26 June 2015

అనేక కుట్రలు..ఒక చంద్రబాబు

ఓటుకి కోట్లు కుంభకోణం సూత్రధారి చంద్రబాబు క్రమంలో కేసులో కూరుకొని పోతున్నారు. కోట్ల రూపాయిలు ఎర వేసి అడ్డంగా దొరికిపోయిన బాబు.. ఈ కేసునుంచి బయట పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని రకాల కుట్రలు వీగిపోతుండటంతో విద్వేషాలు రగల్చటం మీదనే ఆశలు పెట్టుకొన్నారు.

కేసును తప్పుదారి పట్టించేందుకు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్ని అన్వేషించే పనిలో పడ్డారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకొన్నారు. సీనియర్ పోలీసు అధికారుల బుర్రలన్నీ ఈ కేసు మీద పెట్టేలా చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు. కుంభకోణం నుంచి బయట పడే మార్గాల్ని వెతికించారు. ప్రస్తుతం చట్ట పరంగా అన్ని దారులు మూసుకొనిపోతున్నాయన్న సంకేతం వెలువడింది. దీంతో వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.   రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాల మీద దృష్టి సారించమని సీనియర్ ఐఎఎస్ అధికారులకుపురమాయించారు. పనిలో పనిగా ఫోరెన్సిక్ రంగ నిపుణుడు గాంధీ ని ప్రభుత్వ సలహాదారు గా నియమించుకొన్నారు.  చంద్రబాబు నాయుడ్ని ఒడ్డున పడవేయించుకొనేందుకు పభుత్వ ఖర్చులతో నిపుణుల్ని రప్పించుకొన్నట్లు అన్న మాట.  ఈ విధంగా కుంభకోణాలపై పనిచేయమనటం అధికారులకు కూడా ఇబ్బందికరంగా మారింది. చాలా మంది అధికారులు పైకి చెప్పుకోలేక తమలో తాము కుమిలిపోతున్న పరిస్థితి. పదే పదే గవర్నర్ పీఠాన్ని కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని చంద్రబాబు అండ్ కో దూషించారు. అటార్నీ జనరల్ నేరుగా గవర్నర్ కు లేఖ రాశారని చంద్రబాబు భజన బృందం ప్రచారం చేసింది. సెక్షన్ 8 ఉపయోగించుకోవాలని అటార్నీ జనరల్ సూచించినట్లుగా ప్రచారం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు విస్మయం చెందాయి. ఈ లోగా తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ దీనిపై వాదనలు చెలరేగాయి. అసలు ఇటువంటి లేఖ లేనే లేదని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. దీంతో ఈ మంటల్ని ఆర్పటానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. స్వయంగా తప్పుల్లో కూరుకొని పోయిన చంద్రబాబు సాగిస్తున్న ఈ విష ప్రచారాన్ని అంతా తప్పు పడుతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొన్నట్లు తెలుస్తోంది.  చంద్రబాబు కి క్రమంగా దారులు మూసుకొని పోతున్నాయి. ఒక వైపు కోట్ల రూపాయిలు ఇవ్వబోయి అడ్డంగా దొరికిపోయారు. తర్వాత అయినా దీనిపై నిజాయితీగా వ్యవహరించి ఉంటే బాగుండేది.కనీసం ధైర్యంగా న్యాయ పోరాటానికి సిద్ధ పడినా సరిపోయేది. కానీ చంద్రబాబు అతి తెలివితో వ్యవహరించారు. రక రకాల కుట్రలు చేసి బయట పడేందుకు ప్రయత్నించారు. అన్ని శక్తుల్ని మోహరించటమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థల్ని దుర్వినియోగం చేయటం వివాదాస్పదం అయింది. చివరకు కుట్రలు బెడిసికొట్టడంతో విద్వేషాలు రగల్చటం మీదనే ఆశలు పెట్టుకొన్నారు. అన్ని దారులూ మూసుకొని పోయి జైలు దారి స్పష్టంగా కనిపిస్తోండటంతో చంద్రబాబు ఈ మార్గాన్ని ఎంచుకొన్నారు.  రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చిన చంద్రబాబు వీటిని ఆరకుండా చూసుకొంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా కర్నూలు, ప్రకాశం జిల్లా ల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పాడాలని చంద్రబాబు అండ్ కో ఇప్పటికే నిర్ధారణకు వచ్చేసింది. అక్కడ ఎంపీటీసీలను ఎత్తుకెళ్లిపోయి క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రెడ్ హ్యాండెడ్ గా వీటిని భగ్నం చేశారు. ఎంపీటీసీ కు రూ.3 లక్షల చొప్పున బేరం పెట్టినట్లు నిర్దారణ అయిది. అయినా వాటిని బయటకు రాకుండా పచ్చ చొక్కాలు జాగ్రత్త పడ్డారు. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ పెద్దగా ప్రయోజనం కలగటం లేదు.
 అటువంటి వార్తలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వీటికి పెద్ద ప్రాధాన్యం దక్కకుండా ఉండాలంటే విద్వేషాల్ని కొనసాగించాలని నిర్ణయించారు.  రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చిన చంద్రబాబు వీటిని ఆరకుండా చూసుకొంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా కర్నూలు, ప్రకాశం జిల్లా ల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పాడాలని చంద్రబాబు అండ్ కో ఇప్పటికే నిర్ధారణకు వచ్చేసింది. అక్కడ ఎంపీటీసీలను ఎత్తుకెళ్లిపోయి క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. అటువంటి వార్తలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వీటికి పెద్ద ప్రాధాన్యం దక్కకుండా ఉండాలంటే విద్వేషాల్ని కొనసాగించాలని నిర్ణయించారు.ఎన్నికల హామీలను చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారు. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగులకు భృతి, బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణం వంటి అనేకహామీలను వదిలిపెట్టారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక హోదా ఇప్పిస్తానని చెప్పి ఆ విషయం పట్టించుకోవటం లేదు. రాజధాని ప్రాంతంలో వేలాది ఎకరాలు లాక్కొని సింగపూర్ కంపెనీలకు అప్పగించేస్తున్నారు. ఈ విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలంటే రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగల్చటమే మార్గమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే అన్ని మార్గాల్ని ఆయన ఉపయోగించుకొంటున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
 అబద్దపు ప్రచారాలు
 ఈ విషయంలో సాధ్యమైనన్ని అబద్దపు ప్రచారాలు చేసేందుకు చంద్రబాబు ఒడిగట్టారు. సూటిగా ఆధారాలు కనిపిస్తున్నా మాయ చేసేందుకు ఆరాటపడ్డారు. చంద్రబాబు అబద్దపు  ప్రచారాలు ఇలా సాగాయి.

