీపీ నేతలు తెలుసుకోవాలి. 

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి( ప్రొద్దుటూరు ఎమ్మెల్యే)
ప్రొద్దుటూరు శాసనసభ్యుడిగా ప్రోటోకాల్ పై ప్రశ్నించాను. అధికారం హక్కులేని, ప్రజల చేత తిరస్కరించబడిన టీడీపీ నాయకులను వేదికలెక్కించి.... ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా కలెక్టర్ స్వయంగా ప్రోత్సహిస్తున్నాడు.  అందుకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను.. ఫోటోలు, వీడియో క్లిప్పింగ్ లతో సహా బహిర్గతం చేశాం. తెలుగుదేశం పార్టీ నాయకులను కలెక్టర్ నెత్తికెత్తుకొని... రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కి కడపను వారి అబ్బ సొత్తుగా భావించి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇది చట్టరీత్యా నేరం, ప్రజాస్వామ్యవాదులకు అవమానం. 

చట్ట సభల చేత తిరస్కరించబడిన టీడీపీ నాయకులకేమో పురస్కారాలు, ప్రజలు ఆమోదించబడిన వారికేమో తిరస్కారాలా. ఇది కలెక్టర్ తీరు.  ప్రోటోకాల్ పాటించమంటే...మా ప్రభుత్వం కాబట్టి ఎవరినైనా పిలుస్తామని,  దుర్మార్గమైన ఆలోచనతో తలకెక్కి మాట్లాడుతున్నారు. కడపను ఏలుకుంటాం, ప్రజల అభిప్రాయాలు మాకు అవసరం లేదని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ప్రజలే ప్రభుత్వానికి తగిన శాస్తి చేస్తారు. 

No comments:

Post a Comment