30 October 2015

చంద్రబాబుకి ఒక చిన్న లెక్క


రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే 33 వేల ఎకరాలు లాక్కొంది. అక్కడ పంటల్ని నాశనం చేసింది. అంటే దేశ ఆహార భద్రతకు పెద్ద సవాల్ విసురుతోంది.
అమరావతి ప్రాంతంలో ఒక ఎకరా తక్కువలో తక్కువ 40 బస్తాల ధాన్యం పండుతుంది. అదీ ఒక సీజన్ లో. మనం ఒక్క సీజన్ గురించే మాట్లాడుకొందాం.
అంటే 33 వేల ఎకరాల్లో 33,000 X 40 =13,20,000. అంటే 13 లక్షల 20వేల బస్తాల ధాన్యం పండుతుంది. దీన్ని బియ్యంగా మారిస్తే 75 కిలోల చొప్పున 13,20,000×75=99,000,000 కిలోల బియ్యం అన్నమాట. ఒక కిలో బియ్యం ముగ్గురికి వేసుకొన్నా కూడా 99,000,000 ×3 =19,80,00,000 అవుతుంది. అంటే 19 కోట్ల 80 లక్షల మందికి తిండి దక్కేది అన్నమాట.

ఈ విదంగా ప్రజలకు ఆహారం దక్కకుండా చంద్రబాబు ఉసురుపోసుకొంటున్నారు. అన్నపూర్ణగా పేరు తెచ్చుకొన్న రాష్ట్రానికి ఆహారపు కరవు వచ్చేట్లు చేస్తున్నారు. 

No comments:

Post a Comment