29 January 2016

చంద్రబాబు బాధ్యత తీసుకొంటారా.. లేక అధికారుల్ని బలిపశువుల్ని చేస్తారా..!

అమరావతి నిర్మాణం పేరు చెప్పి చంద్రబాబు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. సింగపూర్ కంపెనీల కోసం నిబంధనల్ని తుంగలోకి తొక్కి బాబు సర్కార్ చెలరేగుతోంది.
రాజధాని నిర్మాణంలో పర్యావరణ చట్టాల్ని ఘోరంగా తుంగలోకి తొక్కుతోందంటూ పర్యావరణ వేత్తలు శ్రీమన్నారాయణఈఎఎస్ శర్మ వేర్వేరుగా పిటీషన్లు వేశారు. రాజధాని ప్రాంతంలో పంట భూములుతడి నేలలు ఉన్నాయంటూ ట్రిబ్యునల్ నోటీసులోకి తీసుకొని వచ్చారు. దీని మీద వివరణ ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే ఇందులో ఎక్కడా తడినేలలు లేవని సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన  పిటీషన్ కు జవాబు ఇచ్చారు. అదే సమయంలో తడి నేలలు ఉన్నాయంటూ ట్రిబ్యునల్ కు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఒకే అంశం మీద రెండు రకాలు గా జవాబులు ఇస్తున్న అంశాన్ని పిటీషన్ దారులు ట్రిబ్యునల్ ద్రష్టికి తెచ్చారు.
 రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పర్యావరణ మండలి కి కేవలం 1.7 చదరపు కిలోమీటర్ల పరిధి వరకే అనుమతి ఇచ్చే అధికారం ఉంది. కానీ, 217 చదరుప కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతి తీసుకొని.. రాజధాని ప్రాంతానికి అన్ని అనుమతులు వచ్చేసినట్లుగా కలరింగ్ ఇచ్చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండే ఒక మండలి.. అదే రాష్ట్ర ప్రభుత్వానికి క్లియరెన్స్ ఇవ్వటం అన్న మాట. అది కూడా ఒక దిగువ స్థాయి అధికారి సంతకంతో ఇచ్చిన అనుమతి అన్న మాట.
 పంట పొలాల్లో చదును పూరిత కార్యకలాపాలు ఏమీ చేపట్టవద్దని ట్రిబ్యునల్ ఆదేశించింది. కానీఆ తర్వాతే లింగాయపాలెం అనే చోట అరటి తోటల్ని సిబ్బంది నరికేశారు. దీని మీద కూడా పిటీషనర్లు ట్రిబ్యునల్ నోటీసులోకి తెచ్చారు.
మొత్తం మీద ట్రిబ్యునల్ వ్యవహారాన్ని తెలివిగా అధికారుల మెడకు చుట్టేసేందుకు చంద్రబాబు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా భూ సమీకరణ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బాబు గారికి ఏమీ తెలీదనిఅంతా అధికారులే చేశారని నమ్మబలికారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో కూడా అధికారుల మీదకే నెట్టేశారు. ఇప్పుడు కూడా అదే బాటలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. 

No comments:

Post a Comment