25 June 2015

ఉప్పెనలా ఉద్యమం

 అన్ని జిల్లా కలెక్టరేట్‌ల దగ్గర ఆందోళన
 నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజానీకం
 కదం తొక్కిన రైతులు, కూలీలు, పల్లె వాసులు
 ఆందోళనలో పాలు పంచుకొన్న నాయకత్వ శ్రేణులు

 హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ నలు చెరగులా పెద్ద ఎత్తున రైతులు నిరసన గళం వినిపించారు. అన్ని రకాలుగా రైతుల్ని, వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా జిల్లా పాలనా కార్యాలయాల దగ్గర ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున ఇతర వర్గాల ప్రజలు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. 13 జిల్లా ల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది.
  రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మాట తప్పటంతో రైతులు కష్టాల్లో ఇరుక్కొని పోయారు. పాత బకాయిలు కడితే తప్ప కొత్త రుణాలు ఇవ్వబోమని బ్యాంకర్లు చెబుతుండటంతో అప్పు పుట్టడం లేదు. ఇటు ప్రైవేటు వ్యాపారులు ఇదే అదనుగా వడ్డీలు పెంచటంతో అప్పుల ఊబిలో కూరుకొని పోతున్నారు. అటు, బంగారు ఆభరణాలు వేలం వేస్తామని బ్యాంకుల నుంచి నోటీసులు అందుతున్నాయి. ఖరీప్ సీజన్ ప్రారంభమై నెల రోజులు దగ్గర పడుతున్నా చాలా చోట్ల విత్తనాలు, నారుమళ్ల కొరత వేధిస్తోంది. దీనిపై ప్రభుత్వం దగ్గర సన్నద్దత కరవైంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. కాసులు కురిపించే ప్రాజెక్టులు, పథకాల మీదనే ప్రేమ కురిపిస్తోంది. ముఖ్యంగా కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి వాదనలు వినిపించటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎంతసేపు కుంభకోణం నుంచి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్న చంద్రబాబు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో రైతు లోకం కొన్ని తరాల పాటు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈవిధమైన వైఫల్యాల మీద పోరాటంలో భాగంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది.

 అనంతపురం
  నగరంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగమేఘాలపై పట్టిసీమ నిర్మిస్తున్న చంద్రబాబుకు హంద్రీ- నీవా ప్రాజక్టు కనిపించలేదా అని ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ధర్నాలో పాల్గొన్న పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ......... ఓటుకు కోట్లు వ్యవహారంలో బిజీగా ఉన్న చంద్రబాబుకు రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

 వైఎస్సార్ జిల్లా
  కడప నగరంలోని కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు, కూలీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానాక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్‌బాషా, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు. రైతు లోకానికి చంద్రబాబు ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందీ నాయకులు విడమరిచి చెప్పారు.

 కర్నూలు జిల్లా
 కర్నూలు నగరంలో జరిగిన రైతు ధర్నాలో పెద్ద ఎత్తున వ్యవసాయ దారులు, కూలీలు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల రాకతో నిరసన వేదిక కిక్కిరిసింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతాంగ సమస్యల్ని చంద్రబాబు ఏ రకంగా గాలికి వదిలేసిందీ వివరించారు. వ్యవసాయమంటే చంద్రబాబు కి గిట్టదని అభివర్ణించారు.

 కృష్ణాజిల్లా
 విజయవాడ: రైతుల సమస్యలపై సబ్ కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, మేకా ప్రతాప్ అప్పారావు, జలీల్ ఖాన్, ఉప్పులేటి కల్పనతో పాటు పార్టీనేతలు కె.పార్థసారధి, గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 పశ్చిమగోదావరి జిల్లా
 వైఎస్సార్‌సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు తానేటి వనిత, తెల్గం బాలరాజుతో పాటు పార్టీ నేతలు వంకా రవీంద్రనాథ్, టి.వాసుబాబు, తలారి  వెంకట్రావు, కొఠారు రామచంద్రరావు, కారుమంచి రమేష్, తెల్లం గోళ్ల శ్రీలక్ష్మీ, బండి అబ్బులు పాల్గొన్నారు. ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ఎడ్ల బండ్లపై వినూత్న ర్యాలీ నిర్వహించారు.

 తూర్పు గోదావరి జిల్లా
 కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు తీరుకు నిరసగా వైఎస్సార్‌సీపీ నాయకులు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

 విశాఖపట్న జిల్లా
 ప్రజా సమస్యలపై కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ మహాదర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ఎమ్మెల్యే బి.ముత్యాలనాయుడు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు ఉషాకిరణ్, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యదర్శులు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో పాటు పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

 విజయనగరం జిల్లా
 రైతుల సమస్యలపై విజయనగరం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ మహాధర్నా నిర్వహించింది. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే రాజేంద్ర దొర, కేంద్ర పాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, అప్పల నాయుడుతో పాటు నెల్లిమర్ల, గజపతినగరం కన్వీనర్లు డా.సురేష్‌బాబు, శ్రీనివాసరావు, అరకు నియోజకవర్గ పార్లమెంట్ పరిశీలకురాలు కల్యాణి పాల్గొన్నారు.

No comments:

Post a Comment