13 February 2016

బాబు కుట్రలు పటాపంచల్

చంద్రబాబు ఎల్లో రాజకీయాలను తిప్పికొట్టిన ఎమ్మెల్యేలు
ప్రాణమున్నంతవరకు వైఎస్సార్సీపీలోనే కొనసాగుతాం
వైఎస్ జగన్ ను సీఎం చేయడమే తమ లక్ష్యం
పాలన చేతగాకనే బాబు కుట్ర రాజకీయాలు 
వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వంపై పోరాడుతాం

ప్రజల పార్టీ విశ్వసనీయత గల వైఎస్సార్సీపీని దొంగ దెబ్బతీయడానికి సీఎం చంద్రబాబు చేసిన కుట్ర బెడిసికొట్టింది. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భగ్గమన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారంటూ చంద్రబాబు తన ఎల్లోమీడియాలో వార్తలు రాయిస్తూ...కుయుక్తులు పన్నడంపై మండిపడుతున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేక చేతగానితనంతోనే .....చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న టీడీపీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షంపై దుష్ర్పచారానికి తెగబడుతోందని  నిప్పులు చెరిగారు. తెలంగాణలో పార్టీని అమ్మేసుకున్న చంద్రబాబు...ఏపీలో పాలన చేతగాకనే పచ్చరాతలు రాయిస్తున్నారని విమర్శించారు. పచ్చపార్టీ దుష్ప్రచారాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో తిప్పికొట్టారు. 

తెలంగాణాలో టీడీపీ తుడుచుకుపెట్టుకుపోతుండడంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకే...బాబు  తమ అనుకూల మీడియా ద్వారా వైఎస్సార్సీపీపై దుష్ర్పచారం చేయిస్తున్నారని తేటతెల్లమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, శ్రేణులు సమష్టిగా తిప్పికొట్టడంతో టీడీపీ బిత్తరపోయింది. కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని ఎమ్మెల్యేలు కుండబద్ధలు కొట్టారు . చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై తమ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పోరాడతామన్నారు. వైఎస్ జగన్ ను సీఎం చేయడమే తమ లక్ష్యమని తేల్చిచెప్పారు. 

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదే గెలుపు
రెండేళ్లలోనే చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, చంద్రబాబు గోదావరి పురష్కరాలకు రూ.1200 కోట్లు, రాజధాని శంకుస్థాపనకు రూ. 400 కోట్లు , విదేశీ పర్యటనలకు వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జీతాలిచ్చేందుకు కూడా డబ్బులు లేవంటూనే...ప్రచార ఆర్భాటం కోసం ఇంత సొమ్ము ఎలా ఖర్చు చేస్తున్నారని బాబుపై దుమ్మెత్తి పోశారు. అభివృద్ధికంటే చంద్రబాబు దోచుకోవడంపైనే ఎక్కువ దృష్టిపెట్టారని, తన బంధువులకు, అనుచరులకు, పచ్చబాబులకు విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని ఫైరయ్యారు. 

No comments:

Post a Comment