 చంద్రబాబు అబద్ద్దం- టేపులు అతికించినవి, ఎక్కడెక్కడో మాట్లాడితే.. ఒక చోట అతికించారు.
 నిజం- ఆడియో, వీడియో టేపులు అతికినవి కావని ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టు
 చంద్రబాబు అబద్ద్దం- ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేసుల విషయం ఎన్నికల సంఘం చూసుకొంటుంది.
 నిజం- ఈకేసు అవినీతి కేసని ఎన్నికల సంఘం తేల్చేసింది. ఏసీబీ కేసు కూడా ఫైల్ చేయవచ్చని నిర్ధారించింది. కోర్టు తీర్పు వచ్చాక ఈసీ వైపు నుంచి చర్యలు ఉంటాయని చెప్పింది.

 చంద్రబాబు అబద్దం- ఆడియో, వీడియో టేపుల్ని కోర్టులు పరిగణనలోకి తీసుకోవని ప్రచారం
 నిజం- సాక్ష్యాధారచట్ట ప్రకారం డిజిటల్ సాక్ష్యాలు చెల్లుబాటు అవుతాయి. వీటిని నిపుణుల చేత నిర్దారించాలి. ఇప్పుడు ఆ తంతు కూడా పూర్తయింది

 చంద్రబాబు అబద్దం- సెక్షన్ 8 అమలు చేయాలంటూ గవర్నర్ కు అటార్నీ జనరల్ లేఖ రాశారు
 నిజం- అటువంటి లేఖలు ఏమీ ఇవ్వలేదని కేంద్ర న్యాయశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది

 చంద్రబాబు అబద్దం- అనేకమంది ఫోన్లను ట్యాప్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఉన్నతాధికారులు సహా 120 మంది ఫోన్లు ట్యాప్ చేశారు.
 నిజం- ట్యాపింగ్ జరగలేదని మొబైల్ ఆపరేటర్లు స్పష్టం చేశారు.

 చంద్రబాబు అబద్దం- అవసరమైతే హైదరాబాద్లో ఏపీ పోలీసు స్టేషన్లు అంటూ హడావుడి
 నిజం- చట్టప్రకారం ఇది సాధ్యం కాదని స్పష్టీకరణ. విషయాన్ని పక్క దారి పట్టించేందుకే ఈ హడావుడి అని రుజువు

No comments:

Post a Comment