26 June 2015

పచ్చని పంట పొలాలు లాక్కోవటమేనా అభివృద్ధి..!

ఉత్తరాంధ్రలో ప్రభుత్వం తలపెట్టిన భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం రానురాను వివాదాస్పదం అవుతోంది. ఎకా ఎకిన వేల ఎకరాల భూముల్ని లాక్కోవటంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. పెద్ద పెద్ద విమానాశ్రయాలకు కూడా వందల ఎకరాలు సరిపోతుంటే భోగాపురం ఎయిర్ పోర్టుకి వేలాది ఎకరాలు ఎందుకన్న ప్రశ్న వినిపిస్తోంది.
    వాస్తవానికి విశాఖ నగరానికి ఉత్తర దిశగా రియల్ ఎస్టేట్ కదలికలు చాలా కాలం క్రితమే మొదలయ్యాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే ఇది మొదలైంది. ప్రభుత్వంలోని కొందరు పెద్దల తరపున కొనుగోళ్లు జోరుగా సాగాయి. తర్వాత అన్నీ తమ చేతుల్లోకి వ చ్చాయని నిర్ధారణ అయ్యాక, ఈ భూముల రేటులు పెరిగేట్లుగా స్కెచ్ వేసుకొన్నారు. ఇందుకు అనుగుణంగా వేలాది ఎకరాల్లో భోగాపురం ఎయిర్ పోర్టు ను ప్రకటించారు. అటు విశాఖ పట్నం నగరం, ఇటు ఎయిర్ పోర్టు అంటూ సొంత భూముల రేట్లు పెంచేసుకొన్నారు.  ఒక్కసారిగా ఎయిర్ పోర్టు పిడుగు పడేసరికి భోగాపురం మండలంలోని రైతులకు దిక్కు తోచలేదు. దీన్ని తమకు వద్దని ఎన్నిసార్లు మొత్తుకొన్నా ఉపయోగం లేదు. ఈలోగా ప్రతిపాదిత గ్రామాల్లో కాకుండా వేరే గ్రామాల్లో విమానాశ్రయం నిర్మించాలన్న నిర్ణయం వెలువడింది. దీంతో రోడ్డున పడటం రైతుల వంతయింది. ముంజేరు, చాకివలస, రామచంద్రపేట, భోగాపురం పంచాయతీల్లోని ప్రజలు నిరాశ్రయులుగా మారుతున్నారు. ఒక్కసారిగా పంట పొలాల్ని ప్రభుత్వం లాక్కొంటుందని తెలియటంతో ఆందోళన బాట పట్టారు. భూములు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. గురువారం నాడు వందల మంది రైతులు ఆందోళన కు దిగారు. ఎర్ర బస్సుకే దిక్కు లేదు.. ఎయిర్ బస్సు ఎగిరింతారంట...అంటూ నినాదాలు చేశారు. రెవిన్యూ అదికారులు ప్రమోషన్ల కోసం తమ నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని విన్నవించారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ పట్టించుకోవటం లేదని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొడుతోందని విమర్శించారు. వందల మంది ఒక్కసారిగా ర్యాలీ తీయటంతో భోగాపురం వీధులన్నీ నినాదాలతో దద్దరిల్లాయి. ఈ సందర్భంగా ఆందోళన కారులు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని మాట తప్పారని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని మాట తప్పారని, పేదలకు ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. పింఛన్లు, రేషన్ కార్డులు,  వంటివి కొత్త వి రాకపోగా, ఉన్నవాటినే రద్దుచే స్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అవేమీ తాము అడగటం లేదని, తమ గ్రామాల్ని వదిలేస్తే తమ బతుకేదో తాము బతుకుతామని వేడుకొంటున్నారు. ఊరంతా ఆందోళనలతో దద్దరిల్లినా అధికార పార్టీ నాయకులు అటుకేసి తొంగి చూడలేదు. దీంతో చివరకు  రెవిన్యూ అధికారులు, పోలీసు అధికారులకు వినతి పత్రాలు అందించి ఆందోళన కారులువెనుదిరిగారు. 

No comments:

Post a Comment